‘రోహిత్‌, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’ | R Ashwin-Statement-No-one-Can-Touch-Rohit-Kohli-Huge-Fan-Base | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’

Jul 21 2026 8:48 AM | Updated on Jul 21 2026 9:26 AM

R Ashwin-Statement-No-one-Can-Touch-Rohit-Kohli-Huge-Fan-Base

Photo Credit: BCCI Twitter

టీమిండియా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి భ‌విత‌వ్యంపై మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్‌, కోహ్లిల‌ను జ‌ట్టులో నుంచి తొల‌గించ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌ని, బ‌ల‌వంతంగా పంపించాల‌ని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోర‌ని హెచ్చ‌రించాడు. ఇటీవ‌లే రోహిత్ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ‌చ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్‌’లో అశ్విన్‌ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌డానికి ఏం లేదు. త‌న ఆట‌తో ఇప్ప‌టికే తానేంటో నిరూపించుకున్నాడు. 


Photo Credit: BCCI Twitter

ఇక‌ రెండో కార‌ణం ఏంటంటే.. అది రోహిత్‌, కోహ్లికి భారీ అభిమాన బ‌లం ఉంది. వీరిద్ద‌రు మ్యాచ్‌లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు త‌ర‌లివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాల‌ని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒక‌వేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవ‌డం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చ‌మ‌క్కులు పంచాడు.


Photo Credit: BCCI Twitter

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో రోహిత్‌ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత రోహిత్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్‌ కూడా తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడోవన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. 

ఇక బౌల‌ర్ల‌ పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. 

Read: స్పెయిన్‌ నంబర్‌వన్‌.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచ‌ల‌నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement