న్యూఢిల్లీ: వచ్చే నెలలో 12 నుంచి 21 వరకు దుబాయ్ వేదికగా జరిగే అండర్–19 ఆసియా కప్ టోరీ్నలో పోటీపడే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జికు ఈ జట్టులో స్థానం లభించింది. ఆరోన్ జార్జి సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచింది. 15 మంది సభ్యులతో కూడిన భారత అండర్–19 జట్టుకు ముంబైకు చెందిన ఆయుశ్ మాత్రే సారథిగా వ్యవహరిస్తాడు. విహాన్ మల్హోత్రా వైస్‌కెపె్టన్‌గా ఎంపికయ్యాడు. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోరీ్నలో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జింబాబ్వే, నమీబియా వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇటీవల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ... ఈ టోరీ్నలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. టోరీ్నలో భాగంగా డిసెంబర్ 12న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్థి ఇంకా తేలలేదు. రెండో మ్యాచ్‌లో 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. డిసెంబర్ 16న మూడో లీగ్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 19న సెమీఫైనల్స్, 21న ఫైనల్ జరగనున్నాయి.
భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే
(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వన్‡్ష, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్, నమన్, దీపేశ్, హెనిల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జి. స్టాండ్‌బై ప్లేయర్లు: రాహుల్, హెమ్‌చుడెశన్, కిషోర్, ఆదిత్య రావత్.


