breaking news
Aaron George
-
భారత జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ కుర్రాడు
అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్‌తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. స్కూల్ క్రికెట్లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్‌లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారత్‌కు ఆడటమే లక్ష్యం‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్‌తో సిరీస్‌కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్‌కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్‌లో వికెట్ కీపర్‌గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్


