Photo Credit: BCCI Twitter
జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు తన విజయం వెనుక ఎవరు దాగున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో కోహ్లి తనకు ధైర్యం చెప్పాడని, అతడిచ్చిన సలహాతోనే ఇవాళ తనను చాంపియన్‌గా నిలబడేలా చేసిందంటూ సింధు అతడిని ప్రశంసలతో ముంచెత్తింది.
కోహ్లితో పాటు తనకు కష్టకాలంలో అండగా నిలిచిన భర్త వెంకటసాయి దత్తకు కూడా సింధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘ కొంతకాలం కిందట నేను ఫామ్‌లేమితో సతమతమయ్యాను. ఈ సమయంలో కోహ్లిని కలిసి.. మీరు కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయి సెంచరీ కోసం పరితపించారు. ఆ సమయం ఎలా గడించింది, దానిని మీరు ఎలా అధిగమించారు’ అని అడిగాను.
దీనిని కోహ్లి చాలా సింపుల్‌గా తేల్చేశాడు. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా పని. దాంట్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటా’ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లి అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. కానీ నా బొటనవేలికి గాయం కావడంతో డాక్టర్ మూడు నెలలు విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నా భర్త వెంకట దత్త సాయి మానసిక ప్రశాంతత కోసం నన్ను అట్లాంటాకు తీసుకెళ్లారు.
గాయాలు, ఫామ్‌పై పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో దత్త నాకు కోహ్లి చెప్పిన మాటలను గుర్తుచేసుకోమన్నాడు. అప్పుడు తెలిసింది నాకు కోహ్లి సీక్రెట్. విరాట్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగానే ఉంచాలనుకుంటున్నా. ఆ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ అవేంటనేవి మా మధ్యే ఉండడం అవసరమనిపించింది’ అని సింధూ పేర్కొంది. ఆదివారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగూచిపై విజయం సాధించిన సింధు 19 నెలల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.


