టీమిండియా సార‌థిగా శుబ్‌మ‌న్ గిల్ ఫిక్స్‌!.. వైస్ కెప్టెన్ ఎవ‌రంటే? | Shubman Gill all set to become Test skipper after deliberation | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియా సార‌థిగా శుబ్‌మ‌న్ గిల్ ఫిక్స్‌!.. వైస్ కెప్టెన్ ఎవ‌రంటే?

May 23 2025 9:03 PM | Updated on May 23 2025 9:09 PM

Shubman Gill all set to become Test skipper after deliberation

టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవ‌ర‌న్న ఉత్కంఠ‌కు మ‌రో 24 గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది. బీసీసీఐ శ‌నివారం ఇంగ్లండ్ టూర్‌కు భార‌త జ‌ట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్ర‌కారం.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ పేరును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను నియ‌మించాల‌ని అజిత్ అగార్కర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని ప‌క్క‌న పెట్టాల‌ని సెల‌క్ట‌ర్లు డిసైడన‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

ష‌మీ త‌న మ‌డ‌మ గాయం కార‌ణంగా లాంగ్ స్పెల్స్  వేసేందుకు ఇంకా సిద్దంగా లేన‌ట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్‌, కరుణ్ నాయర్‌లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు భారత జట్టు(అంచ‌నా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.
చదవండి: రూ.25 ల‌క్ష‌లు మోస‌పోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement