లంక‌తో టెస్టు సిరీస్‌.. టీమిండియాలోకి ఆ ఇద్ద‌రు! | Bumrah-Jadeja-Likely-Play-Test Series Vs SL-Squad-Announce-This Week | Sakshi
Sakshi News home page

లంక‌తో టెస్టు సిరీస్‌.. టీమిండియాలోకి ఆ ఇద్ద‌రు, జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆరోజే!

Jul 21 2026 12:52 PM | Updated on Jul 21 2026 1:18 PM

Bumrah-Jadeja-Likely-Play-Test Series Vs SL-Squad-Announce-This Week

Photo Credit: BCCI Twitter

ఐపీఎల్ త‌ర్వాత వ‌రుస‌గా వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌తో బిజీగా గ‌డిపిన టీమిండియా వ‌చ్చే నెల‌లో శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్‌కు సంబంధించి భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. కాగా సీనియ‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజాలు టెస్టు జ‌ట్టులోకి తిరిగి రానున్నారు. 

వీరితో పాటు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ‌, కుల్దీప్ యాద‌వ్ పేర్లు కూడా ప‌రిగ‌ణ‌లో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్‌ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ శ్రీలంక‌తో టెస్టు సిరీస్ ఆడ‌డం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్‌లో ఒక‌రు ఈ సిరీస్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశ‌ముంది. ఇక బుమ్రా, జ‌డేజాలు త‌మ చివ‌రి టెస్టు మ్యాచ్‌ను 2025 న‌వంబ‌ర్‌లో సౌతాఫ్రికాతో ఆడారు.

గిల్ సార‌థ్యంలోని టీమిండియా స్వ‌దేశంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాల‌కు టెస్టు సిరీస్‌ల‌ను కోల్పోయింది. ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఊర‌ట క‌లిగించింది. అయితే సొంత‌గ‌డ్డ‌పై ఎదురైన పరాభవాల‌ను మ‌రిచిపోయేందుకు లంక‌తో టెస్టు సిరీస్‌లో రాణించాల‌ని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. 

ఇక టెస్టు సిరీస్‌కు ముందు భార‌త జ‌ట్టు శ్రీలంక‌-ఏ జ‌ట్టుతో నాలుగు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక భార‌త్, శ్రీలంక మ‌ధ్య తొలి టెస్టు ఆగ‌స్టు 15 నుంచి 19 వ‌ర‌కు గాలే వేదికగ‌2ఆ, ఆగ‌స్టు 23 నుంచి 27 వ‌ర‌కు కొలంబో వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్‌లో ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది.

 

Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement