Gudakesh Motie
-
వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం
వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్‌లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది వ్యవహరించనున్నాడు.లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదేఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్, సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్? -
నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్ తడబడుతోంది. గ్రూప్-‘సి’లో భాగంగా తొలుత నేపాల్‌తో తలపడ్డ హ్యారీ బ్రూక్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్ ముందు తలవంచింది.వెస్టిండీస్‌దే పైచేయిటీ20 ప్రపంచకప్‌ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్‌దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్ స్పిన్‌ను ఎదుర్కోలేక ఇంగ్లండ్ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.నిరాశకు గురయ్యాంఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.ప్రత్యర్థి బౌలర్ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్‌గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.సాల్ట్ విధ్వంసకర ప్లేయర్మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్ విధ్వంసకర ప్లేయర్. ఇక జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేపాల్ మీదైనా గెలిచాంఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్‌లో నేపాల్ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.196 పరుగుల భారీ స్కోరుకాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (42 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.స్పిన్నర్ల మాయాజాలం ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఒవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ బెతెల్ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... జోస్ బట్లర్ (21), కెప్టెన్ హారీ బ్రూక్ (17) ప్రభావం చూపలేకపోయారు.చివర్లో స్యామ్ కరన్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. విండీస్ స్పిన్నర్లు గుడకేశ్ మోతీ 3, రోస్టన్ ఛేజ్ 2, అకీల్ హొసీన్ ఒక వికెట్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చదవండి: SA vs AFG: ‘డబుల్ సూపర్’ ధమాకా -
మోటీ మాయాజాలం.. ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్
ఇమ్రాన్ తాహిర్ నేతృత్వంలోని గయానా అమెజాన్ వారియర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్స్‌కు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 18) ఉదయం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై 14 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. తబ్రేజ్ షంషి (4-0-33-3), డేవిడ్ వీస్ (3-0-14-2), అల్జరీ జోసఫ్ (3-0-34-2), తైమాల్ మిల్స్ (3.5-0-38-2), రోస్టన్ ఛేజ్ (2-0-15-1) ధాటికి 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గయానా ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (34), షాయ్ హెప్ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్), ప్రిటోరియస్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గయానా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.మోటీ మాయాజాలంఅనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ మాయాజాలం (4-0-30-4) దెబ్బకు 19.1 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది. ఇమ్రాన్ తాహిర్ (4-0-22-2), ప్రిటోరియస్ (4-0-24-2), రొమారియో షెపర్డ్ (4-0-36-1), హస్సన్ ఖాన్ (2.1-0-21-1) కూడా లూసియా కింగ్స్‌ను డ్యామేజ్ చేశారు.గయానా బౌలర్ల ధాటికి ఓ దశలో లూసియా కింగ్స్ ఇన్నింగ్స్ 100లోపే ముగుస్తుందని అనుకున్నారు. అయితే ఖారీ పియెర్ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), తైమాల్ మిల్స్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) వీరోచితంగా పోరాడి గాయానా శిబిరంలో ఓటమి భయం పుట్టించారు. మోటీ పియెర్‌ను.. హస్సన్ ఖాన్ మిల్స్‌ను ఔట్ చేయడంతో లూసియా కింగ్స్ పోరాటం ముగిసింది.ఈ మ్యాచ్‌లో ఓడినా లూసియా కింగ్స్‌కు టైటిల్ రేసులో ఉండేందుకు మరో అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 20న జరిగే క్వాలిఫయర్-2లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్లో గయానాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్‌తో రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్లు
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు. టాప్-8 బ్యాటర్స్‌లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్‌లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్‌గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
ఉతికి ఆరేసిన బట్లర్.. 115 మీటర్ల భారీ సిక్సర్
వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. గుడకేశ్ మోటీ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్ 115 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇది జరిగింది. మోటీ లెంగ్త్ బాల్‌ను వేయగా.. బట్లర్ క్రీజ్ దాటి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. బట్లర్ హార్డ్ హిట్టింగ్ దెబ్బకు బంతి స్టేడియం దాటి బయటపడింది.JOS BUTTLER WITH A 115M SIX. 🤯🔥 pic.twitter.com/cfwNjHyWKn— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ ఉతికి ఆరేయడంతో 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. విల్ జాక్స్ (29 బంతుల్లో 38) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (23 నాటౌట్), జాకబ్ బేతెల్ (2 నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. తొలి టీ20లో మెరుపు సెంచరీ చేసిన ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌లో గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ 41 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు తీసి విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా నవంబర్ 14న మూడో టీ20 జరుగనుంది. -
విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది. రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరేప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు. మిగతా వారికి ఏడాదికేఅదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్ -
Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్‌కు ఫ్యూజులు ఔట్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.AN ABSOLUTE CHERRY FROM MOTIE. - The reaction of Ben Stokes says all. 😲pic.twitter.com/NTnSvRQXhJ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024మోటీ మాయాజాలంఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్‌గా నిలిచాయి. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు స్టోక్స్, రూట్లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా స్టోక్స్ బౌల్డ్ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్ స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.


