విండీస్‌ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక | Sri Lanka women completes West Indies tour with a win | Sakshi
Sakshi News home page

విండీస్‌ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక

Mar 4 2026 8:53 AM | Updated on Mar 4 2026 8:57 AM

Sri Lanka women completes West Indies tour with a win

వెస్టిండీస్‌ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.

నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.

టాపార్డర్‌ బ్యాటర్లు హేలీ మాథ్యూస్‌ (8), ఎబోని బ్రాత్‌వైట్‌ (8), షవ్నిషా హెక్టార్‌ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్‌ (24), డియాండ్రా డొట్టిన్‌ (28), చిన్నెల్‌ హెన్రీ (32 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్‌), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్‌) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌.. సిరీస్‌ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు దక్కాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement