ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్ వివాహం గురువారం సానియా చందోక్‌తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, ఐసీసీ చైర్మన్ జై షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్‌రౌండర్ అర్జున్ దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 77 మ్యాచ్‌లు ఆడాడు.


