టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌.. శ్రీలంకకు భారీ షాక్‌ | Kusal Mendis suffers injury blow ahead of India Tests, ruled out of LPL 2026 | Sakshi
Sakshi News home page

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌.. శ్రీలంకకు భారీ షాక్‌

Jul 22 2026 5:59 PM | Updated on Jul 22 2026 6:14 PM

Kusal Mendis suffers injury blow ahead of India Tests, ruled out of LPL 2026

స్వ‌దేశంలో టీమిండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ గాయం కార‌ణంగా భార‌త్‌తో టెస్టుల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. లంకా ప్రీమియర్ లీగ్ 2026లో కొలంబో కాప్స్‌కు సార‌థ్యం వ‌హిస్తున్న మెండిస్‌.. గాలే గాలంటట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. 

ప‌రుగు తీసే క్ర‌మంలో అత‌డి కుడి తొడ‌ కండరాలు ప‌ట్టేశాయి. దీంతో అత‌డు తీవ్ర‌మైన నొప్పితో విల్ల‌విల్లాడు. అనంత‌రం ప‌రిగెత్తలేక ర‌నౌట్ రూపంలో మెండిస్ ఔట‌య్యాడు. త‌ర్వాత అత‌డిని అస్ప‌త్రికి త‌రలించి స్కాన్లు నిర్వ‌హించ‌గా.. గాయం తీవ్ర‌మైన‌దిగా తేలింది.

దీంతో కుశాల్ లంకా ప్రీమియర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీక‌రించింది. అత‌డు తిరిగి కోలుకునేందుకు నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు  వెళ్ల‌నున్నాడు. కాగా భార‌త్‌-శ్రీలంక మ‌ధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభం కానుంది. 

ఈ సిరీస్ స‌మ‌యానికి కుశాల్ కోలుకుంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒక‌వేళ అత‌డు దూర‌మైతే ఇది లంకేయుల‌కు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్ల‌లోనూ అత‌డు అద‌ర‌గొడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు త్వ‌ర‌గా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement