T20 World Cup: ఇంగ్లండ్‌ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక | England Beats Srilanka By 51 Runs In T20 World Cup Super 8 | Sakshi
Sakshi News home page

T20 World Cup: ఇంగ్లండ్‌ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక

Feb 22 2026 6:26 PM | Updated on Feb 22 2026 6:28 PM

England Beats Srilanka By 51 Runs In T20 World Cup Super 8

పల్లెకెలె: టీ 20 వరల్డ్‌కప్‌లో  ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 51 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది.  తొలుత బ్యాటింగ్‌ చేసి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్‌.. ఆపై శ్రీలంకను 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని అందుకుంది. 

శ్రీలంక ఆటగాళ్లలో దసునా షనాకా(30) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో సొంత గడ్డపై శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్‌, డావ్‌సన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించారు.  ఫలితంగా శ్రీలంకకు ఘోర పరాజయం తప్పలేదు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.  ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌(62)  ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇంగ్లండ్‌ వికెట్లు ఓ వైపు పడుతున్నా సాల్ట్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. దాంతో ఇంగ్లండ్‌ మూడంకెల స్కోరును దాట కల్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement