WC: ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!.. భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు | Ex India Captain Backs Team India And Cites Fielding Challenges Under Lights In T20 World Cup, Says Champions But Concerns Remain | Sakshi
Sakshi News home page

T20 WC: ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!.. భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు

Mar 13 2026 7:41 PM | Updated on Mar 13 2026 7:59 PM

Ex India captain sympathises with Team India fielding under lights T20 WC

సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

కానీ.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.

చాంపియన్‌గా
ఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్‌ దిశగా అడుగులు వేసి చాంపియన్‌గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్‌ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్‌, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.

ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!
ముఖ్యంగా సూపర్‌-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్‌ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు
ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాల్సింది. క్యాచ్‌లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.

ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్‌లు వదిలేశారు.

ఫీల్డింగ్‌ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్‌ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్‌ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్‌ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్‌ చోప్రా చెప్పుకొచ్చింది.

టీ20 ప్రపంచకప్‌-2026లో సూపర్‌-8 జట్ల క్యాచింగ్‌ సామర్థ్యం
ఇంగ్లండ్‌- 87.2%
జింబాబ్వే- 85.4%
వెస్టిండీస్‌- 84.6%
న్యూజిలాండ్‌- 83.9%
పాకిస్తాన్‌- 83.3%
సౌతాఫ్రికా- 81.1%
శ్రీలంక- 77.8%
ఇండియా- 72.7%.

చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement