ప్రపంచకప్‌ సెమీఫైనల్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ | ICC Under 19 world cup 2026 Semi Final 2: Afghanistan won the toss and choose to bat | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌

Feb 4 2026 12:49 PM | Updated on Feb 4 2026 1:59 PM

ICC Under 19 world cup 2026 Semi Final 2: Afghanistan won the toss and choose to bat

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. హరారే వేదికగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌ తాడోపేడో తేల్చుకుంటుంది.

తుది జట్లు..
ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్‌

భారత్‌: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Advertisement
 
Advertisement
Advertisement