వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది.
విండీస్ బ్యాటర్లలో అమిర్ జాంగో (51) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో గుదకేశ్ మోతీ (41) రాణించాడు. ఒక దశలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన విండీస్‌ను గుదకేశ్, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
న్యూజిలాండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్ చాప్‌మన్ (80), మైకెల్‌బ్రాస్‌వెల్ (32), మిచెల్‌సాంట్నర్ (34 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు.
చాప్‌మన్, బ్రాస్‌వెల్ వెనుదిరిగినప్పటికీ కడదాకా నిలిచిన కెప్టెన్ సాంట్నర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో గుదకేశ్ మోతీ 5 వికెట్లతో సత్తా చాటగా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ సాంట్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే రేపు జరగనుంది.


