వైభవ్ సూర్యవంశీ కాదు.. నెక్స్ట్‌ విరాట్‌ కోహ్లి అతడే..! | Who Will Be India's Next Virat Kohli? Not Vaibhav Sooryavanshi, Wasim Jaffer Surprising Choice Sparks Debate | Sakshi
Sakshi News home page

వైభవ్ సూర్యవంశీ కాదు.. నెక్స్ట్‌ విరాట్‌ కోహ్లి అతడే..!

Jul 23 2026 1:04 PM | Updated on Jul 23 2026 1:19 PM

Not Vaibhav Sooryavanshi, Indias Next Virat Kohli Picked By Wasim Jaffer

విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్‌లో తదుపరి స్టార్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మరో ఆటగాడిని నెక్స్ట్‌ విరాట్ కోహ్లిగా అభివర్ణించాడు.

తాజాగా దూరదర్శన్ నిర్వహించిన 'ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో'లో మాట్లాడిన జాఫర్.. కేఎల్ రాహుల్‌ను భవిష్యత్‌ విరాట్‌ కోహ్లిగా పేర్కొన్నాడు. ప్రతిభ, టెక్నిక్ పరంగా రాహుల్‌ విరాట్‌తో సమానమని అన్నాడు. అయితే ఇద్దరి మధ్య తేడాను నిర్ణయించేది విరాట్‌ మానసిక దృఢత్వమని చెప్పాడు.

"కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలడు. టెక్నిక్, ప్రతిభ పరంగా చూస్తే అతడు విరాట్ కోహ్లితో సమానమే. కానీ విరాట్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అసాధారణమైన మెంటాలిటీ" అని జాఫర్ వ్యాఖ్యానించాడు.

అయితే గణాంకాల పరంగా విరాట్‌, రాహుల్ మధ్య భారీ అంతరం ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 28359 పరుగులు, 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు నమోదు చేయగా.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9830 పరుగులు, 22 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు.

మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్‌లో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, అనంతరం టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌లో మరోసారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడికి దొరికింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement