చెన్నై: అంచనాలకు ఏమాత్రం అందని విజయం..! ఒంటరి పోరులో ‘దళపతి’ విజయ విహారం..! పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ రెండు చోట్లా ‘విజిల్’మోత! చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్‌గా విజయ్.. రెండేళ్లలోనే బలమైన రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు.. తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.
టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది.


