breaking news
West Indies
-
PAK vs WI: విధి రాసిన విజయం..! గ్యారీ సోబర్స్‌కు విండీస్ ఘన నివాళి
సొంత గడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ను 90 పరుగుల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ అద్బుత విజయాన్ని లెజెండరీ ఆల్‌రౌండర్, దివంగత సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అంకితమిచ్చాడు.యాదృచ్ఛికంగా సోబర్స్ 90వ పుట్టిన రోజు నాడే విండీస్ ఈ మ్యాచ్ గెలవడం గమనార్హం. అంతేకాకుండా కరేబియన్ జట్టు సరిగ్గా 90 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇంకా హైలెట్. కాగా గ్యారీ సోబర్స్ జులై 17న అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే."వెస్టిండీస్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు తరఫున ఈ విజయాన్ని దివంగత దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు అంకితం ఇస్తున్నాం. ఆయన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. మా జట్టులోని ప్రతి ఒక్కరికీ ఆయనే ఆదర్శం. తన సుదీర్ఘ కెరీర్లో సోబర్స్ సాధించనిది లేదు. ఈ రోజు ఆయన 90వ బర్త్‌డే. సరిగ్గా మేము కూడా 90 పరుగుల తేడాతో గెలిచాం.ఇది ఆయన కోసం రాసిపెట్టినట్లే అనిపిస్తోంది. సోబర్స్‌ను గౌరవించుకోవడానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆయన పై నుంచి చూస్తూ సంతోషపడుతుంటారు అనుకుంటున్నా. గార్ఫీల్డ్ సోబర్స్ సర్... వెస్టిండీస్ క్రికెట్‌కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేశామని ఆశిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి" అని డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుతూ చేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.For the Legend With Love 🖤Historic win for the team on Sir Garry’s 90th. #WIvPAK pic.twitter.com/2yLXAkXQ6a— Windies Cricket (@windiescricket) July 28, 2026 -
పాక్‌తో తొలి టెస్ట్.. హోప్ సెంచరీ మిస్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్ ఈ స్కోరైనా చేయగలిగింది.మిగతా ప్లేయర్లలో తేజ్‌నరైన్ చంద్రపాల్ 21, బ్రాండన్ కింగ్ 12, ఆమిర్ జాంగూ 21, జస్టిన్ గ్రీవ్స్ 15, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 10, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్ 23, జేడన్ సీల్స్ డకౌట్, జోమెల్ వార్రికన్ 1 (నాటౌట్) చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్ అబ్బాస్ 3, ఖుర్రమ్ షెహజాద్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్, తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 23 పరుగులకు ఔట్ కాగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్ డకౌటయ్యాడు. షాన్ మసూద్‌తో పాటు సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, షమార్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. -
పాక్‌తో తొలి టెస్ట్.. హాడ్జ్ అజేయ అర్ధశతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ (21), బ్రాండన్ కింగ్ (12), ఆమిర్ జాంగూ (21) ఔట్ కాగా.. కవెమ్ హాడ్జ్ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్ హోప్ (39) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ తీశారు.వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్‌ను అబ్బాస్ పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఆమిర్ జమాల్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్ జాంగూను అబ్బాస్ పెవిలియన్‌కు పంపాడు.అనంతరం షాయ్ హోప్‌తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్ వెస్టిండీస్ సెలెక్ట్ ఎలెవెన్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పాక్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్, బాబర్ ఆజం సెంచరీలు చేశారు. -
పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్‌కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్‌పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌లకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.కాగా ఆల్‌రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
పరువు కాపాడిన హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్.. విండీస్‌దే చివరి వన్డే
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ తన పరువును కాపాడుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కివీస్‌కు అప్పగించిన వెస్టిండీస్ బుధవారం జరిగిన చివరి వన్డేలో మాత్రం 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 269 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ సీనియర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ (69 నాటౌట్) కడదాకా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించగా, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ (61) అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. రూథర్‌ఫోర్డ్ ఔటయ్యాకా మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ హెట్‌మైర్ అజేయంగా నిలిచి విండీస్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేడన్ లెన్నోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, మైకెల్ బ్రాస్‌వెల్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) అర్ధసెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో విటెల్ లాయిస్, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. విండీస్‌ను గెలిపించిన హెట్‌మైర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిరీస్‌లో 14 వికెట్లతో అదరగొట్టిన కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.చదవండి: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
వికెట్ తేడాతో సంచలన విజయం.. కివీస్‌దే వన్డే సిరీస్
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో అమిర్ జాంగో (51) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో గుదకేశ్ మోతీ (41) రాణించాడు. ఒక దశలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన విండీస్‌ను గుదకేశ్, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్ చాప్మన్ (80), మైకెల్బ్రాస్వెల్ (32), మిచెల్సాంట్నర్ (34 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు. చాప్మన్, బ్రాస్‌వెల్ వెనుదిరిగినప్పటికీ కడదాకా నిలిచిన కెప్టెన్ సాంట్నర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో గుదకేశ్ మోతీ 5 వికెట్లతో సత్తా చాటగా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ సాంట్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే రేపు జరగనుంది. -
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత
-
వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు!
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన వెస్టిండీస్ 1-2తో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రెండు వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తన జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. చివరి రెండు వన్డేలకు గాయాలతో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ జాన్ కాంప్‌బెల్, టెస్టు కెప్టెన్ రోస్టన్ చేజ్ల స్థానంలో బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్లను ఎంపిక చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాయాలు, ఫామ్ లేమీతో సతమతమవుతున్న జట్టులోకి వీరి రాకతో విండీస్ కాస్త బలంగా కనిపిస్తోంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో జస్టిన్ గ్రీవ్స్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రం గ్రీవ్స్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇక 2025 అక్టోబర్‌లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన బ్రాండన్ కింగ్ అప్పటి నుంచి టెస్టులు, టీ20లకే పరిమితమయ్యాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో బ్రాండన్ కింగ్‌ను జాన్ కాంప్‌బెల్ స్థానంలో జట్టులో పరిశీలించాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. తల్లి అంత్యక్రియల కోసం షమర్ స్ప్రింగర్, వ్యక్తిగత కారణాలతో కారీ పియెర్రీ కూడా జట్టును వీడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా రోస్టన్ చేజ్ కుడి చూపుడువేలికి గాయమైంది. అప్పటి నుంచి చేజ్ రీహాబిలిటేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు మూడో వన్డే సందర్భంగా కాంప్‌బెల్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంప్‌బెల్ మూడు వన్డేలు కలిపి 30 సగటుతో 60 పరుగుల మాత్రమే చేశాడు. మరోవైపు తొలి వన్డేలో ఓడినప్పటికీ వరుసగా రెండు, మూడు వన్డేలు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం బార్బడోస్ వేదికగా జరగనుంది.చివరి రెండు వన్డేలకు విండీస్ జట్టు:షెయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), అకీమ్ ఆగస్ట్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రాన్ హెట్‌మైర్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, విటెల్ లాస్, గుదకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
‘గ్రేట్’ సోబర్స్ ఇన్నింగ్స్ ముగిసింది
అద్భుత బ్యాటర్... అసాధారణ బౌలర్... అత్యుత్తమ ఫీల్డర్... క్రికెట్లో ఆల్‌రౌండర్ అనే మాటకు అసలైన పర్యాయపదం... ఆల్‌టైమ్ గ్రేట్, దిగ్గజ క్రికెటర్లాంటి విశేషణాలకు సరైన చిరునామా...సర్ గార్ఫీల్డ్ (గ్యారీ) సోబర్స్ తన ఇన్నింగ్స్‌ను ముగిస్తూ నిష్క్రమించారు. 90 ఏళ్ల వయసులో తన స్వస్థలం బార్బడోస్‌లో ఆయన కన్నుమూశారు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మొదటిసారి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఘనతలు ఈతరం క్రికెట్ అభిమానులకు సోబర్స్‌ను గుర్తు చేస్తుండగా...అంతకుమించిన సాధించిన ఎన్నో ఘనతలు ఆయన సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ ఆడి 52 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ఇప్పటి క్రికెటర్లలో స్ఫూర్తి పాఠాలు నింపుతూ వచ్చిన సోబర్స్ ముద్ర శాశ్వతం. బార్బడోస్: మార్చి 1, 1958... క్రీజ్‌లో 10 గంటల 8 నిమిషాలు... 38 ఫోర్లు... వెస్టిండీస్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు చరిత్రను తిరగరాశాడు. 20 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక పరుగుల వ్యక్తిగత రికార్డును అతను అధిగమించాడు. అప్పటి వరకు ఆడిన 16 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సోబర్స్ తన 17వ టెస్టులో ఏకంగా 365 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. తన తొలి సెంచరీనే అతను ప్రపంచ రికార్డుగా మలచుకున్నాడు. తొలి సెంచరీ సాధించిన బ్యాటర్లలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. లెన్ హటన్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న 364 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును అధిగమించిన క్షణాన కింగ్స్టన్లోని సబీనా పార్క్ మైదానంలో 20 వేల మంది ప్రేక్షకులు దూసుకొచ్చి ఆ కుర్రాడిపై తమ అభిమానాన్ని ప్రదర్శించారు. అప్పుడు మొదలైన ఆ దిగ్గజ ఆటగాడి అసలు ప్రస్థానం మరో 16 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది. వెస్టిండీస్ జట్టు తరఫునే కాకుండా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ, ఆస్ట్రేలియా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సౌత్ ఆ్రస్టేలియా టీమ్ తరఫున సోబర్స్ తన ఘనమైన ఆటను ప్రదర్శించాడు. 2003 వన్డే వరల్డ్ కప్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును సచిన్‌కు అందజేస్తున్న సోబర్స్ (ఫైల్) 2023లో వెస్టిండీస్‌లో భారత పర్యటన సందర్భంగా కోహ్లితో సోబర్స్ దంపతులు మేటి గణాంకాలు... కుర్రాడిగా ఉన్నప్పుడే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి ఆటలపై ఆసక్తి కనబర్చిన సోబర్స్ ఆ తర్వాత పూర్తి స్థాయిలో క్రికెట్‌వైపు మళ్లాడు. తొలి టెస్టులో లెఫ్టార్మ్ పేస్ బౌలర్‌గా 4 వికెట్ల ప్రదర్శనతో అతని కెరీర్ మొదలైంది. కొంత కాలం బౌలర్‌గానే అతను జట్టులో కొనసాగాడు. పేస్ మాత్రమే కాదు సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా, లెఫ్టార్మ్ మణికట్టు స్పిన్నర్‌గా కూడా అతను ఎంతో ప్రభావం చూపించాడు. ఇలాంటి వైవిధ్యభరిత నైపుణ్యమే అతడికి ‘ఫైవ్ ఇన్ వన్ ఆల్‌రౌండర్’గా గుర్తింపు తెచ్చింది. పాకిస్తాన్‌పై 365 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత బ్యాటర్‌గా సోబర్స్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అత్యంత పిన్న వయసులో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన ఈ రికార్డు (21 ఏళ్ల 213 రోజులు) ఇప్పటికీ ఎవరూ అధిగమించలేకపోవడం విశేషం. తర్వాతి ఐదు టెస్టుల్లో ఐదు శతకాలు బాదడంతో సోబర్స్ స్థాయి ఏమిటో అందరికీ తెలిసింది. టెస్టు ఘనతలు మాత్రమే కాకుండా 1971లో రెస్టాఫ్ వరల్డ్ తరఫున ఆ్రస్టేలియాపై మెల్బోర్న్లో చేసిన 254 పరుగుల ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ‘ఆసీస్ గడ్డపై నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్’ ఇదే అంటూ బ్రాడ్‌మన్‌తో సోబర్స్ ప్రశంసలందుకున్నాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు... ‘ఆరు’ అంకెతో సోబర్స్‌కు పుట్టినప్పుడే అనుబంధం ఏర్పడింది! తన రెండు చేతులకు అతను ఆరో వేలితో పుట్టగా... ఆ తర్వాత వాటిని తొలగించారు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతను తొలిసారి నమోదు చేసిన ఫీట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. కౌంటీ క్రికెట్లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతూ ప్రత్యర్థి జట్టు గ్లామోర్గాన్ బౌలర్ మాల్కం నాష్ ఓవర్లో చెలరేగిన సోబర్స్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు. తొలి నాలుగు బంతులను అతను లాంగాన్, స్క్వేర్లెగ్ల మీదుగా నాలుగు సిక్సర్లుగా మలిచాడు. ఐదో బంతిని ఫీల్డర్ రోజర్ డేవిస్ క్యాచ్ పట్టినా... అతని కాలు బౌండరీకి తగలడంతో అదీ సిక్స్‌గా మారింది. చివరి బంతిని కూడా వదలకుండా మిడ్వికెట్గా సిక్స్ కొట్టడంతో 6x6 పూర్తయింది. ఐసీసీ గౌరవం... క్రికెట్‌కు చేసిన సేవలకుగాను 1975లో బ్రిటన్ ప్రభుత్వం సోబర్స్‌ను నైట్‌హుడ్ (సర్) పురస్కారంతో సత్కరించింది. ఆ్రస్టేలియా ప్రభుత్వ ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆ్రస్టేలియా’ కూడా అతనికి లభించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతని ఘనతలను గుర్తిస్తూ క్రికెట్లో అత్యున్నత అవార్డు ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా వార్షిక అవార్డుల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ‘బెస్ట్ ప్లేయర్’కు ఇదే అవార్డును అందజేస్తున్నారు.ఒకే ఒక వన్డేలో డకౌట్ తన చివరి ఇన్నింగ్స్‌లో డాన్ బ్రాడ్‌మన్ డకౌట్‌గా వెనుదిరగడం క్రికెట్ చరిత్రలో ఎవరూ మరచిపోలేని ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది. సోబర్స్ కెరీర్లో కూడా అలాంటి క్షణం ఒకటి వచ్చింది. సుదీర్ఘ కెరీర్లో 95 దేశవాళీ వన్డేలు (లిస్ట్–ఎ) ఆడినా వెస్టిండీస్ తరఫున అతను ఒకే ఒక అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇంగ్లండ్‌తో 1973లో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 బంతులాడిన సోబర్స్ పరుగు తీయకుండానే నిష్క్రమించాడు. విండీస్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలి వన్డే. క్లయివ్ లాయిడ్, కాళీచరణ్ సహా 11 మంది ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్ తర్వాత సోబర్స్ వన్డేలకు దూరం కాగా...ఇతర దిగ్గజాలు ముందుకు వెళ్లి రెండు ప్రపంచ కప్‌లను గెలిపించారు. -
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చిన సోబర్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.1953లో కేవలం 16 ఏళ్ల వయసులో బార్బడోస్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన సోబర్స్, మరుసటి ఏడాదే వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 1958లో పాకిస్థాన్‌పై అజేయంగా 365 పరుగులు చేసి అప్పటికి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును 1994లో మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అధిగమించాడు.1968లో వేల్స్‌లోని స్వాన్సీలో గ్లామోర్గన్‌పై జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు వరుస సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ చరిత్ర సృష్టించారు. ఆ ఘనత ఆయన కెరీర్లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది.1974లో 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సోబర్స్, తన కెరీర్లో 93 టెస్టులు ఆడి 8032 పరుగులు (సగటు 57.78) చేసి 235 వికెట్లు తీశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 383 మ్యాచ్‌ల్లో 28 వేలకుపైగా పరుగులు, 1000కు పైగా వికెట్లు సాధించారు.క్రికెట్‌కు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ (Sir) బిరుదును ప్రదానం చేసింది. -
టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్!
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిన విండీస్ ఆటగాళ్లు వన్డేలు ఆడడం మరిచిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వచ్చిందే తడవు భారీ ఇన్నింగ్స్‌లతో అలరించాలన్న మోజులో వన్డే ఫార్మాట్లో నిలకడగా ఆడితేనే పరుగులు వస్తాయన్న విషయాన్ని విండీస్ పూర్తిగా పక్కనబెట్టేసింది. తొలి వన్డే తర్వాత ఆడిన రెండు వన్డేల్లోనూ వెస్టిండీస్ 150 పరుగుల్లోపే ఆలౌట్ కావడం గమనార్హం. తాజాగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ మరోసారి బౌలింగ్‌లో చెలరేగిన వేళ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో కీసి కార్టి (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, హెట్‌మైర్ (26) పర్వాలేదనిపించాడు. జేడన్ లెనోక్స్ 4 వికెట్లతో చెలరేగగా, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 141 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డారిల్ మిచెల్ (28), హెన్రీ నికోల్స్ (24) ఆరంభంలో మెరుగ్గా ఆడారు. చివర్లో టామ్ లాథమ్ (31 నాటౌట్), డీన్ ఫాక్స్క్రాప్ట్ (22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. వెస్టిండీస్ బౌలర్లలో విటెల్ లాస్ 3 వికెట్లు తీయగా, కేరీ పియర్రీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జూలై 19న (ఆదివారం) బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరగనుంది.చదవండి: అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు -
1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్ యోధుడు
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2026లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన అతడు.. పొట్టి ఫార్మాట్లో 1000 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే ఈ ఘనత సాధించిన మరో క్రికెటర్ కూడా విండీస్ యోధుడే (క్రిస్ గేల్-1056) కావడం విశేషం.కెరీర్లో ఇప్పటివరకు 746 టీ20 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్ 1001 సిక్సర్లతో పాటు 923 ఫోర్లు కూడా బాదాడు.టీ20 క్రికెట్లో టాప్-5 అత్యధిక సిక్సర్ల వీరులుగేల్- 1056పోలార్డ్- 1001రసెల్- 792పూరన్- 764బట్లర్- 630మ్యాచ్ విషయానికొస్తే.. పోలార్డ్ (25 బంతుల్లో 64; ఫోర్, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాటు పూరన్ మెరుపు శతకం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.ఇంత భారీ స్కోర్ చేసిన ఎంఐ బౌలర్లు దీన్ని కాపాడుకోలేకపోయారు. ఫ్రీడం బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (110 నాటౌట్), ఆండ్రియస్ గౌస్ (132) సుడిగాలి శతకాలు బాది, మరో 8 బంతులు మిగిలుండగానే రికార్డు లక్ష్యాన్ని ఊదేశారు. పొట్టి క్రికెట్ ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. -
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన విండీస్ బ్యాటర్
వెస్టిండీస్ మహిళల క్రికెట్ దిగ్గజం స్టెఫానీ టేలర్ అరుదైన మైలురాయిని తాకింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీ (105) చేసిన ఆమె.. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచింది.ఈ జాబితాలో ఇప్పటికే మిథాలీ రాజ్ (10868), సుజీ బేట్స్ (10740), స్మృతి మంధాన (10737), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10273) ఉన్నారు. 35 ఏళ్ల టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 307 ఇన్నింగ్స్‌ల్లో 10005 పరుగులు చేసింది. అదనంగా ఆమె మూడు ఫార్మాట్లలో కలిపి 254 వికెట్లు కూడా తీసింది.2008లో ఐర్లాండ్‌పైనే వన్డే అరంగేట్రం చేసిన టేలర్, ఇప్పటివరకు 179 వన్డేల్లో 6339 పరుగులు సాధించింది. ఇందులో 10 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయాల్లో 139 మ్యాచ్‌ల్లో 3666 పరుగులు చేసి 22 అర్ధశతకాలు నమోదు చేసింది.ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టేలక్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్‌ను 193 పరుగులకే కుప్పకూల్చి 64 పరుగుల తేడో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.అంతకుముందు రెండో వన్డేలోనూ టేలర్ అజేయ శతకం (100*) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. -
వెస్టిండీస్ క్రికెట్‌కు భారీ ఆర్థిక సాయం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న క్రికెట్ వెస్టిండీస్‌కు (CWI) ఐసీసీ భారీ ఆర్దిక సాయం చేసింది. వార్షిక సమావేశాల్లో భాగంగా CWIకు 12.82 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్లు) రుణంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.గత కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ బోర్డు ఐసీసీ నుంచి ఆర్థిక సహాయం కోరుతోంది. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికలో 28 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చూపించింది.2026 ఆర్థిక చక్రంలో మరో 26 మిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ లోటును భర్తీ చేసేందుకు ఐసీసీ రుణం కోరింది. దీంతో ఐసీసీ వారికి అధికారికంగా ఆర్థిక సాయం ప్రకటించింది.2012లోనూ ఐసీసీ జింబాబ్వే, వెస్టిండీస్ బోర్డ్‌లకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించింది. 2020 కరోనా మహమ్మారి సమయంలోనూ వెస్టిండీస్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నుంచి 3 మిలియన్ డాలర్ల రుణం పొందింది.ఇతర కీలక నిర్ణయాలుఎడిన్బర్గ్లో జరిగిన సమావేశాల్లో ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మారిషస్‌ను ఐసీసీ 111వ సభ్య దేశంగా చేర్చింది. దీంతో ఐసీసీలో ప్రస్తుతం 12 పూర్తి సభ్య దేశాలు, 99 అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి.కెనడా క్రికెట్ బోర్డుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతకు అవసరమైన పునరుద్ధరణ నిబంధనలకు ఆమోదం తెలిపింది. అలాగే శ్రీలంక క్రికెట్ కొత్త రాజ్యాంగంపై వివరాలు స్వీకరించి, ఎన్నికలు పూర్తయ్యే వరకు శ్రీలంకకు బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం ఉండదని స్పష్టం చేసింది. సభ్యత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫ్రాన్స్ క్రికెట్‌కు నోటీసులు జారీ చేసింది.రెండు కొత్త ఉపసంఘాల ఏర్పాటుక్రికెట్ పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ఐసీసీ రెండు కొత్త ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. గవర్నెన్స్ రివ్యూ కమిటీ, ఫ్రాంచైజీ లీగ్ కమిటీ పేర్లతో ఏర్పాటైన ఈ కమిటీలు సభ్య దేశాల పరిపాలన, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విధానపరమైన సూచనలు చేస్తాయి. -
జేడన్ పాంచ్ పటాకా.. విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
వెస్టిండీస్ టూర్లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కివీస్ బౌలర్ జేడన్ లిన్నెక్స్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గయానా వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (43) టాప్ స్కోరర్‌గా నిలవగా, అమిర్ జాంగో (24) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేడన్ లెన్నోక్స్ 5 వికెట్లతో విండీస్ నడ్డి విరిచాడు. మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 32.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టామ్ లాథమ్ (37 నాటౌట్),మైకెల్ బ్రాస్‌వెల్ (24 నాటౌట్) కివీస్ణు విజయతీరాలకు చేర్చారు. అంతకముందు విల్ యంగ్ (28), డారిల్ మిచెల్ (28) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఖారీ పియర్రె 2 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్, గుదకేశ్ మోతీ చెరొక వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జూలై 16న మూడో వన్డే జరగనుంది. -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన విండీస్ ఓపెనర్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (100), వన్‌డౌన్ బ్యాటర్ స్టెఫానీ టేలర్ (100 నాటౌట్) సూపర్ సెంచరీలతో చెలరేగడంతో ఐర్లాండ్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 39 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మాథ్యూస్‌కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ. ఇదే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా ఆమె శతక్కొట్టింది.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అమీ హంటర్ 67, రెబెక్కా స్టోకెల్ 57 పరుగులతో జట్టును ఆదుకున్నారు. చివర్లో లియా పాల్ 30 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ (2/34), డియాండ్రా డాటిన్ (2/15) రాణించారు.241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఓవర్లోనే ఓపెనర్ రియలియానా గ్రిమాండ్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ ఐర్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. చివరి వరకు క్రీజులో నిలిచిన టేలర్, షెమైన్ క్యాంప్‌బెల్ (10 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి వన్డే జులై 15న జరుగనుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. -
పొరపాటు చేసిన వెస్టిండీస్ కోచ్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదని ప్రధాన కోచ్ డారెన్ సామీ స్పష్టం చేశాడు. ఇటీవల హోల్డర్ వన్డేలకు వీడ్కోలు పలికాడని చేసిన వ్యాఖ్యలు తప్పని అంగీకరిస్తూ, వాటిని వెనక్కి తీసుకున్నాడు.జూలై 12న మీడియాతో మాట్లాడిన సామీ, హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీయడంతో, అనంతరం అధికారికంగా వివరణ ఇచ్చాడు."జేసన్ హోల్డర్ అంతర్జాతీయ భవిష్యత్తుపై మాట్లాడుతున్నప్పుడు నేను పొరపాటున అతను వన్డేలకు రిటైర్ అయ్యాడని చెప్పాను. అది నా తప్పు. ఈ వ్యాఖ్యల వల్ల జేసన్ హోల్డర్‌కు, క్రికెట్ వెస్టిండీస్‌కు, అభిమానులకు కలిగిన గందరగోళానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను" అని సామీ వెల్లడించాడు.సామీ ఇంకా మాట్లాడుతూ, "వాస్తవానికి హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి నిరవధిక విరామం మాత్రమే తీసుకున్నాడు. అతను రిటైర్ కాలేదు. వన్డే జట్టు ఎంపికకు అతడు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో అతని అందుబాటుపై క్రికెట్ వెస్టిండీస్‌తో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి" అని వివరించాడు.కాగా, హోల్డర్ గత కొంతకాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్లో మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ తరఫున ఆడిన అతను ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి, జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.హోల్డర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. అతడు ఇప్పటివరకు 138 మ్యాచ్‌లు ఆడి 2,237 పరుగులు చేయడంతో పాటు 159 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్లోనే చివరిసారిగా వన్డే ఆడిన హోల్డర్, వెస్టిండీస్‌కు 86 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 24 విజయాలు అందించాడు. -
వెస్టిండీస్-న్యూజిలాండ్ వన్డేలో 'హిట్ వికెట్' వివాదం
వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ (జులై 12) జరిగిన తొలి వన్డేలో ఓ వివాదాస్పద అంశం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు కీసీ కార్టీ బ్యాట్ స్టంప్స్‌ను తాకి బెయిల్స్ కిందపడినా టీవీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ పటిష్ఠ స్థితిలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 35వ ఓవర్ రెండో బంతిని జాకబ్ డఫీ వేయగా, కార్టీ పుల్ షాట్ ఆడి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా 69 మీటర్ల సిక్సర్ బాదాడు. అయితే షాట్ ఆడిన వెంటనే అతని బ్యాట్ స్టంప్స్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి.Should the Kiwis feel hard done by with this Hit Wicket being called Not Out?! pic.twitter.com/XlTNEw5KPq— The ACC (@TheACCnz) July 12, 2026దీంతో ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ వెంటనే స్క్వేర్ లెగ్ అంపైర్‌తో చర్చించి నిర్ణయాన్ని టీవీ అంపైర్ అహ్సన్ రజాకు పంపించాడు. అప్పటికి కార్టీ 64 పరుగులతో క్రీజులో ఉండగా, వెస్టిండీస్ 34 ఓవర్లలో 170/2తో విజయానికి చేరువలో ఉంది.పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ కార్టీని నాటౌట్‌గా ప్రకటించాడు. షాట్ పూర్తయిన తర్వాతే బ్యాట్ స్టంప్స్‌ను తాకిందని, అప్పటికే బంతి సిక్సర్‌గా బౌండరీ దాటినందున హిట్ వికెట్ నిబంధన వర్తించదని స్పష్టం చేశాడు.ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి ఆటలో ఉన్న సమయంలో మాత్రమే హిట్ వికెట్‌గా బ్యాటర్‌ను ఔట్ ఇవ్వవచ్చు. షాట్ ఆడే సమయంలో లేదా వెంటనే పరుగుకు బయలుదేరే క్రమంలో స్టంప్స్‌ను కూల్చితే మాత్రమే హిట్ వికెట్ వర్తిస్తుంది. కానీ బంతి అప్పటికే బౌండరీ దాటి ఫోర్ లేదా సిక్సర్‌గా నమోదైన తర్వాత ఆట ముగిసినట్లే పరిగణిస్తారు. ఆ తర్వాత స్టంప్స్‌ను తాకినా బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించలేరు.అంపైర్ నిర్ణయం అనంతరం కార్టీ మరింత ధైర్యంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.ఈ ఘటనతో హిట్ వికెట్ నిబంధన చర్చనీయాంశంగా మారింది. 2005 యాషెస్‌లో షేన్ వార్న్, 2002లో ఇంజమామ్ ఉల్ హక్ వంటి ప్రముఖ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔటైన ఘటనలను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
కెప్టెన్ మెరుపులు.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విండీస్
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. గయానా వేదికగా జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను 7 వికెట్ల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది. బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(65), విల్ యంగ్(49) రాణించగా.. బ్రెస్‌వెల్(29), చాప్మన్(27), టామ్ లాథమ్(25) తలో చేయి వేశారు. కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. 19 ఏళ్ల అరంగేట్ర స్పిన్నర్ విటెల్ లాస్ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.5 ఓవర్లలో చేధించింది. వన్ డౌన్ బ్యాటర్ కీసీ కాట్టీ(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ బ్యాటర్ కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడితో పాటు కెప్టెన్ షాయ్ హోప్(92 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 నాటౌట్) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. కివీస్ బౌలర్లలో డఫీ, లినక్స్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు. . ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గయానా వేదికగానే సోమవారం జరగనుంది. -
విండీస్ జట్టు ప్రకటన.. మూడేళ్ల తర్వాత విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
వెస్టిండీస్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో తొలి మూడు వన్డేల కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.అయితే ఈ జట్టు ఎంపిక సందర్భంగా సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విటెల్ లావ్స్కు తొలిసారి విండీస్ జాతీయ జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. 19 ఏళ్ల విటెల్ లావ్స్కు ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికి అతడిని నేరుగా జాతీయ జట్టుకు ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ లావ్స్ న్యూజిలాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేస్తే.. అది అతడి మొదటి లిస్ట్-ఎ క్రికెట్ మ్యాచ్ అవుతోంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం విండీస్ తరపున అద్భుతంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా పది వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్ధి బ్యాటర్లకు తన స్పిన్ మయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని సెలక్టర్లు తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా లావ్స్ను జట్టులోకి తీసుకున్నట్లు విండీస్ హెడ్‌కోచ్ డారన్ సామీ తెలిపాడు.స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీఇక ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హెట్‌మైర్ దూరమయ్యాడు. హెట్‌మైర్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ టీ20లీగ్‌లో ఆడుతున్నాడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ కీమో పాల్ దాదాపు మూడేళ్ల తర్వాత విండీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. స్ప్రింగర్ స్ధానంలో అతడికి ఛాన్స్ ఇచ్చారు. కీమో పాల్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు లోయార్డర్ బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపించగలడు. బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఐదు వన్డేల సిరీస్ జూలై 12 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది.కివీస్‌తో తొలి మూడు వన్డేలకు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్ట్, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్. -
చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్
ఆంటిగ్వాలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు హైస్కోరింగ్ డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విండీస్, రెండో టెస్టును డ్రాగా ముగించడంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత వెస్టిండీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. అలాగే శ్రీలంకపై 2003 తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.రెండో టెస్ట్ చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 92/2తో ఆట ప్రారంభించిన శ్రీలంక వేగంగా పరుగులు సాధించింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, మిలన్ రత్నాయకే వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడడంతో లంచ్ సమయానికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఆధిక్యాన్ని 300 దాటించిన శ్రీలంక 251/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దినేశ్ చండిమల్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్ 44 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.306 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, బ్రాండన్ కింగ్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో రెండు సార్లు చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించినా ఫలితంపై ప్రభావం చూపలేదు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ ఎల్బీగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా, డీఆర్ఎస్లో నిర్ణయం మారడంతో శ్రీలంకకు నిరాశ ఎదురైంది.చివరికి క్యాంప్‌బెల్ (51 నాటౌట్), బ్రాండన్ కింగ్ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును నిలబెట్టగా, ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 549/9 డిక్లేర్ చేయగా, లహిరు ఉదార 188, సోనాల్ దినూష 92, కమిందు మెండిస్ 84 పరుగులతో రాణించారు. ప్రత్యుత్తరంగా వెస్టిండీస్ 499 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112 పరుగులతో ఆకట్టుకోగా, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి టెస్టులో సాధించిన ఘన విజయమే సిరీస్ ఫలితాన్ని వెస్టిండీస్‌కు అనుకూలంగా మలిచింది. -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్.. హోప్ శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మ్యాచ్‌పై పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి, ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయానికి అవసరమైన లక్ష్యాన్ని నిర్దేశించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.మూడో రోజు ప్రారంభమైన జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ భాగస్వామ్యం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. హోప్ (112) తన కెరీర్లో ఐదో టెస్టు సెంచరీని, స్వదేశంలో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. గ్రీవ్స్ (180) తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గ్రీవ్స్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.గ్రీవ్స్-హోప్ 76.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 242 పరుగుల భారీ భాగస్వామ్యానికి నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. ఓ దశలో 5 వికెట్లకు 438 పరుగులతో బలంగా కనిపించిన వెస్టిండీస్ చివరి ఐదు వికెట్లను కేవలం 61 పరుగులకే కోల్పోయి 499 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌ను 549/9 వద్ద డిక్లేర్ చేసిన శ్రీలంకకు 50 పరుగుల ఆధిక్యం లభించింది. అసిత ఫెర్నాండో ఐదు వికెట్లతో రాణించాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంకకు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ షాకిచ్చారు. లహిరు ఉదారా నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరగగా, నిషాన్ మదుష్కను అల్జారీ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ఆ క్లిష్ట సమయంలో దినేశ్ చండిమల్, కమిందు మెండిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చండిమల్ 66 బంతుల్లో 40 పరుగులతో, కమిందు మెండిస్ 35 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.సంక్షిప్త స్కోర్లు:శ్రీలంక: 549/9 డిక్లేర్ & 92/2 (దినేశ్ చండిమల్ 40*, కమిందు మెండిస్ 30*)వెస్టిండీస్: 499 (జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112; అసిత ఫెర్నాండో 5/130)శ్రీలంకకు మొత్తం 142 పరుగుల ఆధిక్యంకాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (549-9 డిక్లేర్) చేసింది.అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఇంకా 491 పరుగుల వెనుకబడి ఉంది.రెండో రోజు ఆటలో కుసాల్ మెండిస్ (69), సోనల్ దినుషా (92) విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఆరో వికెట్‌కు 143 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆఖర్లో మిలన్ రత్నాయకే (15), ప్రభాత్ జయసూర్య (17 నాటౌట్), విజెసుందర (14) ఓ మోస్తరు పరుగులు చేయడంతో శ్రీలంక 500 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు ఓపెనర్ లహీరు ఉదారా (188) భారీ శతకంతో కదంతొక్కగా.. కమిందు మెండిస్ (84) అర్ద సెంచరీతో రాణించాడు.549 పరుగుల భారీ లక్ష్యానికి స్పందనగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాండన్ కింగ్‌ను (17) అసిత ఫెర్నాండో ఔట్ చేశాడు. అనంతరం జాన్ క్యాంప్‌బెల్ (31), కావెమ్ హాడ్జ్ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
పావెల్ విధ్వంసం.. కేవలం 27 బంతుల్లో..!
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ (TSK)తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (LAKR) ఆటగాడు రోవ్‌మన్ పావెల్ చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడికి ఓపెనర్ కొలిన్ మున్రో (42 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించడంతో సూపర్ కింగ్స్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (4 వికెట్ల నష్టానికి) ఊదేసింది (6 వికెట్ల తేడాతో గెలుపు). పావెల్ ఒంటిచేత్తో నైట్‌రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సాయితేజ ముక్కమల్ల 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతడికి మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం లభించికపోయినా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో వియాన్ ముల్దర్ (16 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో డుప్లెసిస్ (14), రిలీ రొస్సో (2), ఫెరియెరా (2) నిరాశపరిచారు. షుభమ్ రంజనే (30 బంతుల్లో 28) ఓ మోస్తరు పరుగులు చేసినా బంతులు వృధా చేశాడు.సూపర్ కింగ్స్‌పై నైట్‌రైడర్స్ గెలుపుతో మేజర్ లీగ్ క్రికెట్ 2026 పాయింట్ల పట్టిక మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టోర్నీలోని ఆరు జట్లూ సమానంగా ఆరు పాయింట్లతో నిలవడం పోటీని ఉత్కంఠభరితంగా మార్చింది. -
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026లో నేడు (జూన్ 30) తొలి సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓ సారి ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో వెస్టిండీస్ అండర్ డాగ్ హోదాలో బరిలోకి దిగి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయ జట్టుగా ఫైనల్-4కు చేరింది. వెస్టిండీస్ తమ చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో (ఇంగ్లండ్, ఐర్లాండ్) చేతుల్లో ఓడినా సెమీస్‌కు చేరడం ఆసక్తికర పరిణామం.ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు టీమిండియా సెమీస్ ఆశలను ఆవిరి చేసి ఫైనల్-4కు చేరింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించడంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కింది. జులై 2న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బి టాపర్ ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటుంది. విండీస్-ఆసీస్ తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ టోర్నీలో తాము అండర్ డాగ్స్ అని చెప్పుకుంటూ, అదే తమ బలమని పేర్కొంది."మా నుంచి ఎవరూ విజయం ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. నేటి సెమీఫైనల్లో ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. వాళ్లు గెలవాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. కానీ మేం గెలిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. అందుకే మేం నిర్భయంగా ఆడగలం.వెస్టిండీస్ గతంలో ఎన్నోసార్లు అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా ప్రపంచకప్‌లలో తమ జట్టు ప్రత్యేకంగా రాణిస్తుంది. తమను తక్కువ అంచనా వేయడం ఆటగాళ్లలో మరింత పోరాటస్ఫూర్తిని పెంచుతుంది" అని చెప్పింది.ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ మ్యాచ్‌లో మేం ఒత్తిడికి లోనయ్యాం. కానీ ఎవరైనా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే, మాలో మరో రకమైన జోష్ కనిపిస్తుందని వివరించింది. -
రోచ్ ట్రిపుల్ సెంచరీ
గత కొన్నేళ్లుగా ప్రభ కోల్పోయిన వెస్టిండీస్ పేస్ బౌలింగ్ విభాగానికి మూలాధారంగా నిలబడిన 38 కెమార్ రోచ్ కెరీర్ చరమాంకంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 300 వికెట్ల సాధించిన ఐదో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.రెండో ఇన్నింగ్స్‌లో అసిత ఫెర్నాండోను ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్ చేసి తన 300వ టెస్ట్ వికెట్‌ను నమోదు చేశాడు. రోచ్‌కు ముందు వాల్ష్ (519), ఆంబ్రోస్ (405), మాల్కమ్ మార్షల్ (376), లాన్స్ గిబ్స్ (309) మాత్రమే విండీస్ తరఫున ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించారు.రోచ్ సహా పేస్ విభాగమంతా సత్తా చాటడంతో శ్రీలంకపై వెస్టిండీస్ ఇన్నింగ్స్ 217 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రోచ్ (11-0-51-4), జేడన్ సీల్స్ (10.2-3-14-3), షమార్ జోసఫ్ (5-0-19-2), అల్జరీ జోసఫ్ (5-1-11-1) ధాటికి లంక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక బ్యాటరల్లో దినేశ్ చండీమల్ (43), సోనల్ దినుష (12 నాటౌట్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.అంతకుముందు అమిర్ జాంగూ (233) డబుల్ సెంచరీతో, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (194) భారీ శతకంతో కదంతొక్కడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాంగూ-ఛేజ్ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 401 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మిలన్ ప్రియానాథ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అషిత ఫెర్నాండో, సోనల్ దినుష తలో 2 వికెట్లు తీశారు.దీనికి ముందు ధనుంజయ డిసిల్వ (120) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. దినేశ్ చండీమల్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. దినుష 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో గ్రీవ్స్ 3, రోచ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్ తలో 2, సీల్స్ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగింది. రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగానే జులై 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. టెస్ట్‌లకు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగాయి. వన్డే సిరీస్‌ను శ్రీలంక (1-0), టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ (2-1) చేజిక్కించుకున్నాయి. -
జాంగూ డబుల్ ధమాకా.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
ఆంటిగ్వా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆలౌట్ కాగా.. విండీస్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి, ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. విండీస్ బౌలర్లు (11-0-5-4), జేడన్ సీల్స్ (10.2-3-14-3), షమార్ జోసఫ్ (5-0-19-2), అల్జరీ జోసఫ్ (5-1-11-1) లంక బ్యాటర్లకు చుక్కులు చూపించారు. వీరి ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. దినేశ్ చండీమల్ (43), సోనల్ దినుష (12 నాటౌట్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.అంతకుముందు అమిర్ జాంగూ (233) డబుల్ సెంచరీతో, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (194) భారీ శతకంతో కదంతొక్కడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాంగూ-ఛేజ్ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 401 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మిలన్ ప్రియానాథ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అషిత ఫెర్నాండో, సోనల్ దినుష తలో 2 వికెట్లు తీశారు.దీనికి ముందు ధనుంజయ డిసిల్వ (120) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. దినేశ్ చండీమల్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. దినుష 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో గ్రీవ్స్ 3, రోచ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్ తలో 2, సీల్స్ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగింది. రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగానే జులై 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. టెస్ట్‌లకు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగాయి. వన్డే సిరీస్‌ను శ్రీలంక (1-0), టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ (2-1) చేజిక్కించుకున్నాయి. -
వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. స్కాట్లాండ్ పోరాటం వృథా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. షెమైన్ క్యాంప్‌బెల్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేయగా.. ఏడో స్థానంలో బరిలోకి దిగిన స్టెఫానీ టేలర్ 19 బంతుల్లో అజేయమైన 47 పరుగులు (3 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి జట్టుకు పోరాడే స్కోర్‌ను అందించింది. మిగతా ప్లేయర్లలో కియానా జోసఫ్ (13), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (14), డియాండ్రా డాట్టిన్ (14), క్లాక్స్టన్ (16), చినెల్ హెన్రీ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో కేథరీన్ ఫ్రేజర్ 2 వికెట్లతో రాణించగా.. కేథరీన్ బ్రైస్, రేచల్ స్లేటర్, గార్డన్ తలో వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. డార్సీ కార్టర్, కేథరీన్ ఫ్రేజర్ జోడీ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. గాయంతో ఇబ్బంది పడుతూనే కార్టర్ 53 బంతుల్లో అర్ధశతకం సాధించింది.ఈ దశలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి స్కాట్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆమె మూడు, అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 23 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో గట్టిగా పోరాడినా 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది.ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-బీలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సెమీస్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది. -
షనక మెరుపులు
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో తొలి టి20లో ఓటమి పాలైన శ్రీలంక జట్టు... రెండో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కమిల్ మిషారా (40 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. విండీస్ బౌలర్లలో షామార్ జోసెఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. రావ్మన్ పావెల్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్‌కు వర్క్‌లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్‌లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. -
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది.దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లంక జట్టుకు అదే తొలి విజయం. అలాగే కరీబియన్ దీవుల్లో శ్రీలంక జట్టుకు 13 ఏళ్ల తర్వాత ఇదే తొలి వన్డే గెలుపు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనుకుంటే... భారీ వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
వెస్టిండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. బుధవారం కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ పతుమ్ నిస్సాంక (79 పరుగులు, 103 బంతుల్లో), వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (72 పరుగులు, 62 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. చరిత్ అసలంక(45), జనిత్ లియాంగే(44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, ఛేజ్ తలా రెండు వికెట్లు సాధించారు. 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 49.2 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్ (56) , గ్రీవ్స్(45) రాణించగా, మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లంక పేసర్ దుష్మంత చమీర 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తీక్షణ రెండు, హసరంగ, అసలంక తలా వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్లు రెండో వన్డే ఇదే వేదికలో ఆదివారం జరగనుంది.చదవండి: సూర్యకుమార్‌కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా తెలుగోడు! -
విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
జూన్ 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. పలువురు కీలక ఆటగాళ్లు చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చారు.రీఎంట్రీల్లో ఎక్కువ ఆకర్శిస్తున్న పేరు షిమ్రోన్ హెట్మైర్ది. ఇతను గతేడాది జూన్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా లంక సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినందుకు అతడికి ఈ ఆఫర్ వచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.అలాగే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్‌లోడ్ విషయం పరిగణలోకి వచ్చినా జేడన్ సీల్స్, షమార్ జోసఫ్‌ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్‌కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకే బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇటీవల విండీస్ జట్టుకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా ఐదు వన్డే సిరీస్‌లు గెలిచి అజేయ జట్టుగా చలామణి అవుతుంది.స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రోన్ హెట్‌మైర్, అమీర్ జాంగూ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జేడన్ సీల్స్, షమార్ స్ప్రింగర్విండీస్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్జూన్ 3- తొలి వన్డే (కింగస్టన్)జూన్ 6- రెండో వన్డే (కింగస్టన్)జూన్ 8- మూడో వన్డే (కింగ్స్టన్)ఇదిలా ఉంటే, ఈ విండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ తర్వాత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ ఆడనుంది. జూన్ 11, 13, 14 తేదీల్లో ఇదే కింగస్టన్ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం శ్రీలంక జట్టు విండీస్ సెలెక్ట్ టీమ్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ (జూన్ 18-21) ఆడుతుంది. దీని తర్వాత జూన్ 25 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్ట్, జులై 3 నుంచి అదే అంటిగ్వాలో రెండో టెస్ట్ జరుగనున్నాయి. -
చారిత్రక సిరీస్‌ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్‌ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్‌లో పర్యటించింది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్‌కు వెళ్లనుంది.ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్వన్డేలు – సబీనా పార్క్, కింగ్స్టన్జూన్ 3 – తొలి వన్డేజూన్ 6 – రెండో వన్డేజూన్ 8 – మూడో వన్డేటీ20లు – సబీనా పార్క్జూన్ 11 – తొలి టీ20జూన్ 13 – రెండో టీ20జూన్ 14 – మూడో టీ20టెస్టులు – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వాజూన్ 25 నుంచి తొలి టెస్టుజూలై 3 నుంచి రెండో టెస్టుఇరు జట్లకు కీలకంఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్‌వాష్ చేసింది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 డిజాస్టర్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది. -
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్‌కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
ఫిల్ హ్యూస్ తరహా ఘటన
క్రికెట్ వెస్టిండీస్ ఆథ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్ వివియన్ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్–ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్ ప్రమాదకరంగా మారడంలో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.ట్రినిడాడ్ పేసర్ జేడన్ సీల్స్ వేసిన బంతి, లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్ జెర్మియా లూయిస్ హెల్మెట్‌ను బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్‌ను కిందపడేసింది. ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్‌ను కాలితో తన్నడం, పిచ్‌ను కొట్టడం కనిపించింది. అనంతరం అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉందని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది.ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనలో లూయిస్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించినప్పటికీ, పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది. -
వెస్టిండీస్ చిత్తు.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియాదే
కరేబియన్ గడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టు జోరును కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. సోమవారం సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఆసీస్ చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కంగారులు కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బెత్ మూనీ (65) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు జార్జియా వేర్హమ్ (39), లిచ్‌ఫీల్డ్(46), నికోలా కేరీ (30*), అలానా కింగ్ (26*) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.కుప్పకూలిన విండీస్అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు క్వీనా జోసెఫ్ (29), హేలీ మాథ్యూస్ (45) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్.. 46 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సీనియర్ బ్యాటర్ టేలర్ సైతం రెండో వన్డేలో రాణించలేకపోయింది.ఆస్ట్రేలియా స్పిన్నర్లు జార్జియా వేర్హమ్, యాష్ గార్డనర్ తలా మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు స్టాండ్ ఇన్ కెప్టెన్ మెక్‌గ్రాత్ రెండు వికెట్లు సాధించింది. మూడు వికెట్లతో సత్తాచాటిన జార్జియాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..? -
విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎవిన్ లూయిస్‌కు చోటు దక్కలేదు. దీంతో 34 ఏళ్ల ఎవిన్ లూయిస్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం వైట్‌బాల్ క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)కే పరిమితమైన లూయిస్ తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ (టెస్టు ఫార్మాట్)లోనూ తాను ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఎవిన్ లూయిస్ 22 మ్యాచ్‌ల్లో 1,229 పరుగులు సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఎవిన్ లూయిస్ 67 వన్డేల్లో 2,175 పరుగులు చేశాడు. 65 టీ20 మ్యాచ్‌ల్లో 1,782 పరుగులు సాధించాడు. ఇందులో వన్డేల్లో 5 శతకాలు, టీ20ల్లో రెండు సెంచరీలు సాధించాడు. 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో ఎవిన్ లూయిస్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 176 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన క్రికెటర్‌గా లూయిస్ రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విండీస్ తరఫున అత్యధిక స్కోరు (125 నాటౌట్) సాధించిన ఆటగాడిగాను రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సంచలనాల సూర్యవంశీ! -
ఫిక్సింగ్ కలకలం.. వెస్టిండీస్ క్రికెటర్‌పై వేటు
వెస్టిండీస్ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ జేవన్ సీర్లెస్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాకిచ్చింది. సీర్లెస్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. బార్బడోస్‌లో జరిగిన బీమ్10 లీగ్ (2023-24 సీజన్) సమయంలో సీర్లెస్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా సీర్లెస్ వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, అధికారి ట్రెవాన్ గ్రిఫిత్‌పై కూడా ఐసీసీ తాత్కాలిక నిషేదం విధించింది. సీర్లెస్‌పై అత్యధికంగా నాలుగు చార్జీలు నమోదు కాగా, చిత్రంజన్‌పై మూడు, గ్రిఫిత్‌పై ఒక చార్జ్ నమోదైంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించడానికి వీరి ముగ్గురికి 14 రోజుల సమయం ఉందని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే బీమ్ టీ10 లీగ్ వ్యవహారంలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్‌పై కూడా ఐసీసీ సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు టీ 20 ప్రపంచకప్-2026కు దూరమయ్యాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. -
విండీస్ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక
వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.టాపార్డర్ బ్యాటర్లు హేలీ మాథ్యూస్ (8), ఎబోని బ్రాత్‌వైట్ (8), షవ్నిషా హెక్టార్ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్ (24), డియాండ్రా డొట్టిన్ (28), చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. -
టీ20 ప్రపంచకప్‌పై యుద్ద ప్రభావం
అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద ప్రభావం భారత్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్ జట్టు భారత్‌లోనే హాల్ట్ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. మరోవైపు విండీస్‌లాగే మరో జట్టు కూడా భారత్‌లోనే ఇరుక్కుపోయింది. విండీస్‌లాగే సూపర్-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌లో హాల్ట్ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్‌లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్‌తో పాటు గ్రూప్-1లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్-4కు అర్హత సాధించాయి.తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది. -
సౌతాఫ్రికాపై పాకిస్తాన్.. వెస్టిండీస్‌పై శ్రీలంక..!
ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్‌లో పర్యటిస్తున్నాయి.క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ఆసీస్ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్‌లోనే ఆసీస్ చేతిలో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్‌రౌండ్ షోవిండీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది. -
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్‌లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్‌లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది. కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్‌లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్‌తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. సమష్టి ప్రదర్శన... తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్‌లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్‌కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్‌ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది. వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్‌లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్‌మైర్‌తో పాటు ఛేజ్‌ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్‌ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్‌కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు. రాణించిన తిలక్... ఛేదనలో భారత్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్‌కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్‌లపై)గా నిలిచాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్‌మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్‌ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్‌మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్‌ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0. -
టీమిండియా టార్గెట్ 196
కోల్‌కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్‌కు 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్‌మెయిర్‌లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. -
T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. కోల్‌కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్-8 మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-1 నుంచి సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ ఓ మార్పు చేసింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్ -
నేడు కోల్ కతా వేదికగా హై ఓల్టేజ్ ఫైట్
-
సెమీఫైనల్ లక్ష్యంగా...
టి20 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్‌లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్ ఎయిట్స్’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్ కప్‌నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంకోల్కతా: టి20 వరల్డ్ కప్‌లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ‘క్వార్టర్ ఫైనల్’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్‌ను భారత్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఓడిన టీమ్ టోర్నీనుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్‌రేట్‌లో ప్రత్యర్థికంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం జరిగితే విండీస్ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్ కప్‌లో రెండు టీమ్‌లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది. మార్పుల్లేకుండా... జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్మెంట్ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన సామ్సన్ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్ కూడా తన బ్యాటింగ్‌తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్‌లో కూడా మన టీమ్ పదునుగా ఉంది. స్పిన్‌ను పెద్దగా ఆడలేని విండీస్‌పై వరుణ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో రాణించేనా! వెస్టిండీస్ టీమ్ మొదటినుంచి తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్‌లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్... ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమష్టిగా చెలరేగితే భారత్‌పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్‌తో పోలిస్తే విండీస్ బౌలింగ్ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్ జోసెఫ్ ఫర్వాలేదనిపించే బౌలర్ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ మరే ఐసీసీ ఈవెంట్లో కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది.పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్‌తో 11 మ్యాచ్‌లలో తలపడిన వెస్టిండీస్ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్. వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), కింగ్, హెట్‌మైర్, పావెల్, ఛేజ్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్. టి20 ప్రపంచకప్‌లో నేడుజింబాంబ్వే X దక్షిణాఫ్రికావేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి భారత్ X వెస్టిండీస్వేదిక: కోల్‌కతా, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఈడెన్‌లో ఈ సండే పరుగుల పండగే
కోల్‌కతా: భారత్, వెస్టిండీస్‌ల మధ్య రేపు జరిగే మ్యాచ్ ఈ టి20 ప్రపంచకప్‌కే ‘పైసా వసూల్’ మ్యాచ్ కానుంది. ముమ్మాటికి క్వార్టర్ ఫైనల్‌గా జరిగే ‘సూపర్–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీఫైనల్ చేరుతుంది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం వినియోగించే పిచ్ గురించి క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించగా... బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం పిచ్‌పై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. ఈ వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌కు వేదికైన పిచ్‌పైనే ఆదివారం కీలక సూపర్–8 పోరు జరుగుతుందని క్యూరేటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈడెన్ పిచ్‌పై జరిగిన ఆ రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోరు చేసింది. తర్వాత ఇటలీని 134 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్, కరీబియన్లాంటి మేటి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లోనూ పరుగుల విందు గ్యారంటీ కావడంతో ఈడెన్ గార్డెన్స్ కిక్కిరిసి పోతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాటర్ల మెరుపులకే కాదు నాణ్యమైన స్పిన్‌కూ ఈడెన్ అచ్చొచ్చే వేదికని ఎన్నోమార్లు రుజువైంది కూడా! ఇటలీపై స్కాట్లాండ్ స్పిన్నర్లు మైకేల్ లిస్క్ (4/17), మార్క్ వ్యాట్ (2/24) 6 వికెట్లతో అదే నిరూపించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ స్వయంగా ఈడెన్ గార్డెన్స్‌లోకి వెళ్లి పిచ్‌ను తదేకంగా పరిశీలించారు. క్యూరేటర్‌తో వికెట్ పరిస్థితిపై చర్చించారు. అలాగే బోర్డు చీఫ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్‌ను కూడా కలిసి సమీక్షించారని ‘క్యాబ్’ వర్గాలు తెలిపాయి. వికెట్‌తో పాటు స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. -
సెమీస్‌లో దక్షిణాఫ్రికా
అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో 2024 టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్ ఇప్పుడు ‘సూపర్ ఎయిట్స్’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ‘సూపర్ ఎయిట్స్’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్ బాష్ (2/31) చెలరేగడంతో విండీస్ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్ (16), హెట్‌మైర్ (2), బ్రెండన్ కింగ్ (21), ఛేజ్ (2), రూథర్‌ఫర్డ్ (12), రావ్మన్ పావెల్ (9) పూర్తిగా విఫలమయ్యారు. 83/7 నుంచి విండీస్ జట్టును రొమారియో షెఫర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హోల్డర్ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్క్రమ్ (46 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడగా... డికాక్ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించారు. డికాక్‌తో తొలి వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్ మార్క్రమ్... రెండో వికెట్‌కు రికెల్టన్‌తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు. 89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్–హోల్డర్ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్ ప్లేయర్లు షరీఫ్–మోమ్సెన్ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్‌పై) కనుమరుగైంది. -
విండీస్‌కు కంటితుడుపు విజయం
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు కంటితుడుపు విజయం దక్కింది. ఈ సిరీస్‌ను ఇదివరకే 0-2తో కోల్పోయిన విండీస్.. నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన మూడో వన్డేలో గెలిచి పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. గ్రెనడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. తొలుత బౌలింగ్‌లో (10-2-33-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసిన హేలీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. హేలీ (10-2-33-2), కరిశ్మ (10-0-39-2), ఫ్లెచర్ (10-1-39-1), ఆశ్మిని (10-0-42-1) లంక ప్లేయర్లను కట్టడి చేశారు. లంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (70) అర్ద సెంచరీతో రాణించగా.. కవిష దిల్హరి (45 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేసింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తొలి 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హేలీ.. స్టెఫానీ టేలర్ (38) సహకారంతో విండీస్‌ను విజయతీరాల వరకు చేర్చింది. చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్), డియాండ్రా డాట్టిన్ (24) విండీస్‌ను విజయతీరాలు దాటించారు. 46 ఓవర్లలో విండీస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు మల్కి మదారా 2, రణవీర, కెప్టెన్ చమారీ చెరో వికెట్ తీశారు. -
దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం.. ఈ మ్యాచ్‌పై మన కన్ను
అహ్మదాబాద్: భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్‌కు ముందు జరిగే మరో సమరంపై కూడా టీమిండియా అభిమానుల దృష్టి నిలిచింది. ‘గ్రూప్–1’లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి. ఈ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీఫైనల్ స్థానంపై గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదు! జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం . -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్ ఈవాన్స్-రిచర్డ్ నగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్ చరిత్రలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక ఈవాన్స్, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్ 5, నగరవ ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించారు. షమార్ జోసఫ్ వేసిన 17వ ఓవర్లో ఈవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్ బాదాడు.ప్రపంచకప్ రికార్డుఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్ నెదర్లాండ్స్-ఐర్లాండ్ మ్యాచ్ పేరిట ఉండేది. ఆ మ్యాచ్‌లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ఓ ప్రపంచకప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వద్ద ఔట్ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో బెన్నెట్ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు బెన్నెట్ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్ (85), రోవ్‌మన్ పావెల్ (59), రూథర్‌ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్‌లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్‌రేట్‌ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్‌రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్‌రేట్ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్-8 మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, విండీస్) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, భారత్) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్‌పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్‌పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్‌తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్‌తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్ బెర్త్ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్‌లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్‌రేట్ ఉంటుంది. ఇలా జరిగి, భారత్.. జింబాబ్వే, విండీస్‌పై విజయాలు సాధించినా.. విండీస్, సౌతాఫ్రికా రన్‌రేట్‌ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్‌కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోష్‌లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్‌ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లో విండీస్ గెలిచినా భారత్ మూడో పొట్టి ప్రపంచకప్ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్త్‌లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్-1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం మాత్రం చాలా కష్టమే. -
WI vs ZIM: హెట్‌మైర్ ‘సూపర్’ షో
టాస్ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్‌మైర్ బ్యాటింగ్‌కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్‌నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్‌లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్–8’లో విండీస్‌కు భారీ విజయాన్నిచ్చింది. ముంబై: వెస్టిండీస్ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్‌కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్–8’ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్‌మైర్ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్‌గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. గుడకేశ్ మోతీ (4/28), హోసిన్ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్; అదేరోజు భారత్‌తో జింబాబ్వే ఆడతాయి. హెట్ ‘ఫైర్’ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), షై హోప్ (14) వికెట్లను కోల్పోయిన విండీస్ హెట్‌మైర్, పావెల్ ధనాధన్ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన కరీబియన్ బ్యాటర్‌గా రికార్డును నెలకొల్పాడు. హెట్‌మైర్ బాదిన మొత్తం 7 సిక్స్ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్‌మైర్ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్‌ను రెండోసారి క్యాచ్ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్‌ఫోర్డ్ (13 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫర్డ్ (10 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), హోల్డర్ (4 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) దంచేయడంతో విండీస్ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. హెట్మైర్జింబాబ్వే విలవిల ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్ (5), బర్ల్ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్ (28), కెప్టెన్ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్ ఎన్‌గరవ (7 నాటౌట్) అండతో బ్రాడ్ ఇవాన్స్ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవ 9; షై హోప్ (సి) బెనెట్ (బి) ఇవాన్స్ 14; హెట్‌మైర్ (సి) బెనెట్ (బి) క్రిమర్ 85; పావెల్ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 31; షెఫర్డ్ (సి) బర్ల్ (బి) ఎన్‌గరవ 21; హోల్డర్ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. బౌలింగ్: ఎన్‌గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్ 4–0–46–1, క్రిమర్ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్ 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (సి) హెట్‌మైర్ (బి) ఫోర్డ్ 14; బెనెట్ (బి) హోసిన్ 5; మైయెర్స్ (బి) మోతీ 28; బర్ల్ (సి) హెట్‌మైర్ (బి) హోసిన్ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్ (సి) హోసిన్ (బి) ఫోర్డ్ 43; క్రిమర్ (సి అండ్ బి) హోల్డర్ 0; ముజరబాని (సి) జోసెఫ్ (బి) హోసిన్ 0; ఎన్‌గరవ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్: హోసిన్ 4–1–28–3, ఫోర్డ్ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్ 3–0–35–0, హోల్డర్ 3–0–25–1. -
వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసం.. ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు బ్రాండెన్ కింగ్(9), షాయ్ హోప్(14) విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్‌మైర్ అయితే జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్‌మైర్ కేవలం బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అతడితో పాటు రావ్మన్ పావెల్(59), రూథర్ ఫర్డ్(31), షెఫర్డ్(21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలరల్లో నగారవ, ముజర్బానీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. క్రీమర్, ఎవెన్స్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలన విజయం సాధిస్తుందా..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 23) వెస్టిండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఏ జట్టూ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. గ్రూప్ దశలో ఇరు జట్లు టాపర్లుగా నిలిచి సూపర్-8లోకి ప్రవేశించాయి. వెస్టిండీస్.. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లపై విజయాలు సాధించి ఫైనల్-8కు అర్హత సాధించగా.. జింబాబ్వే గ్రూప్ దశలో పెను సంచలనాలే సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే.. తమ కంటే మెరుగైన శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై విజయం సాధించగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన విండీస్, జింబాబ్వే.. గ్రూప్ దశలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో నేటి మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీసే ఫేవరెట్ అయినా, జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ఎడిషన్‌లో వారి ఆటతీరు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరు విజయాల కోసం శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతున్నారు. వారి ప్రధాన ఆయుధాలు కెప్టెన్ సికందర్ రజా, పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ. వీరిద్దరు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ టోర్నీలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు మరోసారి శుభారంభాన్ని ఇస్తే జింబాబ్వే భారీ స్కోర్ చేయగలుగుతుంది. ముజరబానీకి తోడుగా ఫామ్‌లో ఉన్న బ్రాడ్ ఈవాన్స్ కూడా రాణిస్తే.. విండీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ప్రస్తుత ప్రపంచకప్‌లో కలిసికట్టుగా ఆడుతూ వరుస విజయాలు నమోదు చేసింది. గ్రూప్ దశలో ఈ జట్టు ఒక్క బలమైన జట్టుపైనే (ఇంగ్లండ్) విజయం సాధించినప్పటికీ.. చిన్న జట్లపై వారి విజయాలను తీసిపారేయడానికి వీల్లేదు. ఆ మ్యాచ్‌ల్లో విండీస్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. మరోసారి అదే ప్రదర్శనలు పునరావృతమైతే తొలిసారి సెమీస్‌కు చేరాలనుకున్న జింబాబ్వేకు ఆశాభంగం కలగవచ్చు. గత నాలుగు మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించిన హోప్, హెట్‌మైర్, షెపర్డ్, మోటీ, హోల్డర్, షమార్ జోసఫ్‌పై విండీస్ మరోసారి భారీ అంచనాలు పెట్టుకుంది. గత మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రొమారియో షెపర్డ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం విండీస్ బలాన్ని మరింత పెంచుతుంది. 70 (విండీస్)-30 (జింబాబ్వే) అంచనాలు ఉన్న ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. -
T20 WC 2026: ఏ జట్లకు సెమీస్ అవకాశాలు..?
టీ20 వరల్డ్‌కప్ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఫైనల్-8కి అర్హత సాధించాయి.సూపర్-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్, జింబాబ్వే గ్రూప్ 1లో ఉండగా.. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ గ్రూప్ 2లో ఉన్నాయి. సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్ 1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరుగనుండగా.. గ్రూప్ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్, ఫైనల్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.సూపర్-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్‌పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్ ఆఫ్ వార్ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.సూపర్ 8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇరు గ్రూప్‌ల్లో ఆ రెండు బెర్త్‌ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.గ్రూప్ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా గ్రూప్ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి జోష్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే, ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి భారత్ ఫైనల్-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. ఇక మిగిలిన రెండో బెర్త్ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్ దశలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్ చేసింది. మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్‌లో తృటిలో మిస్ అయిన టైటిల్ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్ సాధించి, క్రికెట్ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. గ్రూప్ 1 నుంచి అండర్ డాగ్ ఏ జట్టు అంటే విండీస్ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్ హోప్ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్ సహా హెట్‌మైర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మోటీ, షమార్ జోసఫ్ సూపర్-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.గ్రూప్ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్ గ్రూప్ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా మూడు జట్లు సెమీస్ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్‌కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్‌పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్‌గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్‌పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను మట్టికరిపించగల సమర్దులు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్‌లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్‌లోకి వస్తే.. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్‌లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతికష్టం మీద సూపర్-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.ఓవరాల్‌గా చూస్తే.. గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా.. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టునూ హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు. -
T20 WC 2026: విండీస్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని, ఓ అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇటలీతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు కూడా పట్టిన షమార్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్‌ను నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల క్రికెట్లోనే కాకుండా మహిళల క్రికెట్లోనూ ఇలాంటి ఫీట్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనతో షమార్ మరో రికార్డు కూడా సమం చేశాడు. ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు (4) పట్టిన నాన్ వికెట్‌కీపర్‌గా డారెన్ సామీ, మార్క్రమ్, మ్యాక్స్‌వెల్, జార్జ్ మున్సే సరసన చేరాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పసికూన ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా గ్రూప్ దశలో (సి) ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసి, అజేయ జట్టుగా సూపర్-8 దశకు చేరింది. సూపర్-8లో విండీస్.. భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.రాణించిన హోప్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. షాయ్ హోప్ (46 బంతుల్లో 75; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (24 నాటౌట్), మాథ్యూ ఫోర్డ్ (16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇటలీ బౌలర్లలో బెన్ మనెంటి, కలుగమగే తలో 2 వికెట్లు తీయగా.. అలీ హసన్, డ్రాకా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఇటలీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. షమార్ జోసఫ్ (4-0-30-4), మాథ్యూ ఫోర్డ్ (4-0-19-3), గుడకేశ్ మోటీ (4-0-24-2), అకీల్ హొసేన్ (3-0-25-1) ధాటికి ఆ జట్టు 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఇటలీ ఇన్నింగ్స్‌లో బెన్ మనెంటి (26) టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో ఇటలీ ప్రయాణం ముగిసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన ఈ ఐరోపా జట్టు తమ కంటే చాలా రెట్లు మెరుగైన నేపాల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించింది. -
T20 WC 2026: విండీస్ మరోసారి.. తొలి జట్టు..!
రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ మూడో టైటిల్ దిశగా తొలి అడుగు వేసింది. 2026 ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టు వెస్టిండీసే. నేపాల్‌పై విజయం సాధించడంతో విండీస్ సూపర్-8 బెర్త్ ఖరారైంది.ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో పసికూనను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో నేపాల్‌ను 133 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసిన కరీబియన్ జట్టు.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో (4-0-27-4) ఇరగదీసి నేపాల్‌ను దెబ్బేశాడు. మాథ్యూ ఫోర్డ్ (4-1-10-1) పొదుపుగా బౌలింగ్ చేసి నేపాల్‌ను కట్టడి చేశాడు. అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, రోస్టన్ ఛేజ్ కూడా తలో వికెట్ తీసి నేపాల్‌ను ఇబ్బంది పెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో సోమ్‌పాల్ కామీ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నేపాల్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ షాయ్ హోప్ (61) అజేయమైన అర్ద సెంచరీతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. హోప్‌కు హెట్‌మైర్ (46 నాటౌట్), బ్రాండన్ కింగ్ (22) సహకరించారు. ఈ ఓటమితో నేపాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మెగా టోర్నీలో ఈ జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. అయితే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మాత్రం ఓడించినంత పని చేసింది. ఇదొక్కటే ఈ ఎడిషన్‌లో నేపాల్‌కు ఊరట కలిగించే విషయం. ఫిబ్రవరి 17న ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్ (స్కాట్లాండ్) ఆడనుంది. -
రూథర్‌ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్‌ను షిమ్రోన్ హెట్‌మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్‌ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్‌కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్‌ను 200 దరికి చేర్చారు. రూథర్‌ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి. -
విండీస్ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. పీటర్ ట్రెగో (60), కిర్క్ ఎడ్వర్డ్స్ (41), అంబటి రాయుడు (36), కెప్టెన్ శిఖర్ ధవన్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్ (2), రిషి ధవన్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్ బౌలర్లలో సుభోత్ భాటి 3, హర్భజన్ సింగ్ 2, ఇసురు ఉడాన ఓ వికెట్ తీశారు.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్ వాల్టన్ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్ శ్రీవట్స్ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్ కోల్పోయిన ఏకైక వికెట్ పియుశ్ చావ్లాకు దక్కింది. -
టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్ జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం
భారత్, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. సంచలన ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్, 25 ఏళ్ల గయానీస్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.మాజీ కెప్టెన్లు జేసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. పేసర్లుగా ఫోర్డ్, సీల్స్ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో ఆకీల్ హొసేన్, రోస్టన్ చేజ్, గుడకేశ్ మోటీ, ఆల్‌రౌండర్ విభాగంలో విధ్వంసకర బ్యాటర్ రొమారియో షెపర్డ్ అవకాశాలు దక్కించుకున్నారు. గాయాల కారణంగా ఎవిన్ లూయిస్, అల్జరీ జోసఫ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో మిగతా జట్లుగా ఇంగ్లండ్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ ఉన్నాయి. విండీస్ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్పై తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదే వేదికపై వారు చివరిసారి వరల్డ్‌కప్ గెలిచారు. టీ20 ప్రపంచకప్ 2026 కోసం విండీస్ జట్టు..షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ -
షమార్ హ్యాట్రిక్.. విండీస్ ఘన విజయం
దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 47, జాన్సన్ ఛార్లెస్ 17, కీసీ కార్తీ 10, జస్టిన్ గ్రీవ్స్ 12, షిమ్రోన్ హెట్‌మైర్ 13, క్వెన్టిన్ శాంప్సన్ 3, మాథ్యూ ఫోర్డ్ 27, షమార్ స్ప్రింగర్ 16 (నాటౌట్), మోటీ 2 (నాటౌట్) పరుగులు చేశారు.ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రహ్మాన్ షరీఫి, రషీద్ ఖాన్, అహ్మద్జాయ్ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్ (71), ఇబ్రహీం జద్రాన్ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. షమార్ స్ప్రింగర్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. షమార్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, ఫోర్డ్, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. -
వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్ రిపీటైంది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. సెదిఖుల్లా అటల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. జియా ఉర్ రెహ్మాన్ (4-0-36-3), రషీద్ ఖాన్ (4-0-19-2), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-29-2), నూర్ అహ్మద్ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో సాంప్సన్ (30) టాప్ స్కోరర్‌గా కాగా.. జాన్సన్ ఛార్లెస్ (27), మోటీ (28), ఫోర్డ్ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్ చెరో 4, జాంగూ, హెట్‌మైర్, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన జేసన్ హోల్డర్
విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్ ఈ ఏడాది 69 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హోల్డర్ (అబుదాబీ నైట్‌రైడర్స్) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.హోల్డర్‌కు ముందు ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ 2018లో 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో, నూర్ అహ్మద్ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఇదే ఏడాది 64 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీశాడు.డెత్ ఓవర్ల స్పెషలిస్ట్హోల్డర్ ఇటీవలికాలంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన హోల్డర్‌ను ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.హోల్డర్ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్ (66) ఉన్నారు. రషీద్ ఖాన్ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్‌వెల్ -
పోరాడుతున్న వెస్టిండీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్‌నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేయగా... జాన్ క్యాంప్‌బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్‌బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. -
న్యూజిలాండ్‌కు ఆధిక్యం
వెల్లింగ్టన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్ విలియమ్సన్ (37; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (25; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్ల ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్ టిక్నెర్ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (14), అండర్సన్ ఫిలిప్ (0) అవుట్ కాగా... బ్రాండన్ కింగ్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు), కవెమ్ హడ్జ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ రే చెరో వికెట్ పడగొట్టారు. -
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.ఆట చివరి రోజు జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీతో (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్ చేసిన పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్ ఆడిన ఇన్నింగ్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.37 ఏళ్ల వయసులో రోచ్ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. అంతకుముందు షాయ్ హోప్ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.ముఖ్యంగా గ్రీవ్స్ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి, తన జట్టు మ్యాచ్‌ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తిస్తుంది.ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్ గణాన్ని కాదు. మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ లాంటి పేస్ బౌలింగ్ దిగ్గజాలను, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్‌లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్ హోప్ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్‌ను పాకిస్తాన్లో ఓడించి, పూర్వ వైభవం దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.సరికొత్త చరిత్ర అయ్యేదిఈ మ్యాచ్ విండీస్ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.లాథమ్, రచిన్ శతకాలుఅంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (466/8) చేసి విండీస్ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్ రోచ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.చెలరేగిన డఫీదీనికి ముందు జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.కలిసికట్టుగా రాణించిన విండీస్ బౌలర్లువిండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. -
ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న కరీబియన్ యోధుడు
1970, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌ను శాశించిన వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతుంది. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్, బోర్డు ఆర్థిక సమస్యలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఆ జట్టు కనీసం చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (1975, 1979), రెండు సార్లు టీ20 ప్రపంచకప్ (2012, 2016) ఛాంపియన్ అయిన ఆ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటేనే ఇబ్బంది పడుతుందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును ఓ 'హోప్' నిలబెడుతుంది. ఆ హోప్ పేరే 'షాయ్ హోప్' (Shai Hope). ఈ బార్బడోస్ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రస్తుతం విండీస్ క్రికెట్‌కు ఆశాకిరణంలా మారాడు. విండీస్ జట్టు అడపాదడపా విజయాలు సాధిస్తుందంటే ఈ హోప్ పుణ్యమే. ఈ హోపే లేకుంటే విండీస్ క్రికెట్‌కు నామరూపాలు కూడా లేవు.ఈ ఒక్కడే నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ పటంలో విండీస్ పేరు తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుతున్నాడు. ఫార్మాట్లో ఏదైనా ఇతనికి అండగా నిలబడే ఒక్క ప్లేయర్ కూడా ప్రస్తుత విండీస్ జట్టులో లేడు. ఎవరైనా ఉన్నా వారు వన్ మ్యాచ్ వండర్లానే మిగిలిపోతున్నారు.హోప్ ఒక్కడే బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా (పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో) త్రిపాత్రాభినయం చేస్తూ విండీస్ క్రికెట్‌ను బ్రతికిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఈ హోప్ మరింత రాటుదేలాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లకు పోటీగా మారాడు. ఫార్మాట్ ఏదైనా హోప్ తన తడాఖా చూపుతున్నాడు.తొలుత టెస్ట్‌ల్లో కాస్త వీక్‌గా కనిపించినా, క్రమంగా ఈ ఫార్మాట్‌పై కూడా తన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై 2, భారత్‌లో ఒకటి, తాజాగా న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ చేశాడు. వాస్తవానికి హోప్ అత్యుత్తమంగా ఆడే ఫార్మాట్ వన్డే క్రికెట్. ఈ ఫార్మాట్లో హోప్‌ను మించినోడు లేడు. అతని గణాంకాలే ఇందుకు నిదర్శనం. 148 మ్యాచ్‌ల్లో అతను 50కి పైగా సగటుతో 19 సెంచరీల సాయంతో 6000 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ గణాంకాలు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి గణాంకాలతో పోటీపడతాయి. ముఖ్యంగా ఈ ఏడాది హోప్ ఫార్మాట్లకతీంగా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 శతకంతో మొదలుకొని భారత్‌లో టెస్ట్ శతకం, పాకిస్తాన్లో వన్డే శతకం, న్యూజిలాండ్‌లో మరో వన్డే శతకం, తాజాగా న్యూజిలాండ్‌లో టెస్ట్ శతకం సాధించి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ముందువరుసలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ (1732) ఒక్కడే హోప్ (1677) కంటే ఎక్కువ పరుగులు చేశాడు.తాజాగా హోప్ న్యూజిలాండ్‌పై చేసిన టెస్ట్ సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే హోప్ ఈ సెంచరీ చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (116) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్ గ్రీవ్స్‌తో (55) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 140 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాంటే చివరి రోజు 319 పరుగులు చేయాలి. హోప్ కసి చూస్తే విండీస్‌కు సంచలన విజయం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే విండీస్ క్రికెట్ పునర్జన్మకు బీజం పడినట్లే. -
హోప్ వీరోచిత శతకం.. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే..!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్ గ్రీవ్స్‌తో (42) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవలేదు.అంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (466/8) చేసింది. కీమర్ రోచ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి ముందు.. జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.అంతకుముందు న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. విండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. -
నరైన్@600.. లివింగ్‌స్టోన్ ధన్ ధనాధన్
విండీస్ టీ20 స్పెషలిస్ట్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ (Sunil Narine) పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్ 3) షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ (టామ్ ఏబెల్) తీశాడు. ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్ నరైన్‌కు టీ20 క్రికెట్లో 600వది. ఈ ఫార్మాట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్‌తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్‌కు ముందు డ్వేన్ బ్రావో (631), రషీద్ ఖాన్ (681) 600 వికెట్ల క్లబ్లో చేరారు.లివింగ్‌స్టోన్ ఊచకోతషార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్ హేల్స్ (32), షరాఫు (34), రూథర్‌ఫోర్డ్ (45) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ చేతులెత్తేసింది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసి 600 వికెట్ల క్లబ్లో చేరాడు. -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్ బౌలర్లు రెచ్చిపోయి కివీస్‌ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్ బౌలర్లు విండీస్‌ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. మ్యాట్ హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.తేజ్‌నరైన్ చంద్రపాల్ (52), షాయ్ హోప్ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్ (14), రోచ్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.అంతకుముందు విండీస్ బౌలర్లు తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్‌వెల్ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్ చేయగలిగింది.64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ 10, డెవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. -
కివీస్‌పై విండీస్ ఆధిపత్యం
క్రైస్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. కీమర్ రోచ్, సీల్స్, షీల్డ్స్, గ్రీవ్స్ తలో 2.. లేన్, ఛేజ్ చెరో వికెట్ తీసి కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 231 పరుగులకే కుప్పకూల్చారు.కివీస్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్‌వెల్ (47), బ్లండల్ (29), లాథమ్ (24), నాథన్ స్మిత్ (23), యంగ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్ (3), ఫౌల్క్స్ (4), హెన్రీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌పై విండీస్ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.అనంతరం బరిలోకి దిగిన విండీస్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్ హోప్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ 38, కెప్టెన్ ఛేజ్ 0 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ ఇది. -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
హామిల్టన్ (న్యూజిలాండ్): ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టి20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న కివీస్... వన్డే సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఆఖరి పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ ఛేజ్ (51 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జాన్ క్యాంప్‌బెల్ (26; 3 ఫోర్లు, 1 సిక్స్), ఖారీ పియర్ (22 నాటౌట్; 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. కెపె్టన్ షై హోప్ (16), అకీమ్ అగస్ట్ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్ (19), జస్టిన్ గ్రేవ్స్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (63 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి హాఫ్‌సెంచరీతో సత్తాచాటగా... మిచెల్ బ్రాస్‌వెల్ (31 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (14)తో పాటు విల్ యంగ్ (3), టామ్ లాథమ్ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును చాప్మన్ ఆదుకున్నాడు. బ్రాస్‌వెల్‌తో కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్ సీల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ప్లేయర్లు మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కైల్ జెమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 2 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. -
రికార్డులు కొల్లగొట్టిన హోప్
వెస్టిండీస్ సంచలన బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) వన్డే క్రికెట్లో రికార్డుల మీద రికార్డును నమోదు చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 19) జరిగిన వన్డేలో సుడిగాలి శతకం బాదిన అతడు.. వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చిన హోప్ కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఖాతాలో ఈ కింది రికార్డులు చేరాయి.ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. తద్వారా క్రిస్ గేల్ (25) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (19) రికార్డు సమం.19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. తద్వారా బాబర్ ఆజమ్ (102), హాషిమ్ ఆమ్లా (104), విరాట్ కోహ్లి (124), డేవిడ్ వార్నర్ (139) తర్వాత అత్యంత వేగంగా ఈ శతకాల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు.ఈ 19 శతకాలను హోప్ 12 వేర్వేరు దేశాలపై సాధించాడు. భారత్, బంగ్లాదేశ్‌పై అత్యధికంగా తలో 3 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై హోప్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ.ఈ సెంచరీతో హోప్ ఈ దశాబ్దంలో (2015-2025) అత్యధిక సెంచరీలు చేసిన తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. తద్వారా బాబర్ ఆజమ్ (9), డికాక్ (8), కోహ్లి (8), గుర్బాజ్ (8), గిల్‌ను (8) మరింత వెనక్కు నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మార్కును తాకేందుకు అతనికి 142 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా గ్రేట్ వివ్ రిచర్డ్స్ (141) తర్వాత అత్యంత వేగంగా 6000 పరుగుల మార్కును తాకిన విండీస్ ఆటగాడిగా రికార్డు.హోప్ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇన్ని రికార్డులు సాధించినా ఈ మ్యాచ్‌లో విండీస్ పరాజయంపాలవడం విచారకరం. ఈ పరాజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల -
షాయ్ హోప్ మహోగ్రరూపం
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకున్న కరీబియన్ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్ 109 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో మాథ్యూ ఫోర్డ్ (21), రూథర్‌ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్ (39 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.19వ సెంచరీఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. క్రిస్ గేల్ (25) తర్వాత వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసింది హోపే. 19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం మరో విశేషం. ఈ సెంచరీలకు హోప్ 12 దేశాలపై చేశాడు. -
నిప్పులు చెరిగిన డఫీ.. న్యూజిలాండ్‌దే టీ20 సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. డునెడిన్ వేదికగా ఇవాళ (నవంబర్ 13) జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ (18.4 ఓవర్లలో) చేసింది. జేకబ్ డఫీ (Jacob Duffy) 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. మరో పేసర్ జిమ్మీ నీషమ్ 2, జేమీసన్, బ్రేస్‌వెల్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (36) బ్యాట్ ఝులిపించకపోయుంటే విండీస్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. వీరితో పాటు జేసన్ హోల్డర్ (20), రోవ్‌మన్ పావెల్ (11), షాయ్ హోప్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (45), డెవాన్ కాన్వే (47 నాటౌట్) రాణించడంతో 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ గెలుపులో రచిన్ రవీంద్ర (2), చాప్మన్ (21 నాటౌట్) కూడా తలో చేయి వేశారు. షెపర్డ్, స్ప్రింగర్‌కు తలో వికెట్ దక్కింది.ఈ సిరీస్‌లో విండీస్ తొలి మ్యాచ్‌లో గెలువగా.. న్యూజిలాండ్ 2, 3, 5 టీ20లు గెలిచింది. వర్షం కారణంగా నాలుగో టీ20 రద్దైంది. నవంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది. చదవండి: ఐపీఎల్లో జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..! -
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్‌కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్ షో -
రాణించిన హోప్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగింది.రాణించిన హోప్విండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్‌మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.సత్తా చాటిన బౌలర్లుఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తుది జట్లు..వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీచదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా దేశవాలీ స్టార్ -
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు... టి20 సిరీస్‌లో అదరగొట్టింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు చివరి మ్యాచ్‌లోనూ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. శుక్రవారం జరిగిన నామమాత్రమైన పోరులో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్జీద్ హసన్ (62 బంతుల్లో 89; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. జట్టు మొత్తంలో తన్జీద్తో పాటు సైఫ్ హసన్ (22 బంతుల్లో 23; 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెపె్టన్ లిటన్ దాస్ (6), పర్వేజ్ హుసేన్ (9), రిషాద్ హుసేన్ (3), నూరుల్ హసన్ (1), నసుమ్ అహ్మద్ (1), జాకీర్ అలీ (5) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఒక ఎండ్‌లో తన్జీద్ పాతుకుపోయినా... మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. ఒక్క బ్యాటర్ కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయకుడానే పెవిలియన్ బాట పట్టారు. అయినా పట్టుదలతో ఆడిన తన్జీద్ జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ పడగొట్టగా... జాసెన్ హోల్డర్, ఖారీ పియర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ జట్టు 16.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), అకీమ్ అగస్టె (25 బంతుల్లో 50; ఒక ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో అలరించారు. వికెట్ కీపర్ అమీర్ జాంగో (34; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. బ్రాండన్ కింగ్ (8), అలిక్ అథనాజె (1) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్హుసేన్ 3 వికెట్లు పడగొట్టాడు. రోస్టన్ చేజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రొమారియో షెఫర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
టీ20 సిరీస్ విండీస్‌దే
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టుకు ఊరట లభించే విజయం దొరికింది. తొలుత జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (అక్టోబర్ 29) జరిగిన రెండో టీ20లో విండీస్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలిక్ అథనాజ్ (52), షాయ్ హోప్ (55) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీసః ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, నసుమ్ అహ్మద్, రిషద్ హొస్సేన్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు.అనంతరం స్వల్ప స్కోర్‌ను విండీస్ బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. అకీల్ హోసేన్, రొమారియో షెపర్డ్ తలో 3, హోల్డర్ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తంజిద్ హసన్ తమీమ్ (61) ఒంటరిపోరాటం వృధా అయ్యింది. నామమాత్రపు మూడో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 31న జరుగనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ -
వెస్టిండీస్ బోణీ
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (Bangladesh vs West Indies) వెస్టిండీస్ బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (ఆక్టోబర్ 27) జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్, కెప్టెన్ అయిన లిట్టన్ దాస్ 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. చదవండి: ఐసీయూ నుంచి బయటకు! -
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్‌లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్‌లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్‌లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్‌ను ఇంకా తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో విండీస్ గెలుపొందింది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
సిరీస్ డిసైడర్.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు. ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్‌లో కీలక చేరిక -
ఉత్కంఠ సమరం.. సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్‌పై విండీస్ విజయం
బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య (Bangladesh Vs West Indies) ఇవాళ (అక్టోబర్ 21) ఉత్కంఠ సమరం జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.స్పిన్నర్లకు స్వర్గధామమైన ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఊహించిన విధంగానే పిచ్ సహకరించడంతో విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.బంగ్లాదేశ్‌ను 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ కూడా తడబడింది. ఓ దశలో పూర్తిగా చేతులెత్తేసింది. అయితే షాయ్ హోప్ (53 నాటౌట్) టెయిలెండర్ల సహకారంతో మ్యాచ్‌ను చివరి బంతివరకు తీసుకొచ్చాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. ఖారీ పియెర్రీ రెండు పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఓ కనీవినీ ఎరుగని రికార్డు సెట్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మక చివరి వన్డే ఢాకా వేదికగానే అక్టోబర్ 23న జరుగనుంది.చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్‌గా ఇంకో అఫ్రిది -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే క్రికెట్లో తొలిసారి
వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies) సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురితో స్పిన్ బౌలింగ్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు.తొలి నలుగురితో స్పిన్ బౌలింగ్ చేయించిన దాఖలాలు (ఐదు సందర్భాల్లో) ఉన్నా, అవి అసోసియేట్ దేశాల క్రికెట్లో జరిగాయి. ఓ ఫుల్ మెంబర్ జట్టు తొలి ఐదుగురి బౌలర్లతో స్పిన్ వేయించడం మాత్రం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో (Bangladesh Vs West Indies) ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలుత బౌలింగ్ చేస్తూ.. ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతోనే దాడి ప్రారంభించాడు. ఇలా జరగడం కూడా వన్డే క్రికెట్ చరిత్రలో ఐదోసారి మాత్రమే.గత మూడు ఘటనలు ఇదే వేదికగా జరిగాయి. మూడు సందర్భాల్లో కూడా బంగ్లాదేశే ఈ ప్రయోగాన్ని చేసింది. న్యూజిలాండ్ జట్టు వన్డే క్రికెట్లో తొలిసారి ఈ ప్రయోగాన్ని చేసిన జట్టుగా నిలిచింది. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతో (జీతన్ పటేల్, సాంట్నర్) బౌలింగ్ ప్రారంభించింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌కు సంబంధించిన పిచ్ కూడా అలాగే ఉంది. దీంతో తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చిన విండీస్ కేవలం స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది.అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్‌తో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన విండీస్.. ఆతర్వాత కూడా స్పిన్నర్లనే (ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోటీ, అలిక్ అథనాజ్) కొనసాగించింది. అంచనాలకు తగ్గట్టుగానే విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.ఆతిథ్య జట్టును 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.విండీస్ ప్రపంచ రికార్డురెండు వైపుల నుంచి బౌలింగ్ అటాక్‌ను స్పిన్నర్లతోనే ప్రారంభించి, ఆతర్వాత కూడా మరో ముగ్గురు స్పిన్నర్లనే కొనసాగించి, ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురు బౌలర్లతో స్పిన్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం విండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 74 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. చదవండి: పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..? -
లాంఛనం ముగిసింది
న్యూఢిల్లీ: వెస్టిండీస్ మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన పోరాటం నాలుగో రోజూ కొనసాగడం... ఇద్దరి సెంచరీల మైలురాయితో ఆతిథ్య భారత్ ముందు లక్ష్యాన్ని ఉంచడంతో ఈ చివరి టెస్టు చివరి రోజుదాకా సాగింది. మంగళవారం ఆటలో భారత్ సులువైన లక్ష్య ఛేదనలో మిగిలిపోయిన లాంఛనాన్ని తొలి సెషన్లోనే పూర్తి చేసింది. అలా రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది. ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (108 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం సాధించాడు. రోస్టన్ చేజ్ 2 వికెట్లు తీయగా... వారికెన్కు ఒక వికెట్ దక్కింది. రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లభించింది. రెండు టెస్టుల్లో ఆడిన ఒకే ఇన్నింగ్స్‌తో శతక్కొట్టిన జడేజా 8 వికెట్లు కూడా తీశాడు. కాగా ఈ రెండో టెస్టులో 8 వికెట్లు (5/82, 3/104) పడగొట్టిన కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గంటసేపు పైగా... ఆఖరి రోజు మిగిలిపోయిన 58 పరుగులు చేసేందుకు 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కాసేపటికే సాయి సుదర్శన్ (76 బంతుల్లో 39; 5 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రాహుల్‌కు జతయిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (13) కూడా వికెట్‌ను సమర్పించుకోవడంతో లాంఛనం పూర్తి చేసేందుకు భారత్ గంటసేపు పైగానే ఆడాల్సి వచ్చింది. క్రీజులోకి ధ్రువ్ జురేల్ (6 నాటౌట్; 1 ఫోర్) రాగా... 102 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. కేఎల్ రాహుల్ తొలి టెస్టులో శతకంతో కదంతొక్కాడు. ఈ క్లీన్‌స్వీప్ విజయంతో టీమిండియా ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ పాయింట్ల పట్టికలో 61.9 శాతంతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 390; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) ఫిలిప్ (బి) వారికెన్ 8; రాహుల్ (నాటౌట్) 58; సాయి సుదర్శన్ (సి) షై హోప్ (బి) చేజ్ 39; గిల్ (సి) గ్రీవెస్ (బి) చేజ్ 13; ధ్రువ్ జురేల్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (35.2 ఓవర్లలో 3 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–9, 2–88, 3–108. బౌలింగ్: సీల్స్ 3–0–14–0, వారికెన్ 15.2–4–39–1, పియర్ 8–0–35–0, చేజ్ 9–2–36–2.10 వెస్టిండీస్‌పై భారత్ వరుస సిరీస్ విజయాల సంఖ్య. దక్షిణాఫ్రికా పేరిట ఉన్న ఒకే జట్టుపై వరుస సిరీస్ విజయాల రికార్డును భారత్ సమం చేసింది. దక్షిణాఫ్రికా జట్టు కూడా విండీస్‌పై వరుసగా పది సిరీస్‌లలో గెలిచింది. 14 ఢిల్లీ గడ్డపై టీమిండియా అజేయ రికార్డు. భారత్ 1993 నుంచి ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడలేదు. 12 టెస్టులు గెలువగా, రెండు ‘డ్రా’ అయ్యాయి.122 సొంతగడ్డపై భారత్ గెలిచిన టెస్టులు. సంప్రదాయ క్రికెట్ చరిత్రలోనే ఇది మూడో అత్యధికం. ఆ్రస్టేలియా (262), ఇంగ్లండ్ (241) మాత్రమే ముందున్నాయి. -
IND Vs WI: గెలుపు వాకిట్లో భారత్
వెస్టిండీస్‌పై రెండో టెస్టు గెలిచేందుకు, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్ 58 పరుగుల దూరంలోనే ఉంది. ఆఖరి రోజు లంచ్ బ్రేక్‌కు ముందే ఈ లాంఛనం పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అంతకుముందు వెస్టిండీస్ చాన్నాళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు క్రికెట్లో పోరాడింది. నిర్జీవమైన పిచ్‌పై ఓవర్‌నైట్ బ్యాటర్లు క్యాంప్‌బెల్, షై హోప్ ఇద్దరు శతకాల మోత మోగించడంతో భారత్ లక్ష్యఛేదనకు దిగాల్సి వచి్చంది. ఫలితంగా మ్యాచ్ ఐదో రోజుకు చేరింది. న్యూఢిల్లీ: భారత్ ఆఖరి టెస్టులో గెలుపు వాకిట నిలిచింది. మంగళవారం ఉదయం ఆ లాంఛనాన్ని పూర్తిచేస్తే చాలు టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది. ఎట్టకేలకు వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లకు పని పెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కఠిన సవాళ్లు విసిరారు. తొలి టెస్టును మూడే రోజుల్లో ముగించిన ఆతిథ్య జట్టు... స్పిన్‌కు అచ్చొచ్చే ఢిల్లీ పిచ్ ఈసారి నిర్జీవంగా మారడంతో వికెట్లు తీసేందుకు చెమటోడ్చింది.పేసర్లు బుమ్రా (3/44), సిరాజ్ (2/43), స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/104), రవీంద్ర జడేజా (1/102), వాషింగ్టన్ సుందర్ (1/80) సమష్టిగా రాణించారు. స్పిన్ త్రయం 5, పేస్ ద్వయం 5 ఇలా చెరో సగం వికెట్లతో ప్రత్యర్థి జట్టును కూల్చారు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. అనంతరం 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (8) అవుటవ్వగా, కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 25 బ్యాటింగ్; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (47 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లున్న భారత్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి. కదంతొక్కిన హోప్, క్యాంప్‌బెల్ ఓవర్‌నైట్ స్కోరు 173/2తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్ బ్యాటర్లు క్యాంప్‌బెల్, హోప్ కదంతొక్కారు. పేస్, స్పిన్ బౌలింగ్‌పై యథేచ్చగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ క్యాంప్‌బెల్ టెస్టు క్రికెట్లో తొలి సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు. జడేజా ఓవర్లో భారీ సిక్సర్‌తో క్యాంప్‌బెల్ శతకాన్ని సాధించగా, షై హోప్ కూడా సెంచరీ దిశగా సాగిపోయాడు. దీంతో ఈ సెషన్లో భారత బౌలర్లకు కఠిన పరీక్ష తప్పలేదు. క్యాంప్‌బెల్‌ను జడేజా ఎల్బీగా అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హోప్‌కు కెపె్టన్ రోస్టన్ చేజ్ జతవ్వగా... విండీస్ 252/3 స్కోరు వద్ద లంచ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ కొత్త బంతిని తీసుకుంది. నింపాదిగా ఆడుతున్న హోప్ కూడా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చేజ్ (72 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో పాతుకుపోవడంతో నాలుగో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగిపోయింది. ఈ దశలో సిరాజ్... హోప్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి 59 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. గ్రీవెస్ అర్ధశతకం తర్వాత కుల్దీప్ మ్యాజిక్కు స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కూలాయి. మొదట ఇమ్లాచ్ (13)ను అవుట్ చేసిన కుల్దీప్ తర్వాతి ఓవర్లో చేజ్, పియర్ (0)లను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 300 దాటాక బుమ్రా నిప్పులు చేరగడంతో వారికెన్ (3), ఫిలిప్ (2)లు నిష్క్రమించారు. దీంతో 311 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కూలింది. ఇక ఆఖరి వికెటే కదా ఆలౌట్ తేలికే అనుకుంటే... మిడిలార్డర్ బ్యాటర్ జస్టిన్ గ్రీవెస్ (85 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) మొండిగా పోరాడాడు. దీంతో రెండో సెషన్ నుంచి ఆఖరి సెషన్ వరకు గ్రీవెస్, జేడెన్ సీల్స్ (67 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్)తో భాగస్వామ్యమే లాక్కొచ్చింది. గ్రీవెస్ అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత... సీల్స్‌ను బుమ్రా అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. చివరి వికెట్‌కు సీల్స్, గ్రీవెస్ ఏకంగా 79 పరుగులు జోడించడం విశేషం. భారత్ ముందు వంద పైచిలుకు లక్ష్యానికి, ఐదో రోజు పొడిగింపునకు ఈ భాగస్వామ్యమే కారణమైంది.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: 248; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 115; తేజ్ చందర్‌పాల్ (సి) గిల్ (బి) సిరాజ్ 10; అతనేజ్ (బి) సుందర్ 7; షై హోప్ (బి) సిరాజ్ 103; చేజ్ (సి) సబ్–పడిక్కల్ (బి) కుల్దీప్ 40; ఇమ్లాచ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 12; గ్రీవెస్ (నాటౌట్) 50; పియర్ (సి) నితీశ్ రెడ్డి (బి) కుల్దీప్ 0; వారికెన్ (బి) బుమ్రా 3; ఫిలిప్ (సి) జురేల్ (బి) బుమ్రా 2; సీల్స్ (సి) సుందర్ (బి) బుమ్రా 32; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం ( 118.5 ఓవర్లలో ఆలౌట్) 390. వికెట్ల పతనం: 1–17, 2–35, 3–212, 4–271, 5–293, 6–298, 7–298, 8–307, 9–311, 10–390. బౌలింగ్: సిరాజ్ 15–3–43–2, జడేజా 33–10–102–1, సుందర్ 23–3–80–1, కుల్దీప్ 29–4–104–3, బుమ్రా 17.5–5–44–3, జైస్వాల్ 1–0–3–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఫిలిప్ (బి) వారికెన్ 8; రాహుల్ (బ్యాటింగ్) 25; సాయి సుదర్శన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 63. వికెట్ల పతనం: 1–9. బౌలింగ్: సీల్స్ 3–0–14–0, వారికెన్ 7–1–15–1, పియర్ 6–0–24–0, చేజ్ 2–0–10–0. -
IND VS WI: విండీస్ బ్యాటర్ల అనూహ్య ప్రతిఘటన.. ఫలితం చివరి రోజే..!
న్యూఢిల్లీ టెస్ట్‌లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్‌ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్‌ను ఉంచారు.క్యాంప్‌బెల్, హోప్ వీరోచిత శతకాలుతొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్‌కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
న్యూఢిల్లీ టెస్ట్‌లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు. తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..! -
IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు జాన్ క్యాంప్‌బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) ఓ అరుదైన ఘనత సాధించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఈ ఇద్దరూ.. 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు.1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. 51 ఏళ్ల తర్వాత క్యాంప్‌బెల్, హోప్ ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు.ఓవరాల్‌గా చూసిన భారత గడ్డపై (భారత్‌పై) ఓ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు విండీస్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారే. 1974కు ముందు 1948-49లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌటై, ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలవుతుందని అంతా అనుకున్నారు.అయితే క్యాంప్‌బెల్ (115), హోప్ (103) సూపర్ సెంచరీలతో అసమానమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 187 పరుగులు జోడించి, టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగేలా చేశారు.నాలుగో రోజు టీ సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 ఆధిక్యంలో ఉంది. జస్టిన్ గ్రీవ్స్ (35), జేడన్ సీల్స్ (18) టీమిండియా బౌలర్ల సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కుల్దీప్ 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇన్నింగ్స్‌లో విండీస్, కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. -
IND vs WI 2nd Test: మనదే పైచేయి
కుల్దీప్, జడేజాలు తిప్పేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగుల్లోపే ఆలౌటైన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటిస్తోంది. గత టెస్టులో వన్డే ఓవర్ల కోటా (50)ను ఆడలేకపోయిన కరీబియన్ బ్యాటర్లు ఆశ్చర్యకరంగా ఫిరోజ్‌షా కోట్లా స్పిన్ ట్రాక్‌పై పోరాటం కనబరుస్తున్నారు. దీంతో భారత జట్టు క్లీన్‌స్వీప్ ఆలస్యమవుతోంది. నాలుగో రోజుకు చేరిన ఈ టెస్టు ఫలితానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉండగా... ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి విండీస్ 97 పరుగులు చేయాల్సి ఉంది.న్యూఢిల్లీ: పడేశారు... కానీ పడగొట్టాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో కూల్చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్లు మన స్పిన్ ట్రాక్‌పై... మన స్పిన్నర్లకు సవాలు విసురుతున్నారు. దీంతో ఈ సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం కోసం నాలుగో రోజూ కూడా భారత బౌలర్లు శ్రమించాల్సిన అవసరం వచ్చింది. మూడో రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. ఖరి పియర్ (23; 3 ఫోర్లు), ఫిలిప్ (24 నాటౌట్; 2 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ (87 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (66 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా రాణించారు. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు. కుల్దీప్ ఉచ్చులో పడి... ఓవర్‌నైట్ స్కోరు 140/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్‌ను ఆరంభంలోనే కుల్దీప్ దెబ్బకొట్టాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు షై హోప్ (36; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (21; 3 ఫోర్లు)లను తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీని నుంచి తేరుకోకముందే గ్రీవెస్ (17; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లో సిరాజ్... వారికెన్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 35 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు విండీస్ స్కోరు 175/8 కావడంతో ఇక లాంఛనమే మిగిలుందనిపించింది. కానీ పియర్, ఫిలిప్, సీల్స్ (13; 3 ఫోర్లు) దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్ (81.5 ఓవర్లలో); వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (బ్యాటింగ్) 87; తేజ్ చందర్‌పాల్ (సి) గిల్ (బి) సిరాజ్ 10; అతనేజ్ (బి) సుందర్ 7; షై హోప్ (బ్యాటింగ్) 66; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–17, 2–35. బౌలింగ్: సిరాజ్ 6–2–10–1, జడేజా 14–3–52–0, సుందర్ 13–3–44–1, కుల్దీప్ 11–0–53–0, బుమ్రా 4–2–9–0, జైస్వాల్ 1–0–3–0. -
జైస్వాల్‌తో ఓవరాక్షన్.. విండీస్ ప్లేయర్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ టెస్ట్‌లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ ప్యాడ్స్‌పై బలంగా తాకింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతో పాటు అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్ సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.సీల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్ తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్ పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్‌కు వివరించాడు. రనౌట్ చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్ వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది. జైస్వాల్ అప్పటికే క్రీజ్‌లో ఉన్నా సీల్స్ అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి ఓ డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్ పాయింట్. ఈ మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్‌బెల్ (87), షాయ్ హోప్ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్‌కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
భారత్‌తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్‌బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్‌బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్ చంద్రపాల్‌ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్‌బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్‌కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
'శుబ్' శతకం
అనుకున్నట్లే రెండో రోజూ భారత్ జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో కరీబియన్లను కష్టాల్లోకి నెట్టేసింది. మొదట కెప్టెన్ శుబ్‌మన్ గిల్ శతకంతో భారీ స్కోరులో భాగమయ్యాడు. 500 పైచిలుకు స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్... బౌలింగ్‌తోనూ అదరగొట్టింది. రెండో రోజే స్పిన్ తిరగడంతో భారత కెప్టెన్ గిల్... జడేజా, కుల్దీప్లతో అనుకున్న ఫలితాలు సాధించాడు.న్యూఢిల్లీ: ఈ రెండో టెస్టును కూడా ముందే ముగించేందుకు భారత్ సిద్ధమైంది. రెండో రోజు ఆటలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్‌లు కరీబియన్ బౌలర్లపై సులువుగా పరుగులు రాబట్టారు. తర్వాత రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు స్పిన్ ఉచ్చును బిగించారు. తద్వారా క్లీన్‌స్వీప్‌నకు రాచబాట వేశారు. కెప్టెన్ గిల్ (196 బంతుల్లో 129 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అలిక్ అతనేజ్ (84 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కొన్నాడు. జడేజా 3 వికెట్లు తీశాడు. జైస్వాల్ రనౌట్డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం తన క్రితం రోజు స్కోరుకు 2 పరుగులే జతచేసి రనౌటయ్యాడు. దీంతో శనివారం 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి గిల్ పరుగుకు ఉపక్రమించి వెనకడుగు వేయడంతో జైస్వాల్ నిష్క్రమించాల్సి వచ్చింది. నిరాశకు లోనైన యశస్వి తలకొట్టుకొని అసహనంగా క్రీజు వీడాడు. తర్వాత గిల్‌కు జతయిన నితీశ్ వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా పరుగులు సాధించాడు. శుబ్‌మన్ అర్ధసెంచరీని పూర్తిచేసుకోగా... జట్టు స్కోరు తొలిసెషన్‌లోనే 400 పరుగులు దాటింది. క్రీజులో పాతుకుపోయిన నితీశ్‌ను లంచ్ విరామానికి ముందు వారికెన్ అవుట్ చేశాడు. క్రీజులోకి ధ్రువ్ జురేల్ రాగా 427/4 స్కోరు వద్ద తొలిసెషన్ ముగిసింది. శతక్కొట్టిన సారథిరెండో సెషన్లో పూర్తిగా భారత బ్యాటర్ల జోరే కొనసాగింది. జురేల్ అండతో గిల్ టెస్టుల్లో పదో సెంచరీ సాధించాడు. అడపాదడపా బౌండరీతతో పరుగులు సాధించడంతో భారత్ స్కోరు సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 500 పరుగుల్ని దాటింది. ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించాక జురేల్‌ను చేజ్ అవుట్ చేయడంతోనే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆదిలోనే క్యాంప్‌బెల్ (10) వికెట్‌ను కోల్పోయినా... చాలాసేపు పోరాడింది. తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), అతనేజ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 87 వద్ద తేజ్‌ను జడేజా అవుట్ చేశాకే భారత్‌కు పట్టు దొరికింది. పరుగు తేడాతో అతనేజ్, చేజ్ (0) వికెట్లను స్పిన్నర్లు పడగొట్టేశారు. షై హోప్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (14 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.స్కోరు వివరాలుభారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ రనౌట్ 175; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్‌మన్ (నాటౌట్) 129; నితీశ్ రెడ్డి (సి) సీల్స్ (బి) వారికెన్ 43; జురేల్ (బి) చేజ్ 44; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (134.2 ఓవర్లలో) 518/5 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–58, 2–251, 3–325, 4–416, 5–518. బౌలింగ్: సీల్స్ 22–2–88–0, ఫిలిప్ 17–2–71–0, గ్రీవెస్ 14–1–58–0, పియర్ 30–2–120–0, వారికెన్ 34–6–98–3, చేజ్ 17.2–0–83–1.వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 10; తేజ్ (సి) రాహుల్ (బి) జడేజా 34; అతనేజ్ (సి) జడేజా (బి) కుల్దీప్ 41; షై హోప్ (బ్యాటింగ్) 31; చేజ్ (సి) అండ్ (బి) జడేజా 0; ఇమ్లాచ్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 140. వికెట్ల పతనం: 1–21, 2–87, 3–106, 4–107. బౌలింగ్: బుమ్రా 6–3–18–0, సిరాజ్ 4–0–9–0, జడేజా 14–3–37–3, కుల్దీప్ 12–3–45–1, సుందర్ 7–1–23–0. -
జైస్వాల్ కదంతొక్కడంతో...
రెండో టెస్టు తొలిరోజే... ఓపెనర్ యశస్వి జైస్వాల్ దృష్టి ద్విశతకంపై పడితే, భారత జట్టు అడుగులు క్లీన్‌స్వీప్‌పై పడ్డాయి. ఓవర్లు పడుతున్నా... బౌలర్లు అదేపనిగా మారినా... సెషన్లు పూర్తయినా... భారత బ్యాటర్ల ఆట మాత్రం మారనేలేదు. నిలకడగానే కొనసాగింది. జైస్వాల్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. ఇద్దరు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా చివరి టెస్టు మొదలైన రోజే అలవోకగా 300 పైచిలుకు పరుగుల్ని సాధించింది. న్యూఢిల్లీ: తొలిటెస్టులో మూడు పదుల స్కోరుతో సరిపెట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. సాయి సుదర్శన్‌తో చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జైస్వాల్ అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. అతని జోరు రెండో రోజు కొనసాగినా, లేదంటే సహచరుల్లో ఒకరిద్దరు రాణించినా టీమిండియా ఈ టెస్టులోనూ ఇన్నింగ్స్ విజయానికి అవసరమైన స్కోరును అవలీలగా చేస్తుంది. ఇదే జరిగితే 1–0 ఆధిక్యంతో శుక్రవారం మొదలైన ఆఖరి టెస్టు చివరకు 2–0తో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయడం ఈ రోజే దాదాపు ఖాయమవుతుంది! ఏడు సార్లు టాస్కు వెళ్లిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో... తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (253 బంతుల్లో 173 బ్యాటింగ్; 22 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... సాయి సుదర్శన్ (165 బంతుల్లో 87; 12 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లు విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికెన్ ఖాతాలో చేరాయి. శుభారంభంతో... బ్యాటింగ్ మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనింగ్ వికెట్‌కు 58 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. క్రీజులో ఉన్నంత సేపు కాస్త దూకుడు ప్రదర్శించిన రాహుల్ అలాగే ఆడేందుకు యత్నించి వారికెన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో తొలి సెషన్లో జైస్వాల్‌కు సాయి సుదర్శన్ జతయ్యాడు. గత టెస్టులో విఫలమైన సుదర్శన్ తాపీగా ఆడుతూ జైస్వాల్‌కు అండగా నిలిచాడు. దీంతో కరీబియన్ బౌలర్లకు ఈ సెషన్లో మరో సాఫల్యం సాధ్యమవలేదు. 94/1 వద్ద భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ 100 పరుగులు దాటగా, యశస్వి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనితోపాటు సుదర్శన్ కూడా క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌కు పరుగులు, కరీబియన్‌కు కష్టాలు తప్పలేదు. సగటున ఓవర్‌కు 3.5 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు రావడంతో 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 150 దాటగా... కాసేపటికే సాయి సుదర్శన్ 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. భాగస్వామ్యం బలపడటంతో ఈ సెషన్లో వెస్టిండీస్‌కు వికెట్ భాగ్యమే కరువైంది. జైస్వాల్ 145 బంతుల్లో టెస్టుల్లో ఏడో శతకాన్ని పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. రెండో సెషన్ 220/1 స్కోరు వద్ద ముగిసింది. ఆఖరి సెషన్లోనూ జోరు... ఓపెనర్ జైస్వాల్, సుదర్శన్ ఇద్దరు పరుగులు చక్కబెడుతూ స్కోరు బోర్డును సాఫీగా లాగిస్తుండగా ఎట్టకేలకు ఈ సెషన్లో వెస్టిండీస్ శిబిరానికి కాస్త ఊరటగా ఒక వికెట్ దక్కింది. సెంచరీ దిశగా పరుగు పెడుతున్న సాయి సుదర్శన్‌ను వారికెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జైస్వాల్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (68 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) జతయ్యాడు. ఈ జోడీ కూడా పాతుకుపోయిందే తప్ప ఏ దశలోనూ పడిపోలేదు. 82 ఓవర్లయ్యాక కొత్తబంతి తీసుకున్నారు. కానీ ఓపెనర్ యశస్వి, కెప్టెన్ శుబ్‌మన్ ఆ బంతి ప్రయోజనాన్ని ఇవ్వకుండా క్రీజ్‌ను అట్టిపెట్టుకొని పరుగులు సాధించారు. యశస్వి 150 పరుగులు పూర్తి చేసుకొని డబుల్ సెంచరీపై కన్నేశాడు. ప్రత్యర్థి జట్టు రోజంతా కలిపి రెండే వికెట్లు తీసినా... మూడు సెషన్లలో 90 ఓవర్ల కోటా పూర్తి చేసిన విండీస్ బౌలర్లు ఒక్క వైడ్ గానీ, నోబాల్ గానీ వేయలేదు. దీంతో ఎక్స్‌ట్రాల రూపంలో భారత్‌కు ఒక్క పరుగైనా రాలేదు. స్కోరు బోర్డులో ఉన్న 318 పరుగులు బ్యాటర్లు బాదినవే! తొలిరోజు ఆట ముగిసే సరికి జైస్వాల్, గిల్ అజేయంగా నిలిచారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బ్యాటింగ్) 173; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 318. వికెట్ల పతనం: 1–58, 2–251. బౌలింగ్: సీల్స్ 16–1–59–0, ఫిలిప్ 13–2–44–0, గ్రీవెస్ 8–1–26–0, పియర్ 20–1–74–0, వారికెన్ 20–3–60–2, రోస్టన్ చేజ్ 13–0–55–0. -
విండీస్‌తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా భారత్
న్యూఢిల్లీ: తొలిటెస్టును మూడే రోజుల్లో ముగించిన భారత జట్టు ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే చివరి టెస్టులో ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండుసార్లు ఫైనలిస్టుగా నిలిచిన భారత్... ప్రస్తుత ప్రత్యర్థి కరీబియన్ కంటే ఎన్నో రెట్టు మెరుగ్గావుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లతో పాటు సొంతగడ్డ అనుకూలతలు కూడా టీమిండియాను అజేయంగా నిలుపుతున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజా శతకాల మోత మోగించారు. ఇక జట్టులో ఎవరైనా నిరూపించుకోవాలి అంటే అది సాయి సుదర్శన్ ఒక్కడే! గత మ్యాచ్‌లో అతను సింగిల్ (7) డిజిట్‌కే వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాటర్లకు అచ్చొచ్చే ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో అతను ఫామ్‌లోకి రావాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో స్టార్ సీమర్లు బుమ్రా, సిరాజ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అందరూ ఫామ్‌లో ఉన్నారు. తొలిటెస్టులో భారత బౌలింగ్ దళం ప్రత్యర్థిని రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక రోజు ఓవర్ల కోటా (90 ఓవర్లు)నైనా పూర్తిగా ఆడనివ్వకుండా ఆలౌట్ చేసింది. ఇలాంటి పటిష్టమైన జట్టుపై కరీబియన్ గెలవడమైతే అసాధ్యం. అయితే ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేది ఇక్కడ ఆసక్తికరం.ఢిల్లీ గతమిది...సంప్రదాయ టెస్టుల్లో భారత్‌కు బాగా కలిసొచ్చే వేదిక ఏదైన ఉందంటే అది ఢిల్లీనే. 38 ఏళ్లుగా ఇక్కడ టీమిండియాకు ఓటమంటేనే తెలీదు. చివరిగా 1987లో అదికూడా విండీస్ చేతిలోనే ఓడిన భారత్ తర్వాత 24మ్యాచ్‌లాడినా... ఇందులో ఏ ఒక్క టెస్టులోనూ ఓడలేదు. 12 టెస్టుల్లో గెలిచిన భారత జట్టు, మరో 12 మ్యాచ్‌ల్ని డ్రాగా ముగించింది.తుది జట్లు (అంచనా)భారత్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, జడేజా, నితీశ్ కుమార్‌రెడ్డి, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.వెస్టిండీస్: రోస్టన్ చేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్, క్యాంప్‌బెల్, అతనేజ్, బ్రాండన్ కింగ్, షైహోప్, గ్రీవెస్, వారికన్, పియర్, జాన్ లేన్/బ్లేడ్స్, సీలెస్.పిచ్–వాతావరణంఢిల్లీ భిన్నమైన వికెట్. తొలి రెండు రోజుల బ్యాటింగ్‌కు స్వర్గధామం. మూడో రోజు గడిచే కొద్ది పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్ రోజుల్లో తేలికపాటి వర్షాలున్నా... మ్యాచ్‌ను పూర్తిగా ప్రభావితం చేసే స్థాయిలో లేవు. -
వెస్టిండీస్ జట్ల ప్రకటన.. మెరుపు వీరుడు ఔట్
త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వేర్వేరు వెస్టిండీస్ (West Indies) జట్లను ఇవాళ (అక్టోబర్ 9) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు షాయ్ హోప్ (Shai Hope) కెప్టెన్‌గా కొనసాగగా.. గాయం కారణంగా మెరుపు వీరుడు ఎవిన్ లూయిస్ (Evin Lewis) ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ప్రస్తుత భారత పర్యటనకు దూరంగా ఉన్న యంగ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మాజీ అండర్-19 కెప్టెన్ అకీమ్ ఆగస్టేకి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అకీమ్ ఇప్పటికే విండీస్ తరఫున 3 టీ20లు ఆడి ప్రతిభ చాటాడు. ఎవిన్ లూయిస్ స్థానాన్ని అకీమ్ భర్తీ చేశాడు.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. అలిక్ అథనాజ్ రెండు ఫార్మాట్లకు ఎంపిక కాగా, రామోన్ సిమ్మండ్స్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. హోల్డర్ టీ20 జట్టుకు మాత్రమే ఎంపిక కాగా.. మోటీ, సీల్స్, షెపర్డ్ రెండు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్నారు.కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన ఈ సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్లు అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటిస్తాయి. ప్రస్తుతం విండీస్ టెస్ట్ జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన విండీస్ టెస్ట్ జట్టు.. రేపటి నుంచి రెండో టెస్ట్ ఆడనుంది.వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, బ్లేడ్స్, కార్టీ, చేజ్, గ్రీవ్స్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పియర్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, చేజ్, హోల్డర్, హోసేన్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పౌవెల్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్, సిమ్మండ్స్షెడ్యూల్:తొలి వన్డే– అక్టోబర్ 18, ఢాకా రెండో వన్డే– అక్టోబర్ 21, ఢాకా మూడో వన్డే– అక్టోబర్ 23, ఢాకా తొలి టీ20– అక్టోబర్ 27, చట్టోగ్రామ్ రెండో టీ20– అక్టోబర్ 29, చట్టోగ్రామ్ మూడో టీ20– అక్టోబర్ 31, చట్టోగ్రామ్ చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన ఆసీస్ ప్లేయర్ -
క్యాన్సర్‌లా మొదలై... పతనమైంది!
న్యూఢిల్లీ: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు మాత్రం క్రికెట్ కూనలకంటే కూడా దిగజారింది. ఇప్పటికీ విశ్వవ్యాప్త లీగ్‌లలో మెరిపిస్తుంది కరీబియన్ క్రికెటర్లే! కానీ సంప్రదాయ క్రికెట్‌నే మాకు పట్టనే పట్టదన్నట్లు పూర్తిగా గాలికొదిలేశారు విండీస్ క్రికెటర్లు. అయితే తమ జట్టు పతనం ఈనాటిది కాదని అదెప్పుడో మొదలైందని వెస్టిండీస్ కోచ్ డారెన్ స్యామీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. భారత పర్యటనకు వచ్చిన విండీస్ తొలి టెస్టును మూడు రోజుల్లోనే ఓడింది. కరీబియన్ క్రికెట్ దీనావస్థపై, జట్టు ప్రదర్శన హీనావస్థపై స్యామీ మాట్లాడుతూ ‘మేం భారత్‌లో చివరిసారి 1983లో టెస్టు సిరీస్ గెలిచాం. అప్పటికీ నేను పుట్టనేలేదు. గత 42 ఏళ్లుగా మళ్లీ ఏనాడూ గెలవనేలేదు. జట్టు ఫలితాల నేపథ్యంలో నేనిప్పుడు విమర్శకుల కంట్లో పడ్డానని నాకు బాగా తెలుసు. అయితే దీన్నుంచి తప్పించుకోవాలని గానీ, వైఫల్యాలపై కప్పిపుచ్చాలని గానీ నాకు లేదు. ఈ వైఫల్యం నేనొచ్చాకే మొదలవ్వలేదు. రెండేళ్ల క్రితం నుంచే లేదు. చాలా ఏళ్ల క్రితమే వెస్టిండీస్ టెస్టు క్రికెట్ పతనం మొదలైంది. చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధిలా మొదలై... క్రమంగా మా విండీస్ క్రికెట్ మొత్తానికి వ్యాపించింది. కేవలం బోర్డులోనో లేదంటే జట్టులోనో కాదు... సర్వత్రా మహమ్మారి విస్తరించింది. మొత్తం క్రికెట్ సిస్టమ్‌లోనే పాతుకుపోయింది. చివరకు పతనానికి చేరింది’ అని అన్నాడు. వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లకు స్యామినే విజయసారథి. ఇతని నేతృత్వంలోనే 2013లో భారత పర్యటనకు వచి్చన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో ఓడింది. ‘మా ఆటగాళ్లంతా తమ చేతుల్లో ఉన్నది... తమ చేతనైనదే చేస్తున్నారు. అంటే ఏది బాగా ఆడగలమో అదే ఆడుతున్నారు. దీనికి విశ్వవ్యాప్త ఫ్రాంచైజీ క్రికెట్ కూడా కారణం’ అని టి20 క్రికెట్‌పై తమ ఆటగాళ్లకున్న మోజును స్యామీ నిజాయితీగా అంగీకరించాడు. అయితే దీనికి కారణం లేకపోలేదని చెప్పాడు. ఇతర దేశాలు, జట్లతో పోల్చుకుంటే వసతులు, ఆధునిక సౌకర్యాలు, సాంకేతికత, నిష్ణాతులైన కోచింగ్ సిబ్బంది మన కంటే మిగతా జట్ల వద్దే ఎక్కువగా ఉంటే ఆ జట్లే మాకంటే మేటిగా ఉంటాయన్నాడు. ఇది బహిరంగ సత్యమన్నాడు. విండీస్ కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందన్నాడు. ఒకప్పుడు వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా ఉన్నప్పుడు ఇప్పటి భారత్‌లా ఏనాడు ఆలోచించలేకపోయిందని, ఎదగలేకపోయిందని స్యామీ విశ్లేషించాడు. ముఖ్యంగా ఆరి్థక కష్టాలు దూరమైతేనే ఎదైనా మొదలవుతుందన్నాడు. చెప్పుకోదగ్గ స్పాన్సర్లు దొరికితేనే జట్టు పరిస్థితి మారుతుందని లారా, చందర్‌పాల్ తదితర దిగ్గజాలు ఇదివరకే పేర్కొన్నారు. -
విండీస్‌తో టెస్టు: టీమిండియా శతకాల మోత
వెస్టిండీస్‌తో విజయ దశమి రోజు మొదలైన తొలి టెస్టులో రెండో రోజే టీమిండియా శాసించే స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ గడ్డపై భారత్‌ను గట్టెక్కించిన హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్... కరీబియన్ జట్టును తొలి రోజే ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఓవర్‌నైట్ బ్యాటర్ లోకేశ్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా శతక్కొట్టడంతో భారత్ ఇప్పటికే భారీ ఆధిక్యం అందుకుంది. ఈ రెండు రోజుల్లోనే విండీస్ జట్టు అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో కుదేలైంది.అహ్మదాబాద్: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుకు టెస్టు సిరీస్ మొదలైన రెండు రోజుల్లోనే టీమిండియా తడాఖా చూపెట్టింది. స్టార్ పేసర్లు సిరాజ్ (4/40), బుమ్రా (3/42) కరీబియన్ బ్యాటర్ల పని పట్టారు. కుల్దీప్, సుందర్‌ల స్పిన్ కూడా వారి పేస్‌కు తోడవడంతో కనీసం వన్డే ఓవర్ల కోటానైనా పర్యాటక జట్టు ఆడలేకపోయింది. తర్వాత భారత బ్యాటర్లు లోకేశ్ రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజాలు మూకుమ్మడిగా విండీస్ బౌలర్లపై చెలరేగారు. భారత్ ఈ రకమైన ఆల్‌రౌండ్ జోరు చూస్తుంటే... మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ముందుగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (48 బంతుల్లో 32; 4 ఫోర్లు) చేసిన 30 పైచిలుకు స్కోరే ఇన్నింగ్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు! కుల్దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (210 బంతుల్లో 125; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (197 బంతుల్లో 100; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (176 బంతుల్లో 104 బ్యాటింగ్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతక్కొట్టారు. రోస్టన్ చేజ్‌కు 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ కూల్చేశాడు మొదటి రోజు గురువారం టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే నాలుగో ఓవర్ నుంచే సిరాజ్ ఓ వైపు, బుమ్రా రెండో వైపు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కరీబియన్ బ్యాటర్లను క్రీజులోనే నిలువనీయలేదు. దీంతో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (0), జాన్ క్యాంప్‌బెల్ (8), అలిక్ అతనేజ్ (12), బ్రాండన్ కింగ్ (13)... ఇలా టాప్–4 బ్యాటర్లను కోల్పోయిన విండీస్ 42/4 స్కోరు వద్దే కష్టాల్లో చిక్కుకుంది. కాసేపు కెప్టెన్ చేజ్ (24; 4 ఫోర్లు), షై హోఫ్ (26; 3 ఫోర్లు) వికెట్ల పతనాన్ని ఆపగలిగారే కానీ... కుల్దీప్ దిగగానే హోప్‌ను అవుట్ చేయడంతో వందలోపే సగం (ఐదు) వికెట్లను కోల్పోయింది. వందయ్యాక చేజ్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. గ్రీవ్స్ చేసిన ఆమాత్రం స్కోరుతో విండీస్ 150 పైచిలుకు స్కోరును కష్టంగా చేయగలిగింది. రాహుల్ శతకం ఓపెనర్లు జైస్వాల్ (36; 7 ఫోర్లు), రాహుల్ చక్కని ఆరంభాన్నిచ్చారు. కానీ తక్కువ వ్యవధిలోనే జైస్వాల్, సాయి సుదర్శన్ (7) అవుటయ్యారు. కెప్టెన్ గిల్ అండతో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా తొలి రోజును 121/2 స్కోరు వద్ద ముగించారు. శుక్రవారం 57 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్ సెంచరీ దిశగా పయనించగా, అర్ధ శతకం పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించాడు. జురేల్ క్రీజులోకి రాగా లంచ్ బ్రేక్‌కు ముందే భారత్ స్కోరు 200 దాటింది. దీంతో పాటే రాహుల్ టెస్టుల్లో 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే తన కుమార్తె ఇవారా కోసం అన్నట్లుగా ఈల వేస్తూ వేడుక చేసుకున్నాడు. మొత్తానికి సొంతగడ్డపై దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ సెంచరీ సాధించాడు. 2016 డిసెంబర్లో సెంచరీ అనంతరం మళ్లీ ఇప్పుడే భారత గడ్డపై రాహుల్ శతకం సాధించాడు. కదంతొక్కిన జురేల్, జడేజా రాహుల్ అవుటయ్యాక జురేల్‌కు జడేజా జత కలిశాడు. వీళ్లిద్దరు క్రీజులో పాతుకొనిపోవడంతో భారత్ స్కోరుతో పాటే విండీస్ కష్టాలు అంతకంతకు పెరిగిపోయాయి. రెండో సెషన్లోనే ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించగా జట్టు స్కోరు 300లకు చేరింది. 162 పరుగులకే ప్రత్యర్థి జట్టు అన్ని వికెట్లను కోల్పోతే... జురేల్, జడేజా ఇద్దరే ఐదో వికెట్‌కు 206 పరుగులు జోడించడం భారత్ భారీస్కోరుకు బాటవేసింది. ఆరో టెస్టులో జురేల్ తొలి అంతర్జాతీయ సెంచరీ ముచ్చట తీర్చుకున్నాడు. అతను అవుటయ్యాక జడేజా శతకం పూర్తయ్యింది. భారత్ ఎదుర్కొన్న 128 ఓవర్లలో 3.5 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. బ్యాటర్లంతా కలిసి 45 బౌండరీలు, 8 సిక్సర్లు బాదారు. ఆట నిలిచే సమయానికి జడేజాతో సుందర్ (9 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు.‘అపోలో’ ఆట మొదలువిండీస్తో తొలి టెస్టులో భారత జట్టు కొత్త స్పాన్సర్ ‘అపోలో టైర్స్’ లోగో ఉన్న జెర్సీతో బరిలోకి దిగింది. ప్రధాన స్పాన్సరర్‌గా బీసీసీఐకి మూడేళ్ల కాలానికి అపోలో రూ. 579 కోట్లతో ఒప్పందం చేసుకుంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) జురేల్ (బి) బుమ్రా 8; తేజ్ నారాయణ్ (సి) జురేల్ (బి) సిరాజ్ 0; అతనేజ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12; కింగ్ (బి) సిరాజ్ 13; చేజ్ (సి) జురేల్ (బి) సిరాజ్ 24; షై హోప్ (బి) కుల్దీప్ 26; గ్రీవెస్ (బి) బుమ్రా 32; పియర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 11; వేరికన్ (సి) జురేల్ (బి) కుల్దీప్ 8; జాన్ లేన్ (బి) బుమ్రా 1; సీలెస్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–39, 4–42, 5–90, 6–105, 7–144, 8–150, 9–153, 10–162. బౌలింగ్: బుమ్రా 14–3–42–3, సిరాజ్ 14–3–40–4, నితీశ్ 4–1–16–0, రవీంద్ర జడేజా 3–0–15–0, కుల్దీప్ యాదవ్ 6.1–0–25–2, సుందర్ 3–0–9–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షై హోప్ (బి) సీలెస్ 36; రాహుల్ (సి) గ్రీవెస్ (బి) వేరికన్ 100; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చేజ్ 7; గిల్ (సి) గ్రీవెస్ (బి) చేజ్ 50; ధ్రువ్ జురేల్ (సి) షై హోప్ (బి) పియర్ 125; జడేజా బ్యాటింగ్ 104; సుందర్ బ్యాటింగ్ 9; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (128 ఓవర్లలో 5 వికెట్లకు) 448. వికెట్ల పతనం: 1–68, 2–90, 3–188, 4–218, 5–424. బౌలింగ్: సీలెస్ 19–2–53–1, జాన్ లేన్ 15–0–38–0, జస్టిన్ గ్రీవెస్ 12–4–59–0, జొమెల్ వేరికన్ 29–5–102–1, పియర్ 29–1–91–1, రోస్టన్ చేజ్ 24–3–90–2. -
చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్‌మన్ గిల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్ -
చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది.సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
విండీస్‌తో తొలి టెస్టుకు భారత్ సై..
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్‌పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్‌పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్‌తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. అదనపు పేసర్‌తో... సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్‌లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్‌కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్‌పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్‌ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్కు అవకాశం ఉంటుంది. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్‌పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్‌లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు. అందరూ అంతంతే! ‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్‌ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్‌లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్‌కు బాగా తెలుసు. 1994లో భారత్‌ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది. 2018లో ఆడిన సిరీస్‌లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్‌లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది. పిచ్, వాతావరణం పిచ్‌పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్‌కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్‌పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్. -
పరువు కాపాడుకున్న విండీస్.. కంటితుడుపు విజయం
పసికూన నేపాల్ (Nepal) చేతిలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌కు (West Indies) కంటితుడుపు విజయం దక్కింది. మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకొని పరువు కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన విండీస్.. నేపాల్‌ను 19.5 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూల్చింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రామన్ సిమ్మండ్స్ (3-0-15-4) నేపాల్ పతనాన్ని శాశించాడు. జేడియా బ్లేడ్స్ (3.5-0-20-2), కెప్టెన్ అకీల్ హోసేన్ (4-0-26-1), జేసన్ హోల్డర్ (3-0-19-1) తలో చేయి వేశారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (39) టాప్ స్కోరర్ కాగా.. కుషాల్ మల్లా (12), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (17), గుల్సన్ షా (10), సందీప్ జోరా (14) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్లే స్కోర్ మొత్తాన్ని కొట్టేశారు. ఆమిర్ జాంగూ 74, అకీమ్ అగస్టీ 41 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో నేపాల్ విండీస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఐసీసీ అసోసియేట్ దేశమైన నేపాల్ ఫుల్ టైమ్ మెంబర్ అయిన విండీస్‌ను చిత్తు చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది.విండీస్ జట్టు రేపటి నుంచి భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) ఆడనుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్ 2) ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.విండీస్ సిరీస్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 29) రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (68 నాటౌట్), సందీప్ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, కైల్ మేయర్స్ తలో 2, జెడియా బ్లేడ్స్ ఓ వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్ ఆదిల్ ఆలం (4-0-24-3), కుషాల్ భుర్టెల్ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్ ఎయిరీ (3-0-4-1), లలిత్ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్ జట్టుకు (నేపాల్) ఫుల్ మెంబర్ జట్టుపై (వెస్టిండీస్) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్ చేసిన 83 పరుగుల స్కోర్, ఓ అసోసియేట్ జట్టుపై ఓ ఫుల్ మెంబర్ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగనుంది. చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం -
భారత్‌తో సిరీస్‌కు ముందు విండీస్ మరో బిగ్ షాక్
అక్టోబర్ 2 నుంచి భారత్‌తో ప్రారంభంకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే యువ స్పీడ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) (గాయం) సేవలను కోల్పోయిన విండీస్.. తాజాగా వారి ప్రధాన పేసర్ అల్జరీ జోసఫ్‌ను (Alzarri Joseph) కూడా మిస్ అయ్యింది. అల్జరీ వెన్నెముక సమస్య కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అల్జరీ స్థానాన్ని జెడియా బ్లేడ్స్‌తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత అల్జరీ స్థానంలో జేసన్ హోల్డర్‌తో భర్తీ చేయాలని విండీస్ బోర్డు భావించినప్పటికీ.. అతను నో చెప్పినట్లు తెలుస్తుంది. హోల్డర్ ముందుగానే ఓ మెడికల్ ప్రొసీజర్‌ను ప్లాన్ చేసుకున్నందున భారతతో సిరీస్ ఆడలేనని చెప్పినట్లు సమాచారం.అంతకుముందు షమార్ జోసఫ్ స్థానాన్ని విండీస్ బోర్డు 22 ఏళ్ల బార్బడోస్ ఆల్‌రౌండర్ జోహాన్ లేన్‌తో (Johann Layne) భర్తీ చేసింది.కాగా, ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్‌లోనే భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
వెస్ట్ ఇండీస్ టూర్ కోసం టీమిండియా స్క్వాడ్
-
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ
అక్టోబర్ 2 నుంచి భారత్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ స్పీడ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో 22 ఏళ్ల బార్బడోస్ ఆల్‌రౌండర్ జోహాన్ లేన్‌ను (Johann Layne) ఎంపిక చేశారు విండీస్ సెలెక్టర్లు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జోసఫ్ గాయం వివరాలు వెల్లడించనప్పటికీ.. అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు అతని పేరు మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.26 ఏళ్ల షమార్ జోసఫ్ ఇటీవలికాలంలో విండీస్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2024లో టెస్ట్ అరంగేట్రం చేసి, ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. షమార్ యార్కర్లు, బౌన్సర్లు, అనూహ్య లైన్ అండ్ లెంగ్త్ అతన్ని ఒక్కసారిగా స్టార్‌గా మార్చాయి. అతని అరంగేట్రం బౌలింగ్ స్పెల్‌ను "ఫైర్ అండ్ ఫోకస్" అని విశ్లేషకులు అభివర్ణించారు.షమార్ ఇప్పటివరకు విండీస్ తరఫున 11 టెస్ట్‌లు, 6 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 70 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో షమార్ పేరిట 4 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.షమార్ స్థానంలో భారత పర్యటనకు ఎంపికైన జోహాన్ లేన్ విషయానికొస్తే.. లేన్ బార్బడోస్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 32 ఇన్నింగ్స్‌లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 495 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 66 వికెట్లు తీశాడు. ప్రస్తుతం లేన్ బౌలింగ్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్ సెలెక్టర్లు అతన్ని భారత పర్యటనకు ఎంపిక చేశారు. చదవండి: Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు -
కరుణ్ నాయర్‌పై వేటు
దుబాయ్: ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులకే పరిమితమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా... స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండనున్నాడు. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా అక్టోబర్ 2 నుంచి టీమిండియా... వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... అంతా ఊహించినట్లే జట్టు ఎంపిక సాగింది. దేశవాళీల్లో రాణించి ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించి దేవదత్ పడిక్కల్‌కు అవకాశమిచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో 9 ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ నాయర్ ఒక్క అర్ధశతకం మాత్రమే చేసి నిరాశ పరిచాడు. రెగ్యులర్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్ ఓపెనర్, బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ను ఇక ఎంపిక చేయబోమని సెలెక్టర్లు సంకేతాలు పంపారు. గత మూడు నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పయనిస్తున్న ఓపెనర్ ఈశ్వరన్‌కు ఇక అవకాశాలు రావడం కష్టమే అని అగార్కర్ వెల్లడించాడు. వచ్చే ఏడాది కాలంలో భారత జట్టు విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు ఆడేది లేదు. స్వదేశంలో మ్యాచ్‌లకు ఓపెనర్లతో పాటు రిజర్వ్‌గా నారాయణ్ జగదీశన్ అందుబాటులో ఉన్నాడు. దీనిపై అగార్కర్ మాట్లాడుతూ... ‘సాధారణంగా విదేశీ పర్యటనలకు 16, 17 మందితో జట్టును ఎంపిక చేస్తారు. అలాంటి సమయంలో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చక్కగా ఆడుతున్నారు. ఈ సమయంలో మూడో ఓపెనర్‌గా ఈశ్వరన్‌ను తీసుకొని అతడిని బెంచ్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ వరకు పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని అగార్కర్ తెలిపాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కరుణ్ నాయర్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం. కానీ అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. పడిక్కల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. పోటీలో అతడు ముందున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌లకు ఇదే జట్టు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడని బుమ్రాకు ఆ తర్వాత కూడా తగినంత విశ్రాంతి లభించింది. దీంతో అతడు రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. –అజిత్ అగార్కర్, చీఫ్ సెలెక్టర్ -
చరిత్ర సృష్టించిన కీరన్ పోలార్డ్.. ప్రపంచంలో తొలి ఆటగాడు
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో 400 క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన అనంతరం పోలార్డ్ టీ20 క్యాచ్‌ల సంఖ్య 401కి (720 మ్యాచ్‌ల్లో) చేరింది.ప్రపంచంలో ఏ వికెట్‌కీపర్ కానీ, ఫీల్డర్ కానీ ఇన్ని క్యాచ్‌లు పట్టలేదు. ఈ రికార్డుకు సంబంధించి పోలార్డ్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. 321 క్యాచ్‌లతో డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో ఉన్నాడు.విండీస్ తరఫున అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్, సీపీఎల్ తదితర టీ20 లీగ్‌ల్లో కలిపి పోలార్డ్ ఈ అరుదైన ఘనత సాధించాడు. పోలీ ఈ ఫీట్‌ను సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయం సాధించి, ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ అమెజాన్ వారియర్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగా.. నైట్‌రైడర్స్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి వారియర్స్‌ను దెబ్బకొట్టిన పోలార్డ్.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ఆడి నైట్‌రైడర్స్ గెలుపును ఖరారు చేశాడు.ఈ ఎడిషన్ ఆధ్యాంతం ఇదే ప్రదర్శనలతో చెలరేగినందుకు గానూ పోలార్డ్కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ ఎడిషన్‌తో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 383 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో ఇన్ని సిక్సర్లు ఎవరూ బాదలేదు.నైట్‌రైడర్స్ గెలుపుతో పోలార్డ్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ (18) గెలిచిన ఆటగాడిగా సహచరుడు డ్వేన్ బ్రావో (17) రికార్డును అధిగమించాడు. టైటిల్ గెలిచిన నైట్‌రైడర్స్‌కు బ్రావో కోచ్ కావడం విశేషం. చదవండి: అశ్విన్‌కు జాక్‌పాట్.. ఎవరికీ దక్కని ధర..! -
8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్ ఊచకోత
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల వయసులోనూ వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఈ భారీకాయుడు విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ లీగ్ ప్రారంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న పోలీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై) ఉగ్రరూపం ప్రదర్శించాడు.ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. అప్పటివరకు నిదానంగా (13 బంతుల్లో 12 పరుగులు) ఆడిన పోలార్డ్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 8 బంతుల్లో ఏకంగా 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్ మూడో బంతికి మొదలైన పోలీ విధ్వంసకాండ ఆతర్వాతి ఓవర్ అంతా సాగింది.THE FORCE, KIERON POLLARD...!! 🤯🔥 pic.twitter.com/JkOP3RH7p7— Johns. (@CricCrazyJohns) September 1, 2025తొలుత నేవియన్ బిదైసీ బౌలింగ్‌లో 3, 4, 6 బంతులను సిక్సర్లుగా మలిచిన పోలార్డ్.. వాకర్ సలాంఖిల్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయి వరుసగా 3 నుంచి 6 బంతులను స్టేడియం దాటించాడు. మధ్యలో ఒక్క బంతి మినహా పోలార్డ్ వరుసగా తానెదుర్కొన్న 8 బంతుల్లోనే ఏడింటిని (6,6,0,6,6,6,6,6) సిక్సర్లుగా మలిచాడు.ఈ క్రమంలో పోలార్డ్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అతడు పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెక్స్ హేల్స్‌ను (14031) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో క్రిస్ గేల్ (14562) ఒక్కడే పోలార్డ్ (13070) కంటే ముందున్నాడు.పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 29 బంతులు ఎదర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. పోలార్డ్‌తో పాటు పూరన్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.అనంతరం 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ ఆదిలో లక్ష్యం దిశగా సాగినా, ఆతర్వాత తడబడింది. నాథన ఎడ్వర్డ్స్ (3.2-0-30-3), మొహమ్మద్ ఆమిర్ (3.4-0-29-2) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 12 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ గెలుపుతో (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. -
చప్పగా ప్రారంభమైన విండీస్ క్రికెట్ పండగ.. విధ్వంసకర వీరులున్నా మెరుపుల్లేవు..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 15) తెల్లవారు జామున ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగింది. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్‌ను ఝులిపించలేదు. బౌలర్ల ఆధిపత్యం నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్‌పై ఫాల్కన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. వకార్ సలాంఖిల్ (4-0-22-4), నసీం షా (3.1-0-20-2), ఫజల్ హక్ ఫారూకీ (4-0-30-2), కైల్ మేయర్స్ (2-0-12-1) ధాటికి 17.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో కరీమా గోరె (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇతను కూడా రాణించకపోయుంటే ఫాల్కన్స్ 100 పరుగుల లోపే ఆలౌటయ్యేది.ఫాల్కన్స్ జట్టులో రకీమ్ కార్న్‌వాల్, బెవాన్ జాకబ్స్, ఫేబియన్ అలెన్, షకీబ్ అల్ హసన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్ ఝులిపించలేకపోయారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ 15 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పేట్రియాట్స్ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. ఎవిన్ లూయిస్ 25, ఆండ్రీ ఫ్లెచర్ 19, కైల్ మేయర్స్ 15, అలిక్ అధనాజ్ 37 నాటౌట్, జేసన్ హోల్డర్ 18 నాటౌట్ పరుగులు చేశారు. విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సో డకౌటై నిరాశపరిచాడు. ఈ జట్టులో కూడా అందరూ మెరుపు వీరులే ఉన్నా ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫాల్కన్స్ బౌలర్లలో కార్న్‌వాల్ 2, ఘజన్ఫర్, మెక్కాయ్ తలో వికెట్ తీశారు. -
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్‌పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్‌తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్‌లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటంచనుండగా సీల్స్‌పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్‌లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు.రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్‌లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు. -
Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్
