సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ లేఖ | KTR Writes letter to Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ లేఖ

Jul 22 2026 8:38 PM | Updated on Jul 22 2026 8:38 PM

KTR Writes letter to Revanth Reddy

ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని చెప్పారు. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే జాప్యానికి కారణమని అన్నారు. 

పునరుద్ధరణపై రేవంత్ ఇచ్చిన హామీలను కేటీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో చిత్తశుద్ధితో వ్యవహరింట్లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం వల్లే జాప్యం జరుగుతోందని తెలిపారు.


పూర్తి లేఖ

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement