India U19 vs Afghanistan U19
-
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
భారత అండర్-19 క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్ వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యువ భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా హాఫ్ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్ ఐర్లాండ్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్ వర్సెస్ భారత్మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
WC 2026: వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్ సిక్స్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్ జట్టుతో తలపడింది.ఇద్దరు శతకాలు బాదిహరారేలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్ బ్యాటర్లలో ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగి.. అఫ్గన్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్‌ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.మిగతా వారిలో విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్ దంచికొట్టడంతో అఫ్గన్ విధించిన లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో నూరిస్తాని ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ఫైనల్ జరుగనుంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారుHighest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | IND 🆚 ENG | FRI, 6th FEB, 1 PM pic.twitter.com/Pzay5mAdoI— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
World Cup 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్‌వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో నూరిస్తాని ఒమర్జాయ్ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్ సదాత్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. కాగా ఓపెనర్ ఆరోన్ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్ 310 పరుగులు సాధించింది. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో అఫ్గన్ బ్యాటర్లుకు లైఫ్ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్ రెండో సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్ సదాత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్ బ్యాటర్ ఉజైరుల్లా నియాజాయ్ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరుఅండర్-19 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ -
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు -
భారత జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ కుర్రాడు
అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్‌తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. స్కూల్ క్రికెట్లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్‌లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారత్‌కు ఆడటమే లక్ష్యం‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే అండర్–19 ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే జట్లను జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్ ఈ సిరీస్‌లో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది.‘బి’ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ‘ఎ’ టీమ్‌కు పంజాబ్‌కు చెందిన విహాన్ మల్హోత్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.దీనికి ఆరోన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ నుంచి నలుగురు ప్లేయర్లకు ముక్కోణపు సిరీస్‌లో ఆడే అవకాశం లభించింది. ‘బి’ కెప్టెన్ ఆరోన్ జార్జ్‌తో పాటు అండర్–19 ‘ఎ’ టీమ్‌లోకి హైదరాబాద్‌కు చెందిన వాఫి కచ్చి, రాపోలు అలంకృత్ (వికెట్ కీపర్), మొహమ్మద్ మాలిక్ ఎంపికయ్యారు.ద్రవిడ్ తనయుడికి చోటు..ఇక బి’ టీమ్‌లో వికెట్ కీపర్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid)కు అవకాశం దక్కింది. అన్వయ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ ఇటీవల వినూ మాన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.అంతేకాకుండా ఈ నెలలో హైదరాబాద్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ సికి అతడు ప్రాతినిథ్యం వహించాడు. జూనియర్ ద్రవిడ్ అండర్-16 స్ధాయిలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) 2023-24 సీజన్ అన్వయ్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, 5 మ్యాచ్‌లలో 45 సగటుతో 357 పరుగులు సాధించాడు. అంతకుముందు ఒక అండర్-16 ఇంటర్-జోనల్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇదే జోరును అన్వయ్ కొనసాగిస్తే త్వరలోనే భారత అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.చదవండి: PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్‌తో సిరీస్‌కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్‌కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్‌లో వికెట్ కీపర్‌గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్ -
అఫ్గనిస్తాన్‌తో ‘ట్రై’ సిరీస్.. ధనాధన్‌కు వైభవ్ సూర్యవంశీ రెడీ!
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). బిహార్‌కు చెందిన ఈ పిల్లాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) నమోదు చేసిన తర్వాత.. భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు వైభవ్. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బిహార్ జట్టు వైస్ కెప్టెన్ (Bihar Vice Captain)గానూ వ్యవహరిస్తున్నాడు.మరోసారి భారత్‌కు ప్రాతినిథ్యంఅయితే, వచ్చే నెలలో వైభవ్ సూర్యవంశీ మరోసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. తమ అండర్-19 జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఇటీవలే ప్రకటించింది. భారత అండర్-19 స్థాయిలోని ‘A’, ‘B’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది.జట్టులో చోటు లాంఛనమేఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్- భారత అండర్-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్ డబుల్ రౌండ్- రాబిన్ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి.వరల్డ్‌కప్ టోర్నీ సన్నాహకంగాకాగా నవంబరు 17 నుంచి నవంబరు 30 వరకు భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల మధ్య యూత్ వన్డే ట్రై సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇందుకు వేదిక. కాగా ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఈ సిరీస్ ఇరుజట్లకు సన్నాహకంగా నిలవనుంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ స్టార్లు అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అడుగుపెట్టేందుకు బాటలు వేయనుంది.ఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టుకు ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆయుశ్ జట్టును ముందుకు నడిపించగా.. వైభవ్ ఓపెనర్‌గా భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల వన్డే ట్రై సిరీస్ షెడ్యూల్ ఇదే👉నవంబరు 17: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 19: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 21: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 23: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 25: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 27: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 30: ఫైనల్.చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్


