source: X
స్వదేశంలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిల్టన్ షుంబా కుడి కాలి హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.
మంగళవారం నిర్వహించిన స్కాన్‌లలో గాయం తీవ్రత బయటపడటంతో షుంబాను జట్టు నుంచి తప్పించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఇన్నోసెంట్ కైయాను జట్టులోకి తీసుకుంది. కైయా ఇప్పటికే హరారేలో జట్టుతో చేరాడు.
బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌తో షుంబా దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు గాయం అతని ఆశలకు గండికొట్టింది.
కైయా విషయానికొస్తే.. ఇతను చివరిసారిగా 2024 జూలైలో భారత్‌పైనే, హరారే వేదికగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై మరోసారి అవకాశం దక్కింది.
భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇవాళ (జూలై 23) హరారేలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 25, 26 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి.


