పోరాడి ఓడిన సింధు.. చైనా ఓపెన్‌లో నిరాశ | Heartbreak for PV Sindhu as she loses China Open pre quarters marathon to Chen Yufei | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సింధు.. చైనా ఓపెన్‌లో నిరాశ

Jul 23 2026 10:27 AM | Updated on Jul 23 2026 10:44 AM

Heartbreak for PV Sindhu as she loses China Open pre quarters marathon to Chen Yufei

source: X

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి చెన్ యుఫేయి 16-21, 22-20, 21-18 తేడాతో సింధును ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు అద్భుత పోరాటం చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో యుఫేయిపై గెలిచిన సింధు, అదే జోరును కొనసాగించాలని ప్రయత్నించినా ఈసారి యుఫేయి ప్రతీకారం తీర్చుకుంది.

మొదటి గేమ్‌లో వెనుకబడిన స్థితి నుంచి వరుసగా ఏడు పాయింట్లు సాధించిన సింధు, 21-16తో గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో 20-16 ఆధిక్యంలో ఉండి నాలుగు మ్యాచ్ పాయింట్లు దక్కించుకున్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోయింది. వరుస తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న యుఫేయి 22-20తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.

మూడో గేమ్‌లోనూ ఇద్దరు ప్లేయర్లు సమానంగా పోరాడారు. విరామ సమయానికి సింధు 11-8తో ఆధిక్యంలో ఉన్నా, ఆ తర్వాత యుఫేయి వరుస పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరకు 21-18తో గేమ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement