భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే | Zimbabwe bring back Madhevere, Nyamhuri for India T20Is | Sakshi
Sakshi News home page

భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే

Jul 22 2026 11:55 AM | Updated on Jul 22 2026 12:38 PM

Zimbabwe bring back Madhevere, Nyamhuri for India T20Is

credit: Zimbabwe cricket

రేపటి నుంచి స్వదేశంలో భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ వెస్లీ మధేవెరే, ఫాస్ట్ బౌలర్ న్యూమన్ న్యాంహురిని తిరిగి జట్టులోకి తీసుకోగా, వికెట్‌కీపర్-బ్యాటర్ తఫాడ్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు కల్పించింది.

సికందర్ రజా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

ఆశించిన ప్రదర్శనలు లేకపోవడంతో మధేవెరేను ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు పక్కన పెట్టగా.. గాయం కారణంగా ఆ సిరీస్‌ను మిస్ అయిన న్యూమన్ న్యాంహురి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

న్యాంహురి స్థానంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో అవకాశం పొందిన తనాకా చివాంగా ఈసారి కూడా జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్‌ షుంబా, తఫాడ్జ్వా సిగా

కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో జింబాబ్వే అద్భుతాలు చేసింది. తొలుత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ను, ఆతర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (2-1) కైవసం చేసుకుంది. అయితే చివర్లో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. రేపటి నుంచి భారత్‌తో జరుగబోయే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని సికందర్ రజా సేన లక్ష్యంగా పెట్టుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement