వెస్టిండీస్ బ్యాట‌ర్ల విధ్వంసం.. ఏకంగా 254 ప‌రుగుల భారీ స్కోర్ | Shimron Hetmyer blitzkrieg powers Windies to 254-6 in Mumbai | Sakshi
Sakshi News home page

T20 WC 2026: వెస్టిండీస్ బ్యాట‌ర్ల విధ్వంసం.. ఏకంగా 254 ప‌రుగుల భారీ స్కోర్

Feb 23 2026 9:06 PM | Updated on Feb 23 2026 9:32 PM

Shimron Hetmyer blitzkrieg powers Windies to 254-6 in Mumbai

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెన‌ర్లు బ్రాండెన్ కింగ్‌(9), షాయ్ హోప్(14) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్‌మైర్ అయితే జింబాబ్వే బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్‌మైర్ కేవ‌లం  బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అత‌డితో పాటు రావ్‌మ‌న్ పావెల్(59), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(31), షెఫ‌ర్డ్‌(21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌల‌ర‌ల్లో నగార‌వ, ముజ‌ర్‌బానీ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..  క్రీమ‌ర్‌, ఎవెన్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం.

 

Advertisement
 
Advertisement
Advertisement