వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం | West Indies spinner pulls out of PSL 2026 after getting stuck in India due to West Asia conflict | Sakshi
Sakshi News home page

PSL 2026: వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం

Mar 13 2026 6:58 PM | Updated on Mar 13 2026 7:12 PM

West Indies spinner pulls out of PSL 2026 after getting stuck in India due to West Asia conflict

వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్‌ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్‌లో చిక్కుకుపోయాడు. 

ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్‌ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.

మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్‌ కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది వ్యవహరించనున్నాడు.

లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదే
ఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్,     సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే 
చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement