
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ ఎంపికానున్నట్లు తెలుస్తోంది. విండీస్ టెస్టు కెప్టెన్‌గా వైదొలిగిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ స్ధానాన్ని చేజ్ భర్తీ చేయనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని చేజ్ ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. చేజ్ నియమాకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
2016లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన చేజ్.. తన కెరీర్‌లో ఇప్పటివరకు 49 టెస్టులు ఆడాడు. అందులో 26.33 సగటుతో 2,000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 85 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
రోస్టన్ చేజ్ ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం చేజ్ సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ తలపడనుంది.
అనంతరం జూన్ మధ్యలో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో కరేబియన్లు ఢీకొట్టనున్నారు. ఈ సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా జరగనుంది. కాగా విండీస్ టెస్టు కెప్టెన్సీ బ్రాత్‌వైట్ ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: వారి త్యాగాల వల్లే ఇలా ఉన్నా.. అరుదైన గౌరవం.. రోహిత్ శర్మ భావోద్వేగం
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Roston Chase has been named the new West Indies Test captain, taking over from Kraigg Brathwaite, who stepped down from the role in March this year. 🏏🌴 #TestCricket #WestIndies #Sportskeeda pic.twitter.com/O74YrAb7EB— Sportskeeda (@Sportskeeda) May 16, 2025