ప్రస్తుత వన్డే క్రికెట్లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్‌గా మిగిలిపోయాడు. ఇతగాడు కేవలం 137 ఇన్నింగ్స్‌ల్లో 49.82 సగటుతో 18 సెంచరీలు, 29 అర్ద సెంచరీల సాయంతో 5879 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో ఇంత గొప్ప గణాంకాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి.హాషిమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, ఏబీ డివిలియర్స్ మాత్రమే హోప్ కంటే మెరుగ్గా ఉన్నారు. తాజాగా హోప్ పాక్‌పై విధ్వంసకర శతకం (94 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) బాది మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించాడు. స్వదేశంలో పాక్‌తో జరిగిన మూడో వన్డేలో ఇది జరిగింది.హోప్ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన విండీస్ఈ మ్యాచ్‌లో హోప్ మెరుపు సెంచరీ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ను జేడన్ సీల్స్ బెంబేలెత్తించాడు. 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి, 202 పరుగుల భారీ తేడాతో ఘెర పరాజయంపాలైంది.34 ఏళ్ల తర్వాతఈ గెలుపుతో విండీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్‌పై విండీస్‌కు 34 ఏళ్ల తర్వాత దక్కిన సిరీస్ విజయం ఇది. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో విండీస్ గెలిచాయి.83 బంతుల్లో శతకంసిరీస్ డిసైడర్‌లో హోప్ చెలరేగి ఆడాడు. తొలుత నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న హోప్ ఆతర్వాత అస్సలు ఆగలేదు. హోప్ ధాటికి పాక్ బౌలర్లు చివరి 7 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నారు.సిరీస్ ఆధ్యాంతం అదిరిపోయే ప్రదర్శనలుఈ సిరీస్ ఆధ్యాంతం హోప్ అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. తొలి వన్డేలో 55, రెండో వన్డేలో 32, తాజాగా జరిగిన వన్డేలో అజేయమైన 120 పరుగులు చేసి విండీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో హోప్ కెప్టెన్‌గానూ కీలకంగా వ్యవహరించాడు. బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్‌ను సెట్ చేయడం, రివ్యూలు తీసుకోవడం లాంటి విషయాల్లో పరిణితి ప్రదర్శించాడు.28 పరుగుల తేడాతో ఓడించిన హోప్హోప్కు వన్డేల్లో ఇది 18వ సెంచరీ. ఈ సెంచరీ అతడికి చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. సిరీస్ డిసైడర్‌లో చేసినది కావడం, అందులోనూ జట్టు విజయానికి దోహదపడటం ఈ సెంచరీకి ఉన్న ప్రత్యేకత. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో హోప్ ఒక్కడే (తన 120 పరుగుల స్కోర్‌తో) పాక్‌ను 28 పరుగుల తేడాతో ఓడించాడు.టాప్-3లోకి ఈ సెంచరీతో హోప్ మరో ఘనత కూడా సాధించాడు. విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డెస్మండ్ హేన్స్‌ను (17 సెంచరీలు) వెనక్కు నెట్టి టాప్-3లోకి (మూడో స్థానం) చేరాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (301 మ్యాచ్‌ల్లో 25 సెంచరీలు), బ్రియాన్ లారా (299 మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు) టాప్-2గా ఉన్నారు. -
PAK Vs WI: హోప్ విధ్వంసకర శతకం.. 34 ఏళ్ల తర్వాత పాక్‌పై సిరీస్ గెలిచిన విండీస్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 1991 (34 ఏళ్లు) తర్వాత విండీస్‌కు పాక్‌పై ఇదే తొలి సిరీస్ విజయం. నిన్న జరిగిన సిరీస్ డిసైడర్‌లో విండీస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తొలుత కెప్టెన్ షాయ్ హెప్ విధ్వంసకర శతకంతో.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జేడన్ సీల్స్ సంచలన బౌలింగ్‌తో సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో విండీస్ గెలిచాయి.RAW EMOTIONS BY WEST INDIES PLAYERS...!!! 🥺❤️- The wait of 34 years is over, West Indies has defeated Pakistan in a ODI series. pic.twitter.com/LTukEY5hTi— Johns. (@CricCrazyJohns) August 13, 2025భారతకాలమానం ప్రకారం నిన్న (ఆగస్ట్ 12) రాత్రి మొదలైన మూడో వన్డేలో విండీస్ పాక్‌ను 202 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. షాయ్ హోప్ విధ్వంసకర శతకంతో (94 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విండీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు.అతడికి రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడయ్యాయి. 32 ఓవర్ల వరకు విండీస్ ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. ఆ దశలో వారి స్కోర్ 118/4గా ఉండింది. అయితే ఆతర్వాత హోప్ గేర్ మార్చడం.. ఛేజ్, గ్రీవ్స్ మెరుపులు మెరిపించడంతో విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి 18 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 176 పరుగులు పిండుకుంది.చివరి ఓవర్లలో విండీస్ బ్యాటర్ల వీరంగం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. నసీం షా, హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు.. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను జేడన్ సీల్స్ బెంబేలెత్తించాడు. సీల్స్ 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌటయ్యారు. 30 పరుగులు చేసిన సల్మాన్ అఘా టాప్ స్కోరర్ కాగా.. హసన్ నవాజ్ (13), మొహమ్మద్ నవాజ్ (23 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (9) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. -
Babar Azam: 71 ఇన్నింగ్స్‌లు, 712 రోజులు.. ఎలా భరిస్తున్నార్రా సామీ..!
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆహా, ఓహో అని కీర్తించే వారి మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పని అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అతను సెంచరీ చేసి ఏకంగా 712 రోజులు గడిచింది. ఈ మధ్యలో అతను 71 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేదు. అడపాదడపా అర్ద సెంచరీలు చేసినా అవేవి అతని జట్టుకు అక్కరకు రాలేదు. అతను చివరిసారిగా 2023 ఆగస్ట్‌లో సెంచరీ చేశాడు. అది కూడా పసికూన నేపాల్‌పై. అప్పటి నుంచి రెండేళ్లు గడిచినా బాబార్ నుంచి ఒక్క సెంచరీ లేదు.తాజాగా బాబర్ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డకౌటై సొంత అభిమానులకే మరోసారి టార్గెట్ అయ్యాడు. ఎన్ని అవకాశాలు కావాలి రా బాబూ అంటూ అతని ఓన్ ఫ్యాన్స్ తలలు బాదుకుంటున్నారు. ఒక దశలో బాబర్ ఫ్యాన్స్ అతన్ని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చేవారు. ఇంకా చెప్పాలంటే బాబర్ విరాట్ కంటే చాలా మెరుగైన ఆటగాడని డప్పు కొట్టుకునే వారు. ఇప్పుడిప్పుడే వారి తెలిసొస్తుంది బాబర్ ఎంత ఘనమైన ఆటగాడో అని.బాబర్ వయసు 30లు కూడా దాటకుండానే సుదీర్ఘకాలం ఫామ్ కోల్పోయి కెరీర్‌ను చరమాంకంలోకి తెచ్చుకున్నాడు. కొద్ది కాలంగా అతనికి పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో అవకాశాలు రావడం లేదు. టీ20 ఫార్మాట్లో అతని ఊసే లేదు. వన్డేల్లోనూ అడపాదడపా అవకాశాలే వస్తున్నాయి. టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నా ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూనలు జింబాబ్వే, నేపాల్, ఐర్లాండ్ లాంటి జట్లపై మాత్రమే అతను ప్రతాపం చూపిస్తుంటాడు. అందుకే అతనికి జింబాబర్ అని పేరు కూడా ఉంది.ఇలాంటి జింబాబర్కు విరాట్ కోహ్లితో పోలిక ఏంటని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంత చెత్తగా ఆడుతున్నా అతన్ని ఎలా భరిస్తున్నార్రా బాబూ అంటూ పాక్ అభిమానులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న జట్లు కూడా వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు ఇన్ని అవకాశాలు ఇవ్వవని గుర్తు చేస్తున్నారు. బాబర్ ఇంకాస్త దిగజారక ముందే రిటైర్మెంట్ ప్రకటించడం మర్యాదగా ఉంటుందంటూ సలహా ఇస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా విండీస్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ (31), హసన్ నవాజ్ (36 నాటౌట్) గుడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బాబర్ ఆజమ్ 3 బంతులు ఆడి డకౌటయ్యాడు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్) విండీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది. -
బాబర్ ఆజమ్ డకౌట్.. పాక్‌ను చిత్తు చేసిన విండీస్
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ 31, హసన్ నవాజ్ 36 (నాటౌట్), సైమ్ అయూబ్ 23, అబ్దుల్లా షఫీక్ 26, మొహమ్మద్ రిజ్వాన్ 16, సల్మాన్ అఘా 9, మొహమ్మద్ నవాజ్ 5, షాహీన్ అఫ్రిది 11 (నాటౌట్) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ డకౌటయ్యాడు.విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. జెదియా బ్లేడ్స్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్), షాయ్ హోప్ (32), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్) విండీస్ గెలుపులో తలో చేయి వేశారు. బ్రాండన్ కింగ్ (1), ఎవిన్ లూయిస్ (7), కీసీ కార్టీ (16) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ తలో 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది. -
పాక్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు బిగ్ షాక్
స్వదేశంలో పాకిస్తాన్‌తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 8) ప్రారంభం కాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ మాథ్యూ ఫోర్డ్ నిన్న ట్రైనింగ్ సెషన్ సందర్భంగా గాయపడ్డాడు. అతని భుజం రీలొకేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఫోర్డ్‌కు ప్రత్యామ్నాయంగా విండీస్ క్రికెట్ బోర్డు 21 ఏళ్ల బౌలింగ్ ఆల్‌రౌండర్ జోహన్ లేన్‌కు పిలుపునిచ్చింది. లేన్ ఇటీవల వెస్టిండీస్-ఏ జట్టు తరఫున విశేషంగా రాణించాడు. లేన్ తన స్వల్ప దేశవాలీ కెరీర్లో 12 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 17.71 సగటున 124 పరుగులు చేశాడు. లేన్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.వెస్టిండీస్‌కు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే పాక్‌తో ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో గెలిస్తే ఆ జట్టు వరల్డ్‌కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్‌కు ముందు విండీస్ పాక్‌కు టీ20 సిరీస్ కోల్పోయింది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో గెలుచుకుంది.పాక్‌తో తొలి వన్డే భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో వన్డే ఆగస్ట్ 10, మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనున్నాయి. మూడు వన్డేలు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగనున్నాయి.పాక్‌తో వన్డే సిరీస్‌కు అప్డేట్ చేసిన వెస్టిండీస్ జట్టు:షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, జోహన్ లేన్ -
టిమ్ డేవిడ్‌కు షాక్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 (5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్, జులై 28) సందర్భంగా అతను అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ ఐసీసీ ఆగ్రహించి, అతని మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది.ఆ మ్యాచ్‌లో డేవిడ్ అంపైర్ నిర్ణయం (వైడ్ బాల్ విషయంలో) పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐసీసీ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్ అతను వైడ్‌గా భావించిన బంతిని ఫెయిర్ బాల్‌గా ప్రకటించడంతో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చేతులను చాచి చూపిస్తూ వైడ్‌గా ప్రకటించాలని అంపైర్‌ను ఆదేశించాడు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రవర్తన దురుసుగా ఉందని ఐసీసీ భావించింది. డేవిడ్ క్రీడా స్పూర్తిని మరచి ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతనిని తదుపరి విచారణ నుంచి మినహాయించారు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ 30 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆ సిరీస్‌లో డేవిడ్ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో 37 బంతుల్లో శతక్కొట్టి ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. డేవిడ్ ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతూ కూడా సత్తా చాటాడు. పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. -
చివరి బంతికి ఫోర్ కొట్టి...
ఫ్లోరిడా: చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో పాకిస్తాన్‌పై వెస్టిండీస్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు చేస్తే విజయం సాధించాల్సిన తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లో పేస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఫోర్ కొట్టి విండీస్‌ను గెలిపించాడు. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (23 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), కెప్టెన్ సల్మాన్ ఆఘా (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (7), సాహిబ్జాదా ఫర్హాన్ (3), మొహమ్మద్ హరీస్ (4), మొహమ్మద్ నవాజ్ (2), ఫహీమ్ అష్రఫ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించింది. ఇటీవల సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిన కరీబియన్లు... ఈ సిరీస్‌లో సైతం తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. గుడకేశ్ మోతీ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ షై హోప్ (30 బంతుల్లో 21; 2 ఫోర్లు) కాస్త పోరాడారు. విండీస్ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు విన్నింగ్ రన్స్ చేసిన హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈరోజు తెల్లవారుజామున జరుగుతుంది. -
సెంచరీ కొట్టిన ఆడమ్ జంపా.. నాలుగో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా రికార్డు
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల జంపా పొట్టి ఫార్మాట్లో ఆసీస్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (121), డేవిడ్ వార్నర్ (110), ఆరోన్ ఫించ్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇవాళ (జులై 29) వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 జంపా కెరీర్లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో జంపా ఓ మోస్తరుగా (3-0-20-1) రాణించి ఆసీస్ విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. డ్వార్షుయిస్ (4-0-41-3), నాథన్ ఇల్లిస్ (3.4-0-32-2), ఆరోన్ హార్డీ (4-0-39-1), సీన్ అబాట్ (4-0-30-1), మ్యాక్స్‌వెల్ (1-0-6-1), జంపా (3-0-20-1) ధాటికి 19.4 ఓవరల్లో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రూథర్‌ఫోర్డ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30), మిచెల్ ఓవెన్ (37), ఆరోన్ హార్డీ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో 17 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (7 వికెట్లు కోల్పోయి). విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్ 3, జేసన్ హోల్డర్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు తీశారు.కాగా, ఈ సిరీస్‌కు ముందు విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా భారత్ తర్వాత ఓ పర్యటనలో వరుసగా 8 మ్యాచ్‌లు (3 టెస్ట్‌లు, 5 టీ20లు) గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. భారత్ 2017 శ్రీలంక పర్యటనలో వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. విండీస్‌తో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడంతో ఆసీస్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టెస్ట్ హోదా కలిగిన జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. -
వరుస ఓటములతో చితికిపోయిన విండీస్‌కు మరో షాక్
స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలతో విసిగి వేసారిపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. ఆ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోగా రెండు ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ విండీస్ ఆటగాళ్లందరికీ జరిమానా విధించింది. ఈ జరిమానాను విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ అన్నాడు.నాలుగో టీ20లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 31, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ తలో 28, హోల్డర్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, ఆరోన్ హార్డీ, బార్ట్లెట్, అబాట్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ (47), ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకపడటంతో 19.2 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ 3, హోల్డర్, షెపర్డ్, అకీల్ హొసేన్ తలో వికెట్ తీశారు.కాగా, 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో విండీస్‌కు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20ల్లో ఓటమిపాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 0-4తో సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు టెస్ట్ సిరీస్‌లోనూ విండీస్‌ది ఇదే పరిస్థితి. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను కూడా విండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లలో విండీస్ ఇప్పటివరకు ఒక్క గెలుపుకు కూడా నోచుకోలేదు. -
అఫ్రిది రీఎంట్రీ.. బాబర్ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురు
త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్లను ఇవాళ (జులై 25) ప్రకటించారు. టీ20 జట్టుకు సల్మాన్ అఘా, వన్డే జట్టుకు మహ్మద్ రిజ్వాన్ సారధులుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరోసారి చుక్కెదురైంది. సెలెక్టర్లు బాబర్‌కు వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు.అఫ్రిది రాకతో పాక్ టీ20 జట్టు పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అఫ్రిదికి జతగా అనుభవజ్ఞులైన పేసర్లు హరీస్ రౌఫ్, హసన్ అలీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. మరో పేసర్ నసీం షా వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.బ్యాటింగ్ విభాగంలో సైమ్ అయూబ్, ఫకర్ జమాన్, హసన్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ నవాజ్ జట్టులో చోటు దక్కించుకోగా.. అబ్దుల్లా షఫీక్ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్‌లో సత్తా చాటిన సల్మాన్ మీర్జా, అహ్మద్ దనియాల్‌కు జట్టులో చోటు దక్కలేదు.వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్వెస్టిండీస్తో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, నసీం షా, సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ షెడ్యూల్..జులై 31- తొలి టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 2- రెండో టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 3- మూడో టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 8- తొలి వన్డే (ట్రినిడాడ్)ఆగస్ట్ 10- రెండో వన్డే (ట్రినిడాడ్)ఆగస్ట్ 12- మూడో వన్డే (ట్రినిడాడ్) -
రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 యోధుడు
టీ20 యోధుడు, వెస్టిండీస్ పొట్టి క్రికెట్ దిగ్గజం ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరుగబోయే టీ20 సిరీస్ తనకు చివరిదని వెల్లడించాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోనూ రసెల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. జులై 20, 22 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు రసెల్ స్వస్థలమైన జమైకాలో జరుగనున్నాయి.37 ఏళ్ల రసెల్ వెస్టిండీస్ తరఫున 2010లో అరంగేట్రం చేసి 84 టీ20లు ఆడాడు. ఇందులో 163.1 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 1078 పరుగులు చేశాడు. బౌలర్‌గా 61 వికెట్లు తీశాడు. రసెల్ విండీస్ గెలిచిన రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో (2012, 2016) కీలక సభ్యుడిగా ఉన్నాడు. పొట్టి క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన రసెల్.. ఈ ఫార్మాట్లో 561 మ్యాచ్‌లు ఆడి 168.31 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 33 అర్ద సెంచరీల సాయంతో 9316 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్‌లో 485 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా రసెల్ ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతాడు.దెబ్బ మీద దెబ్బటెస్ట్ క్రికెట్లో, వన్డేల్లో ప్రభ కోల్పోయి అదఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్.. టీ20 ఫార్మాట్లో మాత్రం ఆడపాదడపా మెరుపులు మెరిస్తూ ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విండీస్ ఈ ఫార్మాట్లోనూ కిందికి పడిపోయే అవకాశం ఉంది. ఇటీవలే ఆ జట్టు టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా రసెల్ కూడా అదే బాటలో నడవడంతో టీ20ల్లో విండీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 15 మంది సభ్యుల్లో ఒకరురసెల్ త్వరలో ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల్లో రసెల్ ఒకరు. ఈ సిరీస్ జులై 20, 22, 25, 26, 28 తేదీల్లో జమైకా (తొలి రెండు మ్యాచ్‌లు), సెయింట్ కిట్స్ (ఆఖరి మూడు మ్యాచ్‌లు) వేదికలుగా జరుగనుంది. ఈ సిరీస్‌లో విండీస్ జట్టుకు షాయ్ హోప్ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో హెట్‌మైర్, హోల్డర్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్. -
బీభత్సం సృష్టించిన స్టార్క్.. క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌కు కుప్పకూలిన వెస్టిండీస్
కింగ్స్టన్, జమైకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మూడో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ బీభత్సం సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో విలయతాండవం చేశాడు. స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో స్టార్క్ కేవలం 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే.🚨 MITCHELL STARC: 7.3-4-9-6 🥶🔥- WEST INDIES BOWLED OUT FOR JUST 27 RUNS IN THE SECOND INNINGS....!!!! pic.twitter.com/Z3tFsjJalT— Johns. (@CricCrazyJohns) July 15, 2025ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7.3 ఓవర్లు వేసిన స్టార్క్ కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా వెస్టిండీస్ 204 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే ఘోరంగా కుప్పకూలి 176 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇదే మ్యాచ్‌లో స్టార్క్ మరో ఘనత కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని (402) అధిగమించాడు. పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన స్టార్క్.. పింక్ బాల్‌తో తన గణాంకాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.పింక్ బాల్‌తో మొత్తం 14 టెస్ట్‌లు ఆడిన స్టార్క్ 17.08 సగటున ఐదు 5 వికెట్ల ప్రదర్శనలతో 81 వికెట్లు తీశాడు.ఏడుగురు డకౌట్లుమిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్‌బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్‌వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు (ఓ ఇన్నింగ్స్‌లో)..న్యూజిలాండ్- 26వెస్టిండీస్- 27సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 35 -
AUS Vs WI: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్
జమైకా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కెమరూన్ గ్రీన్ (42), పాట్ కమిన్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, షమార్ జోసఫ్ 2, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 14, సామ్ కొన్‌స్టాస్ 0, స్టీవ్ స్మిత్ 5, ట్రవిస్ హెడ్ 16, బ్యూ వెబ్‌స్టర్ 13, అలెక్స్ క్యారీ 0 పరుగులకు ఔటయ్యారు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన జాన్ క్యాంప్‌బెల్ విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో షాయ్ హోప్ (23), జస్టిన్ గ్రీవ్స్ (18), రోస్టన్ ఛేజ్ (18), బ్రాండన్ కింగ్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఖ్వాజా (23), హెడ్ (20), క్యారీ (21), కమిన్స్ (24) 20ల్లో ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 4, గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో 3 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
నిప్పులు చెరిగినపేసర్లు.. స్వల్ప స్కోర్‌కే ఆలౌటైన ఆస్ట్రేలియా
జమైకా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. ఆ జట్టు పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆసీస్ 225 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసఫ్ 4, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆదిలో సజావుగానే సాగింది. 28 పరుగులకే తొలి వికెట్ (కొన్‌స్టాస్ (17), 68 పరుగులకే రెండో వికెట్ (ఖ్వాజా (23)) కోల్పోయినా.. గ్రీన్ (46), స్మిత్ (48) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే గ్రీన్ ఔటైన తర్వాత ఆసీస్ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హెడ్ (20) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఆండర్సన్ ఫిలిప్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. వెబ్‌స్టర్ 1, అలెక్స్ క్యారీ 21, కమిన్స్ 24, స్టార్క్ 0, బోలాండ్ 5 (నాటౌట్), హాజిల్‌వుడ్ 4 పరుగులు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ కెవియన్ ఆండర్సన్‌ను (3) మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (8), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 209 పరుగులు వెనకుపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఆసీస్ అద్భుత విజయాలు సాధించింది. నామమాత్రంగా సాగుతున్న చివరి మ్యాచ్‌లో తొలి రోజు విండీస్ పైచేయి సాధించడం విశేషం. -
‘రికార్డులు ఉన్నది తిరగరాయడానికే’
జొహన్నెస్‌బర్గ్: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.అయితే అందుకు భిన్నంగా ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు. మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్ ఐదో స్థానానికి చేరాడు. -
విండీస్ ఆటగాడి ఉగ్రరూపం.. 52 బంతుల్లో సుడిగాలి శతకం
మేజర్ లీగ్ క్రికెట్లో వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాటర్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ ఫ్లెచర్ విశ్వరూపం ప్రదర్శించాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో ఇవాళ (జులై 7) జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (58 బంతుల్లో 118; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సునామీ శతకంతో చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఫ్లెచర్‌తో పాటు అలెక్స్ హేల్స్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా విధ్వంసం సృష్టించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూనికార్న్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. సంజయ్ కృష్ణమూర్తి (40 బంతుల్లో 92; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నైట్‌రైడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. అతనికి హస్సన్ ఖాన్ (17 బంతుల్లో 35)చ, హమ్మద్ ఆజమ్ (27 బంతుల్లో 27), జేవియర్ బార్ట్లెట్ (13 బంతుల్లో 27) కూడా తోడవ్వడంతో ఓ దశలో యూనికార్న్స్ సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో యూనికార్న్స్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ చివరి 3 ఓవర్లు అద్భుతంగా వేసి కీలక వికెట్లు తీశారు. ఈ గెలుపు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించిన నైట్‌రైడర్స్‌కు కంటితుడుపుగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో యూనికార్న్స్ మూడో స్థానానికి పరిమితమై ఎంఐ న్యూయార్క్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రీడం చేతిలో ఓడినా సీయాటిల్ ఓర్కాస్‌తో పోటీ పడి (రన్‌రేట్ విషయంలో) నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఎంఐపై గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం టాప్ ప్లేస్‌ను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో వాషింగ్టన్, టెక్సాస్ జట్లు తలపడనున్నాయి.ఐదో శతకం.. ఈ సీజన్లో రెండోదిఈ మ్యాచ్‌లో ఫ్లెచర్ చేసిన సెంచరీ ఈ సీజన్లో అతనికి రెండవది. కొద్ది రోజుల కిందట ఇతను వాషింగ్టన్ ఫ్రీడంపై మెరుపు శతకం (104) బాదాడు. ఓవరాల్‌గా ఫ్లెచర్‌కు ఇది టీ20ల్లో ఐదవ సెంచరీ. ఈ సెంచరీతో ఫ్లెచర్ కొలిన్ మున్రో, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర వీరుల సరసన చేశాడు. వీరంతా టీ20ల్లో తలో 5 సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. -
