World Cup 2026: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం | U19 WC 2026 IND v AFG Semis: Vaibhav Suryavanshi Fiery 33 Ball 68 Video | Sakshi
Sakshi News home page

WC 2026: వరల్డ్‌కప్‌ సెమీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం

Feb 4 2026 6:04 PM | Updated on Feb 4 2026 6:17 PM

 U19 WC 2026 IND v AFG Semis: Vaibhav Suryavanshi Fiery 33 Ball 68 Video

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI)

భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్‌ దంచికొట్టాడు.

24 బంతుల్లోనే..
కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

సుడిగాలి ఇన్నింగ్స్‌
వైభవ్‌ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్‌ సదాత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ పెవిలియన్‌ చేరాడు. కాగా ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.

311 పరుగుల లక్ష్యం
కాగా వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగారు.

ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్‌ 310 పరుగులు సాధించింది. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది.

చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement