ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్ 1న వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు బ్రూక్ ఓ నైట్ క్లబ్ బౌన్సర్‌తో దురుసగా ప్రవర్తించాడు.
నైట్‌క్లబ్‌లోకి వెళ్లేందుకు బ్రూక్ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్‌ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
సారీ చెప్పిన బ్రూక్..
ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యలతో నా జట్టుకు, దేశానికి తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.
ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో బ్రూక్ పేర్కొన్నాడు.
ఈసీబీ సీరియస్
ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. బ్రూక్‌కు 30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది.
ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.
చదవండి: అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..


