అరుదైన ఘనత సాధించిన గిల్‌, రూట్‌ | Joe Root and Shubman Gill are the only Players to be in the Top 10 ranking in Tests and ODIs | Sakshi
Sakshi News home page

అరుదైన ఘనత సాధించిన గిల్‌, రూట్‌

Jul 22 2026 4:23 PM | Updated on Jul 22 2026 5:18 PM

Joe Root and Shubman Gill are the only Players to be in the Top 10 ranking in Tests and ODIs

టీమిండియా టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ ఇవాళ (జులై 22) ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో నిలిచారు. తద్వారా ఈ వారాంత టెస్ట్‌, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో నిలిచిన ఇద్దరే ఇద్దరు బ్యాటర్లుగా రికార్డుల్లోకెక్కారు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్ మూడో స్థానంలో ఉండగా, గిల్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌ రెండో స్థానంలో ఉండగా.. రూట్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. 

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే, టీమిండియా కెప్టెన్‌ ఓ స్థానం కోల్పోయి ఆరు నుంచి ఏడుకు పడిపోగా.. రూట్‌ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌, బ్రూక్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

వన్డే ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. గిల్‌ గత వారం లాగే రెండో స్థానంలోనే ఉన్నప్పటికీ, రేటింగ్‌ పాయింట్ల సంఖ్యను 800 దాటించాడు. తాజాగా భారత్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించడంతో రూట్‌ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement