మూత్రవిసర్జన చేస్తుండగా నాగుపాము కాటు | Snake Bite Four Year Boy In Peddapalli | Sakshi
Sakshi News home page

మూత్రవిసర్జన చేస్తుండగా నాగుపాము కాటు

Jul 22 2026 1:42 PM | Updated on Jul 22 2026 2:01 PM

Snake Bite Four Year Boy In Peddapalli

పెద్దపల్లి: ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లిన పసి బాలుడు పాముకాటుకు బలైన ఘటన ధర్మపురిలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని దుర్గమ్మకాలనీకి చెందిన ముస్కు రాజవ్వకు కుమారుడు లోకేశ్‌ (4) ఉన్నాడు. రాజవ్వ కొత్తగా ఇల్లు కట్టుకుని ఇటీవలే గృహ ప్రవేశం చేసింది. ఆ ఇంట్లోనే తల్లితో కలిసి లోకేశ్‌ సోమవారం రాత్రి పడుకున్నాడు. మంగళవారం ఉదయం లేచి ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లాడు. 

అదే సమయంలో నాగుపాము బాలుడి కాలుపై కాటు వేసింది. అతని తాత సాంబయ్య గమనించి చికిత్స నిమిత్తం ముందుగా స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల తరలించేందుకు 108కు సమాచారం అందించారు. అంబులెన్సులో ఎక్కిస్తుండగానే బాలుడు మృతిచెందాడు. లోకేశ్‌ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు పాముకాటుతో చనిపోవడంతో ఆ తల్లి గుండలవిసేలా రోధించింది. రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు.  

    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement