breaking news
joe root
-
AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఈసారి ఈ టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 21- 25 మధ్య తొలి టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇప్పటి నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు మైండ్‌గేమ్ మొదలుపెట్టేశారు.ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అతడు పెద్దగా బ్యాట్ ఝులిపించలేడు. గతంలో కూడా ఇలాగే జరిగింది.అతడికి ఇక నిద్రలేని రాత్రులే!నాకు బ్రాడీ బౌలింగ్‌లో ఎలాగైతే కాళరాత్రులు మిగిలాయో.. రూట్‌కు కూడా జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో నిద్రలేని రాత్రులే మిగులుతాయి. జో అద్భుతమైన క్రికెటర్. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన రెండో ఆటగాడు.కానీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం అతడికి కాస్త కష్టమే. దానిని అతడు ఈసారి అధిగమిస్తాడనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని వార్నర్ పేర్కొన్నాడు.వార్నర్ ఓ జోకర్!వార్నర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. ‘‘అతడు వార్నర్. వార్నర్ అంటే ఓ జోకర్ లాంటివాడు. రూటీ మైండ్‌లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఎన్నటికీ అది జరుగదు.అసలు రూట్‌తో సరదా ఫైట్‌కు కూడా వార్నర్ సరిపోడు. అతడు వార్నర్.. జస్ట్ వార్నర్ అంతే!.. అంతేనా? కాదా?’’ అంటూ మొయిన్ అలీ వార్నర్ పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాషెస్ మొదలైన తర్వాత ఇంకెలా ఉంటుందో అంటూ ఇరుజట్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ ఫామ్‌లో రూట్‌కాగా జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో మూడు శతకాలతో దుమ్ములేపాడు. ఐదు టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించిన రూట్.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (754) తర్వాత రెండో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.భారత్‌తో సిరీస్ సందర్భంగానే జో రూట్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రిక్కీ పాంటింగ్‌ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు రాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.ఇలాంటి వాళ్లు సరిపోరుఈ విషయం గురించి మొయిన్ అలీ ప్రస్తావిస్తూ.. ‘‘రూటీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ లాంటి వాళ్ల మాటలు అతడిపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయినా.. రూట్ లాంటి వాళ్లను ప్రభావితం చేయాలంటే ఇలాంటి వాళ్లు సరిపోరు’’ అంటూ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా నవంబరు 21- జనవరి 8 వరకు ఆసీస్- ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ ఇందుకు వేదికలు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
గంభీర్ తప్పు చేశాడు..! అవార్డు నాకు కాదు అతడికి ఇవ్వాల్సింది!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన భారత జట్టు సిరీస్‌ను సమం చేసింది. ఓవల్ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అదేవిధంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. ఎప్పటినుంచో వస్తున్న అనవాయితీ ప్రకారం ఇరు జట్ల ప్రధాన కోచ్‌లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించారు.ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీమిండియా కెప్టెన్ గిల్‌ను ఎంపిక చేయగా.. భారత ప్రధాన కోచ్ ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంచుకున్నాడు. అయితే గంభీర్ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జో రూట్‌ను కాదని బ్రూక్‌ను సెలక్ట్ చేయడం చాలా మంది తప్పుబట్టారు. గంభీర్ నిర్ణయంతో బ్రూక్ కూడా షాకయ్యాడంట.ఇదే విషయంపై బీబీసీతో బ్రూక్ మాట్లాడుతూ.. "నేను ఈ సిరీస్‌లో అంత మెరుగ్గా రాణించలేకపోయాను. జో రూట్ లాగా ఎక్కువ పరుగులు కూడా చేయలేకపోయాను. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు అతడే ఆర్హుడు. అతడే మ్యాన్ ఆఫ్‌ది సిరీసే కాదు, మ్యాన్ ఆఫ్‌ది సమ్మర్ కూడా. రూట్ ఎన్నో ఏళ్లగా జట్టుకు తన సేవలను అందిస్తూ వస్తున్నాడు" చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 537 పరుగులు చేయగా.. బ్రూక్ 481 రన్స్ చేశాడు. శుబ్‌మన్ అయితే ఏకంగా నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేశాడు.చదవండి: నువ్వు గొప్పోడివి సిరాజ్: విరాట్ కోహ్లి అక్క భావన పోస్ట్ వైరల్ -
చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్ట్ క్రికెట్లో తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్‌లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు. తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో రూట్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. రూట్ జడేజా బౌలింగ్‌లో ఇప్పటివరకు 602 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్‌లో ఇన్ని పరుగులు సాధించలేదు. ఈ జాబితాలో రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 577 పరుగులు చేశాడు. రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్‌లో 573 పరుగులు సాధించాడు.