‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్‌–ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ | India vs England semi final breaks records | Sakshi
Sakshi News home page

‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్‌–ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌

Mar 7 2026 3:56 AM | Updated on Mar 7 2026 3:56 AM

India vs England semi final breaks records

ముంబై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగి రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్‌ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్‌ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. 

ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్‌లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్‌ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్‌ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం.  

Advertisement
 
Advertisement
Advertisement