ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( (SAI) ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌లోని వివిధ క్రీడా ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమీక్షించింది.
ఈ బ్యాచ్‌లో సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ జ్యోతితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు మధు హర్ష, గోపాల్ కందపాల్, మోహిత్‌లు ఉన్నారు. ఈ బృందం గచ్చిబౌలి జీఎంసీబీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, షూటింగ్ రేంజ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, సైక్లింగ్ వేలోడ్రోమ్, ఎల్‌బీ స్టేడియంలను పరిశీలించింది.
హైదరాబాద్‌లోని క్రీడా వసతుల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు అనుగుణంగా అవసరమైన చోట మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదల చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.


