భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే అండర్–19 ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే జట్లను జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్ ఈ సిరీస్‌లో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది.
‘బి’ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ‘ఎ’ టీమ్‌కు పంజాబ్‌కు చెందిన విహాన్ మల్హోత్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.
దీనికి ఆరోన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ నుంచి నలుగురు ప్లేయర్లకు ముక్కోణపు సిరీస్‌లో ఆడే అవకాశం లభించింది. ‘బి’ కెప్టెన్ ఆరోన్ జార్జ్‌తో పాటు అండర్–19 ‘ఎ’ టీమ్‌లోకి హైదరాబాద్‌కు చెందిన వాఫి కచ్చి, రాపోలు అలంకృత్ (వికెట్ కీపర్), మొహమ్మద్ మాలిక్ ఎంపికయ్యారు.
ద్రవిడ్ తనయుడికి చోటు..
ఇక బి’ టీమ్‌లో వికెట్ కీపర్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid)కు అవకాశం దక్కింది. అన్వయ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ ఇటీవల వినూ మాన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అంతేకాకుండా ఈ నెలలో హైదరాబాద్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ సికి అతడు ప్రాతినిథ్యం వహించాడు. జూనియర్ ద్రవిడ్ అండర్-16 స్ధాయిలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) 2023-24 సీజన్ అన్వయ్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్‌లో అన్వయ్ కర్ణాటక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, 5 మ్యాచ్‌లలో 45 సగటుతో 357 పరుగులు సాధించాడు. అంతకుముందు ఒక అండర్-16 ఇంటర్-జోనల్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇదే జోరును అన్వయ్ కొనసాగిస్తే త్వరలోనే భారత అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదే
విహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్‌జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.
భారత్ అండర్-19 ‘బి’ జట్టు
ఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్‌వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.
చదవండి: PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు


