యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.
అసలేం జరిగిందంటే?
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ తొలి బంతిని.. లబుషేన్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.
వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోగా.. లబుషేన్ మాత్రం బంతి నేలకు తగిలి చేతిలోకి వచ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ లబుషేన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఈ ఆసీస్ షాకయ్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేలకు తాకినట్లు అన్పించింది. థర్డ్ అంపైర్ అసహనం వ్యక్తం చేస్తూ లబుషేన్ మైదానాన్ని వీడాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: గంభీర్‌కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
What did you make of this catch? Out or not out?#Ashes | #DRSChallenge | @Westpac pic.twitter.com/pnWo2qt6qc
— cricket.com.au (@cricketcomau) December 27, 2025


