క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ | Lakshya Sen in the quarterfinals of the All England Badminton Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌

Mar 6 2026 3:44 AM | Updated on Mar 6 2026 3:44 AM

Lakshya Sen in the quarterfinals of the All England Badminton Championship

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌  బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్‌... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. 

గతంలో లాంగ్‌ అంగుస్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్‌ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా)తో ఆడతాడు. టాంగ్‌ చున్‌ మన్‌–సె యింగ్‌ సుయెట్‌ (హాంకాంగ్‌)లతో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement