గంభీర్‌ చేతుల్లో అత‌డి కెరీర్‌ కూడా నాశన‌మేనా! | Kris-Srikanth Slams-Gambhir-Ruins-KL-Rahul-Changing-His-Batting Order | Sakshi
Sakshi News home page

వైభ‌వ్ లాగే.. గంభీర్‌ చేతుల్లో అత‌డి కెరీర్‌ కూడా నాశన‌మేనా!

Jul 21 2026 10:31 AM | Updated on Jul 21 2026 11:57 AM

Kris-Srikanth Slams-Gambhir-Ruins-KL-Rahul-Changing-His-Batting Order

Photo Credit: BCCI Twitter

టీమిండియా మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ భార‌త హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మ‌రింత ఆరో స్థానంలో పంపించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. భారీ ల‌క్ష్యం క‌ళ్ల ముందు ఉన్న‌ప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాట‌ర్‌ను ఆరో స్థానంలో కాకుండా ఇషాన్ కిష‌న్ స్థానంలో పంపించి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 


Photo Credit: BCCI Twitter

రాహుల్ క్రీజులోకి వ‌చ్చే స‌మ‌యానికి భార‌త్ విజ‌యానికి 36 బంతుల్లో 84 ప‌రుగులు కావాలి. కానీ రాహుల్ ఔటైతే ఆ త‌ర్వాత స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్లు ఎవ‌రూ లేర‌ని, దీంతో ఒత్తిడికి లోన‌య్యి వికెట్ స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. ఇది ముమ్మాటికి గంభీర్ త‌ప్పిద‌మేన‌ని,  కేఎల్ రాహుల్ ఏమైనా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చేవాడిలా క‌నిపిస్తున్నాడా అని ప్ర‌శ్నించారు. 

ఇప్ప‌టికే ఆలోచ‌న‌లేమితో వైభ‌వ్ సూర్య‌వంశీ, సంజూ శాంస‌న్ కెరీర్‌లు భ్ర‌ష్టు ప‌ట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్‌ను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. నిజానికి మూడో వ‌న్డేలో 387 ప‌రుగుల ఛేద‌న‌లో ఇంగ్లండ్‌కు బ‌ట్ల‌ర్‌లాగే ఆ స్థానంలో మ‌న‌కు కీ ప్లేయ‌ర్ ఉండాలి. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తే.. అప్పుడు నాలుగో స్థానంలో ఇషాన్ కిష‌న్‌కు బదులు కేఎల్ రాహుల్‌ను పంపించాల్సింది. 


Photo Credit: BCCI Twitter

2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కేఎల్ రాహుల్ ఎక్కువ‌గా ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు వ‌చ్చి కోహ్లితో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాలు నిర్మించాడు. నిన్న‌టి మ్యాచ్‌లో అది జ‌రిగి ఉంటే టీమిండియా ప‌రిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇషాన్ కిష‌న్‌ను ఆరో స్థానంలో ఆడించ‌డం వ‌ల్ల మ‌రో ఉప‌యోగం కూడా ఉండేది. ఆఖ‌ర్లో ధాటిగా ఆడాల్సిన స‌మ‌యంలో అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నడిపించ‌గ‌ల‌డ‌ని పేర్కొన్నాడు.   

నిజానికి టాప్ క్లాస్ బ్యాట‌ర్ అయిన  కేఎల్ రాహుల్ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా బ్యాటింగ్ శైలిని  మార్చుకోగ‌ల నేర్ప‌రి అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇక 2023 వన్డే ప్రపంచక‌ప్‌లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. 

అక్షర్ పటేల్‌ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ స్థానం, టీమ్ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన కేఎల్‌ రాహుల్‌ 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

 

Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement