
త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వేర్వేరు వెస్టిండీస్ (West Indies) జట్లను ఇవాళ (అక్టోబర్ 9) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు షాయ్ హోప్ (Shai Hope) కెప్టెన్‌గా కొనసాగగా.. గాయం కారణంగా మెరుపు వీరుడు ఎవిన్ లూయిస్ (Evin Lewis) ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు.
గాయం కారణంగా ప్రస్తుత భారత పర్యటనకు దూరంగా ఉన్న యంగ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మాజీ అండర్-19 కెప్టెన్ అకీమ్ ఆగస్టేకి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అకీమ్ ఇప్పటికే విండీస్ తరఫున 3 టీ20లు ఆడి ప్రతిభ చాటాడు. ఎవిన్ లూయిస్ స్థానాన్ని అకీమ్ భర్తీ చేశాడు.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. అలిక్ అథనాజ్ రెండు ఫార్మాట్లకు ఎంపిక కాగా, రామోన్ సిమ్మండ్స్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. హోల్డర్ టీ20 జట్టుకు మాత్రమే ఎంపిక కాగా.. మోటీ, సీల్స్, షెపర్డ్ రెండు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్నారు.
కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన ఈ సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్లు అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటిస్తాయి. ప్రస్తుతం విండీస్ టెస్ట్ జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన విండీస్ టెస్ట్ జట్టు.. రేపటి నుంచి రెండో టెస్ట్ ఆడనుంది.
వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, బ్లేడ్స్, కార్టీ, చేజ్, గ్రీవ్స్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పియర్, రదర్‌ఫోర్డ్, సీల్స్, షెపర్డ్
టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, చేజ్, హోల్డర్, హోసేన్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పౌవెల్, రదర్‌ఫోర్డ్, సీల్స్, షెపర్డ్, సిమ్మండ్స్
షెడ్యూల్:
తొలి వన్డే– అక్టోబర్ 18, ఢాకా
రెండో వన్డే– అక్టోబర్ 21, ఢాకా
మూడో వన్డే– అక్టోబర్ 23, ఢాకా
తొలి టీ20– అక్టోబర్ 27, చట్టోగ్రామ్
రెండో టీ20– అక్టోబర్ 29, చట్టోగ్రామ్
మూడో టీ20– అక్టోబర్ 31, చట్టోగ్రామ్