హోరాహోరీగా సాగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్ క్యారీ (26), పాట్ కమిన్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (71), కెమరూన్ గ్రీన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్ హెడ్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సామ్ కొన్‌స్టాస్ 0, ఉస్మాన్ ఖ్వాజా 2, నాథన్ లియోన్ 8, బ్యూ వెబ్‌స్టర్ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ (40), అల్జరీ జోసఫ్ (27), షమార్ జోసఫ్ (29), షాయ్ హెప్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 16, జస్టిన్ గ్రీవ్స్ 1, ఆండర్సన్ ఫిలిప్ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ చెరో 2, స్టార్క్, వెబ్‌స్టర్, హెడ్ ఒక్కో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్‌స్టర్ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్‌స్టాస్ 25, ఖ్వాజా 16, గ్రీన్ 26, స్టీవ్ స్మిత్ 3, హెడ్ 29, కమిన్స్ 17, స్టార్క్ 6, లియోన్ 11, హాజిల్‌వుడ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, సీల్స్ 2, షమార్ జోసఫ్, ఫిలిప్, గ్రీవ్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ ఇది. తొలి టెస్ట్‌లో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
సుడిగాలి ఇన్నింగ్స్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పోలార్డ్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పోలీ ఇన్నింగ్స్‌లు వింటేజ్ పోలార్డ్‌ను గుర్తు చేస్తున్నాయి. ఎంఎల్సీ 2025లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్.. 186.11 స్ట్రయిక్‌రేట్‌తో 201 పరుగులు చేసి అదరగొట్టాడు.తాజాగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు ఎంఐ న్యూయార్క్ ఓటమిపాలైనా, పోలీ సుడిగాలి ఇన్నింగ్స్ మాత్రం అందరినీ అలరించింది.2022 సీజన్ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిగతా లీగ్‌ల్లో చెలరేగి ఆడుతున్నాడు. స్వదేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పోలార్డ్ దుమ్మురేపుతున్నాడు. పోలార్డ్ ఇటీవలే పొట్టి ఫార్మాట్లో 700 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ పొట్టి ఫార్మాట్లో ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు.ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం పోలార్డ్ ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పోలార్డ్‌కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆటగాడిగా రిటైరైనా అదే ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న అతను.. సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పోలార్డ్ ఐపీఎల్‌తో పాటు అదే ఏడాది (2022) అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.విండీస్ తరఫున123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పోలార్డ్.. 3 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీల సాయంతో 4200 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే తన మీడియం పేస్ బౌలింగ్‌తో 97 వికెట్లు పడగొట్టాడు. 2010లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పోలార్డ్ ఆ ఒక్క ఫ్రాంచైజీ తరఫునే కెరీర్ మొత్తం (189 మ్యాచ్‌లు) ఆడి 16 హాఫ్ సెంచరీల సాయంతో 3412 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 69 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌కు పోలార్డ్ ఎన్నో అపురూప విజయాలనందించాడు.యావత్ పొట్టి క్రికెట్లో 702 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్, 13783 పరుగులు చేసి, 328 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఇప్పటివరకు కనీసం 600 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కూడా లేరు. -
తొలి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్‌కు భారీ షాక్
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్ పాయింట్‌తో పాటు జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూన్ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్ వేదికగా విండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. హోల్డ్‌స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్‌స్టాక్ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్‌స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు.విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో హోల్డ్‌స్టాక్ అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్ అని చూపించినా హోల్డ్‌స్టాక్ ఔట్‌గా ప్రకటించాడు. హోప్, ఛేజ్ ఔట్ కావడం ఈ మ్యాచ్‌లో విండీస్‌పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్‌కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. -
శివాలెత్తిన షిమ్రోన్ హెట్‌మైర్.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించాడు. నిన్న ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్సర్ బాది ఓర్కాస్‌ను గెలిపించిన హెట్‌మైర్.. ఇవాళ (జూన్ 29) లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై కూడా అదే పని (19.5వ ఓవర్) చేశాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రసెల్ (39 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (21 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సైఫ్ బదార్ (21 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో రెండో బంతికే వికెట్ (జోష్ బ్రౌన్ 0) కోల్పోయిన ఓర్కాస్.. షయాన్ జహంగీర్ (31 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్ జోన్స్ (38 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. హెట్‌మైర్ 19వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హెట్‌మైర్.. మేజర్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఎంఎల్‌సీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఎంఐ న్యూయార్క్ ఆటగాడు నికోలస్ పూరన్ పేరట ఉంది. పూరన్ 2023 ఎడిషన్‌లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఓర్కాస్ లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఈ గెలుపుతో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. విండీస్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళలు
స్వదేశంలో (బార్బడోస్) ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న వేల ఓ విండీస్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. గయానీస్ వార్తా సంస్థ కైటూర్ న్యూస్ నివేదిక ప్రకారం.. గతేడాది ఆస్ట్రేలియాలో చారిత్రక విజయాన్నందించిన ఓ యువ ఆటగాడు అత్యాచారం, లైంగిక వేధింపులు సహా అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఓ టీనేజర్ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై వేర్వేరుగా ఆరోపణలు చేశారు. తొలుత గయానాలోని బెర్బిస్‌కు చెందిన ఓ యువతి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటి నుంచి వరుసగా 10 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై ఆరోపణలు చేశారు. క్రికెటర్‌పై లైంగిక ఆరోపణల ఉదంతాన్ని కైటూర్ న్యూస్ 'మాన్స్టర్ ఇన్ మెరూన్' అనే శీర్షికతో ప్రచురించి వెలుగులోకి తెచ్చింది. ఆతర్వాత గయానాలోకి స్పోర్ట్స్ మాక్స్ టీవీ ఈ అంశంపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గయానా మీడియా ప్రకారం.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను కొందరు విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళలు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. క్రికెటర్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ విషయంపై విండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ షాలోను సంప్రదించగా.. తనుకు కానీ, బోర్డుకు కానీ ఈ విషయం గురించి తెలీదని అన్నాడు. ఈ అంశంపై లోతుగా స్పందించేందుకు నిరాకరించాడు.ఇదిలా ఉంటే, బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. 10 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ట్రవిస్ హెడ్ (13), వెబ్‌స్టర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్‌లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్‌స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్‌స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్‌వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్‌వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4, జాన్ క్యాంప్‌బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్‌లో ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. -
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు
ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పర్యాటక వెస్టిండీస్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (జూన్ 15) జరిగిన మూడో టీ20లో విండీస్ 62 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కాగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఓపెనర్లు ఎవిన్ లెవిస్ (44 బంతుల్లో 91; 7 ఫోర్లు, 8 సిక్సర్లు), షాయ్ హోప్ (27 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.లెవిస్, హోప్ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి ఔటయ్యాక, హెట్‌మైర్ (7 బంతుల్లో 15; 3 ఫోర్లు), కీసి కార్టీ (22 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆఖర్లో జేసన్ హోల్డర్ (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో విండీస్ అతి భారీ స్కోర్ చేసింది.ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హంఫ్రేస్ (4-0-16-2) ఒక్కడే విండీస్ బ్యాటర్ల ఊచకోతను తప్పించుకున్నాడు. మిగతా బౌలర్లంతా 12కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. లియామ్ మెక్‌కార్టీకి (4-0-81-0) విండీస్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఫలితంగా అతను ఓ టీ20 ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు గాంబియా బౌలర్ మూసా జోబార్తే (4-0-93-0) పేరిట ఉంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. ఎక్కడా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ రాస్ అడైర్ (48) ఆ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హ్యారీ టెక్టార్ (38), మార్క్ అడైర్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరి తర్వాత అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (23) వచ్చాయి. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్ 3, జేసన్ హోల్డర్ 2, రొమారియో షెపర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. -
ఇంగ్లండ్ బ్యాటర్ల విలయతాండవం.. మూడో టీ20లో భారీ స్కోర్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జూన్ 10) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విలయతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు బెన్ డకెట్ (46 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమీ స్మిత్ (26 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ (10 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ తొలుత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు ఎవిన్ లెవిస్ 9, జాన్సన్ ఛార్లెస్ 9, షాయ్ హోప్ 45 (27 బంతుల్లో), షిమ్రోన్ హెట్‌మైర్ 26 (8 బంతుల్లో), రూథర్‌ఫోర్డ్ 1 పరుగుకు ఔటయ్యాడు. ఈ దశలో పోరాడితే పోయేదేముందున్నట్లు రెచ్చిపోయిన రోవ్‌మన్ పావెల్ 45 బంతుల్లో అజేయమైన 79 పరుగులు చేసి విండీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అతనికి జేసన్ హోల్డర్ (12 బంతుల్లో 25) జత కలిశాడు. అయినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితమైంది. తద్వారా మ్యాచ్ కోల్పోవడమే కాకుండా, క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకోలేకపోయింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా విండీస్ ఇలాంటి పరాజయాలే ఎదుర్కొంది. దీనికి ముందు విండీస్ ఇదే ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 0-3 తేడాతో కోల్పోయింది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌కు ఇది తొలి అసైన్మెంట్. అరంగేట్రంలోనే రెండు సిరీస్‌లకు క్లీన్ స్వీప్ చేసిన బ్రూక్.. కెప్టెన్సీ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. -
షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన సిక్సర్ల వీరుడు
విండీస్ విధ్వంసకర యోధుడు నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వేదికగా వెల్లడించాడు. పూరన్ రిటైర్మెంట్ను విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. కరీబియన్ క్రికెట్‌కు పూరన్ చేసిన సేవలను కొనియాడింది. రిటైర్మెంట్ సందర్భంగా పూరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మెరూన్ జెర్సీలో కరీబియన్ దీవులకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరమని అన్నాడు. క్రికెట్ తనకెంతో ఇచ్చిందని చెప్పాడు. విండీస్ జట్టుకు సారథ్యం వహించిన క్షణాలు నా హృదయానికి దగ్గరగా నిలిచిపోతాయని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ముగిసినా విండీస్ క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తరగదని తెలిపాడు.2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పూరన్.. విండీస్ తరఫున 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన పూరన్ ఈ ఫార్మాట్లో 136.4 స్ట్రయిక్‌రేట్‌తో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2275 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1983 పరుగులు చేశాడు. పూరన్ సుదీర్ఘ ఫార్మాట్లో (టెస్ట్‌ల్లో) ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పూరన్ రిటైర్మెంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇప్పుడిప్పుడే తిరోగమనం చేస్తున్న విండీస్‌కు తీరని లోటు.పూరన్ 2022లో విండీస్ కెప్టెన్‌గానూ సేవలందించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో 30 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసి కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే తన జట్టును గెలిపించుకోగలిగాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్‌కప్‌లో విండీస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టడంతో పూరన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.పూరన్ గతేడాది నుంచి టీ20ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు (170) బాదిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ అత్యధిక సిక్సర్ల (40) రికార్డును దక్కించుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో 500 పరుగుల మార్కును (లక్నో సూపర్ జెయింట్స్ తరఫున) దాటిన పూరన్.. ఐపీఎల్లో తొలిసారి ఈ ఘనత సాధించాడు.పూరన్‌ను ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతనే స్వయంగా విశ్రాంతి కావాలని విండీస్ బోర్డును కోరాడు. పూరన్ విండీస్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. 2019లో వన్డే అరంగేట్రం చేసిన పూరన్.. విండీస్ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయినప్పటి నుంచి ఆ ఫార్మాట్‌ను వదిలేశాడు. పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా లీగ్ క్రికెట్లో కొనసాగుతాడు. -
ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
బ్రిస్టల్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు... వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ షై హోప్ (38 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ల్యూక్ వుడ్ 2 వికెట్లు తీయగా... బ్రైడన్ కార్స్, జేకబ్ బెథెల్, ఆదిల్ రషీద్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెథెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. విండీస్ బ్యాటర్ల బీభత్సం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఆదిలో నిదానంగా ఆడినా, ఇన్నింగ్స్ చివర్లో చెలరేగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ROMARIO SHEPHERD AND HOLDER SMASHED 5 SIXES IN AN OVER. 🤯pic.twitter.com/8Q31AAMvrH— Mufaddal Vohra (@mufaddal_vohra) June 8, 202516 ఓవర్లలో తర్వాత 121/4గా ఉండిన విండీస్ స్కోర్.. చివరి 4 ఓవర్లలో రాకెట్ లాగా దూసుకోపోయింది. పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు వచ్చాయి. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. జేమీ స్మిత్ (38), జేకబ్ బేతెల్ (23 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన విండీస్.. లియామ్ డాసన్ (4-0-20-4) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్, జేకబ్ బేతెల్ తలో 2 వికెట్లు తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లెవిస్ (39) టాప్ స్కోరర్ కాగా.. ఛేజ్ 24, జాన్సన్ ఛార్లెస్ 18, రోవ్‌మన్ పావెల్ 13, ఆండ్రీ రసెల్ 15, షెపర్డ్ 16, హోల్డర్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. -
బట్లర్ మెరుపులు ఇంగ్లండ్‌దే తొలి టి20
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌ను 0–3తో కోల్పోయిన వెస్టిండీస్... మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 21 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 96; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌తో... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లియామ్ డాసన్ (20 పరుగులకు 4 వికెట్లు) బంతితో మెరిపించి ఇంగ్లండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. బట్లర్ రెండు అర్ధసెంచరీ భాగస్వాముల్లో భాగమయ్యాడు. ముందుగా జేమీ స్మిత్ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రెండో వికెట్‌కు 40 బంతుల్లో 79 పరుగులు... అనంతరం ఐదో వికెట్‌కు బెథెల్ (23 బంతుల్లో 23 నాటౌట్; 1 సిక్స్)తో కలిసి 42 బంతుల్లో 60 పరుగులు జత చేశాడు. బెన్ డకెట్ (1), హ్యారీ బ్రూక్ (6), టామ్ బాంటన్ (3), విల్ జాక్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు తీయగా... అల్జారీ జోసెఫ్, ఆండ్రీ రసెల్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి ఓడిపోయింది. మూడేళ్ల తర్వాత మళ్లీ టి20 మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ జట్టు ఎడంచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ తన మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. విండీస్ తరఫున ఇవిన్ లూయిస్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), షెఫర్డ్ (12 బంతుల్లో 16; 2 ఫోర్లు), జేసన్ హోల్డర్ (13 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, బెథెల్ రెండు వికెట్ల చొప్పున తీశారు. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్ నేడు బ్రిస్టల్‌లో జరుగుతుంది. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
లండన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో వన్డేలో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 40 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (71 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుడకేశ్ మోతీ (54 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అల్జారీ జోసెఫ్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో విండీస్ గౌరవప్రద స్కోరును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా... సాఖిబ్ మెహమూద్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 246 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ ధనాధన్ ఆటతీరుతో కేవలం 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు జేమీ స్మిత్ (28 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెన్ డకెట్ (46 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు అవుటయ్యాక జో రూట్ (49 బంతుల్లో 44; 1 ఫోర్), హ్యారీ బ్రూక్ (36 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), జోస్ బట్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. జేమీ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... జో రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ శుక్రవారం మొదలవుతుంది. -
సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ వన్‌డౌన్ ఆటగాడు కీసీ కార్టీ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కార్టీ 105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేయడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. కార్టీతో పాటు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జువెల్ ఆండ్రూ 0, షిమ్రోన్ హెట్‌మైర్ 4, జస్టిన్ గ్రీవ్స్ 22, మాథ్యూ ఫోర్డ్ 1, రోస్టన్ ఛేజ్ 0, గుడకేశ్ మోటీ 18, అల్జరీ జోసఫ్ 10 పరుగులకు ఔటయ్యారు. కార్టీ, హోప్ క్రీజ్‌లో ఉండగా విండీస్ ఇంకా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగడంతో విండీస్ 308 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ కూడా తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు.గత తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో నాలుగో సెంచరీఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన కీసీ కార్టీకి గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. 28 ఏళ్ల కార్తీ గత 10 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 95కు పైగా సగటుతో 864 పరుగులు సాధించాడు. ఓవరాల్ కెరీర్లో 36 వన్డేలు ఆడిన కార్టీ 5 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సాయంతో 50కి పైగా సగటుతో 1403 పరుగులు చేశాడు.2nd ODI Vs ENG 103 (105)1st ODI Vs ENG 22 (26) 3rd ODI Vs IRE 170 (142) 2nd ODI Vs IRE 102 (109) 1st ODI Vs IRE 6 (15) 3rd ODI Vs BAN 95 (88) 2nd ODI Vs BAN 45 (47) 1st ODI Vs BAN 21 (37) 3rd ODI Vs ENG 128 (114) 2nd ODI Vs ENG 71 (77) -
నిబంధనల అతిక్రమణ.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ
మే 29న ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్‌లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధిస్తారు.ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది. -
విండీస్‌తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్లకు చోటు
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్‌తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్‌కు (ఆర్సీబీ) చోటు దక్కింది. వీరితో పాటు సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.రేపు విండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్‌ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్మెంట్. రేపటి మ్యాచ్‌కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్‌తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.విండీస్‌తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.పూర్తి జట్లు..వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మైర్ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ -
వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (మే 26) జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాణించిన హీథర్ నైట్‌స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ హీథర్ నైట్ అజేయ అర్ద సెంచరీతో (66) రాణించడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ 37, ఆమీ జోన్స్ 22,అలైస్ క్యాప్సీ 4, సోఫియా డంక్లీ 3, ఎమ్ ఆర్లాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, జైదా జేమ్స్, క్లాక్స్ట్న్ తలో వికెట్ పడగొట్టారు.హేలీ పోరాటం వృధా145 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (71) ఒంటరిపోరాటం చేసినా గెలవలేకపోయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్‌తో పాటు గ్రిమ్మండ్ (15), గజ్నబి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ బెల్, ఆర్లాట్, చార్లోట్ డీన్, లిన్సే స్మిత్ తలో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను కట్టడి చేశారు.30 నుంచి ప్రారంభంకాగా, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ నిన్నటితో ముగియగా.. మే 30 (డెర్బీ), జూన్ 4 (లీసెస్టర్), 7 తేదీల్లో (టాంటన్) మూడు వన్డేలు జరుగనున్నాయి. -
ఐర్లాండ్‌ను చిత్తు చేసిన విండీస్.. సిరీస్ సమం
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 197 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ కీస్ కార్టీ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొన్న కార్టీ.. 15 ఫోర్లు, 8 సిక్స్‌లతో 170 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కార్టీకి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. విండీస్ బ్యాటర్లలో కార్టీతో పాటు కెప్టెన్ షాయ్ హోప్(75), జస్టిన్ గ్రీవ్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్ మెక్‌కార్తీ రెండు, మెక్‌బ్రైన్, డకెరల్ తలా వికెట్ సాధించారు.అనంతరం వర్షం కారణంగా 46 ఓవర్లలో ఐర్లాండ్ టార్గెట్‌ను 363గా నిర్ణయించారు. భారీ లక్ష్య చేధనలో ఐర్లాండ్ 29.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కేడ్ కార్మైకేల్(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను దెబ్బతీయగా.. జోషఫ్, గ్రీవ్స్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి వన్డేలో ఐర్లాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇప్పుడో మూడో వన్డేలో విండీస్ గెలవడంతో సిరీస్ సమమైంది. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: #CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
డబ్లిన్: ఐర్లాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్ రెండో వన్డేలో అదరగొట్టింది. భారీ స్కోరు చేసి విజయంపై ఆశలు పెంచుకున్న వెస్టిండీస్‌ను వరుణదేవుడు కరుణించలేదు. ఫలితంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిశాక భారీ వర్షం రావడంతో ఐర్లాండ్ ఛేజింగ్ సాధ్యపడలేదు. వెరసి మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేయగా... చివర్లో మాథ్యూ ఫోర్డీ (19 బంతుల్లో 58; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) శివమెత్తాడు. కేవలం 16 బంతుల్లోనే ఫోర్డీ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఏబీ డివిలియర్స్ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును ఫోర్డీ సమం చేశాడు. కెప్టెన్ షై హోప్ (57 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకోగా... జస్టిన్ గ్రీవెస్ (36 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ, జోష్ లిటిల్ రెండు వికెట్ల చొప్పున తీయగా... లియామ్ మెకార్తీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.


