భార‌త్‌-జింబాబ్వే టీ20 సిరీస్‌ షెడ్యూల్‌.. జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే | India Tour of Zimbabwe 2026: Full Schedule, Squads, Match Timings, Live Telecast And Streaming | Sakshi
Sakshi News home page

భార‌త్‌-జింబాబ్వే టీ20 సిరీస్‌ షెడ్యూల్‌.. జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే

Jul 22 2026 3:48 PM | Updated on Jul 22 2026 5:50 PM

India Tour of Zimbabwe 2026: Full Schedule, Squads, Match Timings, Live Telecast And Streaming

భార‌త్‌-జింబాబ్వే మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది. జూలై 23 నుంచి హ‌రారే వేదిక‌గా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వ‌రుస‌గా ఐర్లాండ్‌, ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఘోర ప‌రాజ‌యాల‌ను చ‌విచూసిన భార‌త్‌..  ఈ సిరీస్‌తో తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది.

ఇప్ప‌టికే జింబాబ్వే గ‌డ్డ‌పై అడుగుపెట్టిన  శ్రేయ‌స్ సేన మూడు రోజుల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించింది. ఈ సిరీస్ భార‌త జ‌ట్టుతో పాటు వైభ‌వ్ సూర్య‌వంశీ, మ‌యాంక్ యాద‌వ్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు ఎంతో కీల‌కం కానుంది. త‌న అరంగేట్ర సిరీస్‌లో విఫ‌ల‌మైన వైభ‌వ్‌.. ఇప్పుడు జింబాబ్వేపై ఎలా రాణిస్తాడోనని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. 

మరోవైపు ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన యువ పేసర్‌ మయాంక్ యాదవ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లండ్‌, ఐర్లాండ్ సిరీస్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కూడా తన ఫామ్‌ను అందుకోవడానికి ఈ జింబాబ్వే పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది.

మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న జింబాబ్వే.. టీమిండియాను అడ్డుకునేందుకు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్‌, లైవ్ స్ట్రీమింగ్ త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

షెడ్యూల్‌
ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి.

1వ టీ20- జూలై 23, 2026- గురువారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్
2వ టీ20-  జూలై 25, 2026- శనివారం-సాయంత్రం  4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్
3వ టీ20-జూలై 26, 2026- ఆదివారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్

ఈ మ్యాచ్‌ల‌ను భారత్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన సరికొత్త స్పోర్ట్స్ ఛానెల్ Unite8 Sports లో వీక్షించ‌వ‌చ్చు. అదేవిధంగా ఫ్యాన్‌కోడ్‌ యాప్, వెబ్‌సైట్‌లో కూడా ఈ మ్యాచ్‌లను చూడవచ్చు.

జట్లు
భారత్‌
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.  

జింబాబ్వే 
సికిందర్ రజా (కెప్టెన్), బ్రియన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బెన్ కుర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధెవెరె, తాడివనాషే మరుమాని, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ న్గరావా, న్యూమాన్ నియామ్‌హురీ, మిల్టన్ షుంబా, తఫద్వా త్సిగా (వికెట్ కీపర్).  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement