breaking news
Vihaan Malhotra
-
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్‌కు 45 పరుగులు జతచేశారు.ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.అబేధ్యమైన మూడో వికెట్‌కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ విహాన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.పదకొండేళ్ల తర్వాతఇక మరో సెమీఫైనల్లో దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటేభారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్- యూఏఈ (IND vs UAE) మ్యాచ్‌తో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.దంచికొట్టిన భారత బ్యాటర్లుఇందులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్ త్రివేది (38) కూడా రాణించాడు.ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్, ఓపెనర్ ఆయుశ్ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక యూఏఈ బౌలర్లలో యుగ్ శర్మ, ఉద్దిశ్ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్ డిసౌజా, కెప్టెన్ యాయిన్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.కుదేలైన యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ఇక భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ యాయిన్ రాయ్ (17), షాలోమ్ డిసౌజా (4).. వన్‌డౌన్ బ్యాటర్ అయాన్ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్ రేయాన్ ఖాన్ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్ హుదాదాద్ డకౌట్ అయ్యాడు.మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఐదో నంబర్ బ్యాటర్ పృథ్వీ మధు (50), ఉద్దిశ్ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ సలే అమీన్ (20 నాటౌట్) తన వంతు ప్రయత్నం చేశాడు.234 పరుగుల తేడాతో జయభేరిఅయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ రెండు వికెట్లు తీయగా.. కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్యVaibhav Sooryavanshi moves. The action responds. 😮💨A classy grab from our Boss Baby 👏 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/5w0MUUWzzZ— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
ప్చ్.. సారీ వైభవ్ సూర్యవంశీ!
ఆసియా క్రికెట్ మండలి ఆధ్వర్యంలో అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. గ్రూప్-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).. భారత యువ జట్టును ఢీకొట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.56 బంతుల్లోనే సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఓ దశలో డబుల్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, ఉద్దిశ్ సూరి బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో వైభవ్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మొత్తంగా ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. తొమ్మిది ఫోర్లు, పద్నాలుగు సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు. అతడికి తోడు ఆరోన్ జార్జ్ (69), విహాన్ మల్హోత్రా (69).. వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.ప్చ్.. సారీ వైభవ్ సూర్యవంశీ!ఇదిలా ఉంటే.. యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. ఇటీవల ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై 52 బంతుల్లోనే శతక్కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే, తాజాగా వైభవ్ ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో సాధించిన శతకానికి మాత్రం యూత్ వన్డేల్లో చోటు దక్కదు.కారణం ఇదేఅండర్-19 ఆసియా కప్‌లో అసోసియేట్ జట్లతో జరిగే మ్యాచ్‌లకు యూత్ వన్డే హోదా లేదు. అందుకే యూఏఈపై వైభవ్ సాధించిన సెంచరీకి రికార్డుల్లో స్థానం లేకుండా పోయింది. అయితే, తదుపరి (డిసెంబరు 14)న పాకిస్తాన్‌తో జరిగే ఆసియా కప్ మ్యాచ్‌లో గనుక వైభవ్ సెంచరీ బాదితే అది రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్ టోర్నీలో టెస్టు హోదా కలిగిన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రమే యూత్ వన్డే హోదా ఉంటుంది.ఇప్పటికే మూడు శతకాలుఇదిలా ఉంటే.. ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో అసోసియేట్ జట్లతో జరిగిన మ్యాచ్‌లకు మాత్రం యూత్ వన్డే స్టేటస్ ఉంటుంది. అంటే.. ప్రపంచకప్ టోర్నీలో యూఏఈతో భారత్ ఆడే మ్యాచ్‌ల రికార్డులు పరిగణనలోకి వస్తాయి.ఇక సీనియర్ టీ20 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మూడు శతకాలు సాధించాడు. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున.. ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈపైనా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర మీదా వైభవ్ శతక్కొట్టాడు.A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్‌తో సిరీస్‌కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్‌కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్‌లో వికెట్ కీపర్‌గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్ -
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విఫలం.. అయినా భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో నామమాత్రపు మూడో యూత్ వన్డే (IND U19 vs AUS U19 3rd ODI)లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈసారి మాత్రం పదహారు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక.. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6, 0, 4)బ్యాట్‌తో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. టాపార్డర్‌లో ఇలా ఓపెనర్లు నిరాశపరిచినా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (40) మాత్రం ఫర్వాలేదనిపించాడు.అదరగొట్టిన వేదాంత్, రాహుల్అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్ (Rahul Kumar) అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వేదాంత్ 92 బంతుల్లో 86, రాహుల్ కుమార్ 84 బంతుల్లో 62 పరుగులు సాధించారు. మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ హర్వన్ష్ పంగాలియా 23, ఖిలాన్ పటేల్ 20* పరుగులు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత అండర్-19 జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆసీస్ యువ బౌలర్లలో విల్ బిరోమ్, కేసీ బార్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్ల్స్ లాచ్మండ్, బెన్ గోర్డాన్, కెప్టెన్ విల్ మలాజుక్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇప్పటికే సిరీస్ 2-0తో కైవసంకాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక శుక్రవారం నాటి మూడో యూత్ వన్డేలోనూ బ్యాటింగ్ పరంగా మరోసారి దుమ్మురేపింది. ఇక బౌలర్ల పనే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 68 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (IND U19 vs AUS U19)తో రెండో యూత్ వన్డేలో ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు అద్భుత అర్ధ శతకం సాధించాడు. కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. Vaibhav Suryavanshi's first game in Australia was seriously entertaining 👏Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG— cricket.com.au (@cricketcomau) September 22, 2025 ఆసీస్‌పై 1-0తో ఆధిక్యంఇక నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఫలితంగా ఆసీస్‌పై 1-0తో ఆధిక్యం సాధించిన భారత్.. తాజాగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ అదరగొట్టింది. బ్రిస్బేన్ వేదికగా రెండో యూత్ వన్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.ఆయుశ్ మాత్రే డకౌట్ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టాడు. వీరిద్దరు అద్భుత అర్ధ శతకాలతో రాణించారు.వైభవ్, విహాన్ హాఫ్ సెంచరీలువైభవ్ మొత్తంగా 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించగా.. విహాన్ 74 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 70 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో వేదాంత్ త్రివేది 26 పరుగులు చేయగా.. వికెట కీపర్ బ్యాటర్ అభిగ్యాన్ కుందు మరోసారి హాఫ్ సెంచరీతో అలరించాడు.అభిగ్యాన్ మరోసారిఅభిగ్యాన్ 64 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 71 పరుగులు సాధించాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు రనౌట్ అయ్యాడు. ఏదేమైనా టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగడంతో టీమిండియా 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా అండర్-19 బౌలర్లలో విల్ బైరోమ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. కెప్టెన్ యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో కాసే బార్టన్, హైడెన్ షీలర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ ఘన విజయంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు.. 47.2 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో గెలిచిన భారత యువ జట్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే మూడు వికెట్లతో రాణించగా.. కనిష్క్ చౌహాన్ రెండు, కిషన్ కుమార్, ఆర్ఎస్ అంబరీశ్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను...


