
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ కరేబియన్ వీరుడు.. ఐర్లాండ్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో ఫోర్డ్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ వరల్డ్ రికార్డును ఫోర్డ్ సమం చేశాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.
తాజా మ్యాచ్‌తో డివిలియర్స్‌తో సంయుక్తంగా ఫోర్డ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్.. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కీసీ కార్తీ(109 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి352 పరుగులు చేసింది.
వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన జాబితా ఇదే
ఏబీ డివిలియర్స్ - 16 బంతులు - దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ (2015)
మాథ్యూ ఫోర్డ్ - 16 బంతులు - వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ (2025)
సనత్ జయసూర్య - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (1996)
కుశాల్ పెరెరా - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (2015)
మార్టిన్ గుప్టిల్ - 17 బంతులు - న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక (2015)
లియామ్ లివింగ్‌స్టోన్ - 17 బంతులు - ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (2015)
చదవండి: IND vs ENG: టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?