కాగా, టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో రూట్-జడేజా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సిరీస్‌లో జడేజా రూట్‌ను ఒక్కసారే (నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్) ఔట్ చేసినా ఇరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. అంకెల ప్రకారం చూస్తే జడేజాపై రూట్ పైచేయి సాధించినట్లు కనిపించినా, జడ్డూను ఎదుర్కొనేందుకు రూట్ ఇబ్బంది పడ్డాడు. వాస్తవంగా ఉపఖండలో జడేజాను ఎదుర్కోవడం రూట్‌కు కత్తి మీద సాము అవుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా బౌలింగ్‌లో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. జడ్డూ తన కెరీర్లో రూట్‌ను మొత్తం 9 సార్లు ఔట్ చేశాడు. తద్వారా ఓ బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గానూ రికార్డు కలిగి ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో రెండు మ్యాచ్‌లు గెలువగా.. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 టెస్ట్‌లు గెలువగా.. భారత్ 2,5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
IND vs ENG: అదంతా ఫేక్.. సిరాజ్ ఎలాంటివాడంటే?!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. సిరాజ్ మియాను నిజమైన పోరాట యోధుడిగా అభివర్ణించిన రూట్.. అతడి లాంటి ఆటగాడు ప్రతి జట్టులోనూ ఉండాలంటూ కొనియాడాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ‘నటించినా’.. నిజానికి సిరాజ్ చాలా మంచోడంటూ ప్రశంసించాడు.4 వికెట్లా?.. 35 పరుగులా?ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య ఓవల్ టెస్టులో సోమవారం నాటి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో సిరీస్ ఫలితం తేలనుంది. టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంటే.. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగులు కావాలి.ఇక భారత్ విధించిన 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం.. జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111). ఈ ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.అదంతా ఫేక్.. నిజానికి చాలా మంచోడు‘‘అతడికి పట్టుదల ఎక్కువ. అతడొక యోధుడు. నిజమైన పోరాట యోధుడు. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీమిండియాను గెలిపించేందుకు సర్వస్వం ధారపోస్తాడు. అందుకు అతడిని తప్పక మెచ్చుకోవాల్సిందే.ఆటగాడిగా అతడి దృక్పథం బాగుంటుంది. ఒక్కోసారి కోపం వచ్చినట్లు నటిస్తాడు. కానీ అంతలోనే కూల్ అయిపోతాడు. నిజానికి సిరాజ్ మంచివాడు. కాకపోతే తాను కాస్త కఠినంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే!అతడు గొప్ప నైపుణ్యాలున్న ఆటగాడు. అందుకే వరుసగా వికెట్లు తీస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అతడితో తలపడటాన్ని నేను ఇష్టపడతాను. అతడి ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగదు. అతడు ఏం చేసినా అది జట్టు కోసమే!.. యువ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిదాయకం’’ అని రూట్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటికే సిరాజ్ 20 వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే అత్యధికంగా వెయ్యి బంతులు వేశాడు కూడా!!టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. మొదట బౌలింగ్👉తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 224👉తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరు: 247👉రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396👉374 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 339/6 (76.2).చదవండి: IND vs ENG: కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!Mohammed Siraj lands a killer blow 💥He sends the set English captain back to the pavilion 👋#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @mdsirajofficial pic.twitter.com/Okwai75KaA— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!
ఓవల్ టెస్టు ఆఖరి రోజుకు చేరిన నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టులో ఆదివారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే నిలిపివేసి తప్పుచేశారని అంపైర్ల తీరును విమర్శించాడు. వర్షం తగ్గిన తర్వాత ఓ అరగంట సమయం ఇస్తే మ్యాచ్ ముగిసిపోయేదని అభిప్రాయపడ్డాడు.శతక్కొట్టిన రూట్, బ్రూక్ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో ఆఖరిదైన ఐదో టెస్టు లండన్‌లో ఓవల్ మైదానంలో గురువారం మొదలైంది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో 50/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (Harry Brook- 111) సెంచరీల కారణంగా పటిష్ట స్థితికి చేరిన ఇంగ్లండ్.. ఆట నిలిపివేసే సమయానికి విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలవాలంటే నాలుగు వికెట్లు అవసరం. ఇదిలా ఉంటే.. వెలుతురు లేమి కారణంగా ఆదివారం ఆటను నిలిపివేసిన నిర్వాహకులు.. ఆ తర్వాత వర్షం కురవడంతో ఆటను ముగించివేశారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ఆట ఐదో రోజుకు చేరుకుంది.కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు..ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘సోమవారం వర్కింగ్ డే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు డబ్బులు చెల్లించారన్న ముఖ్య విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి అద్భుతమైన సిరీస్‌లో తుది ఫలితాన్ని నేరుగా వీక్షించేందుకు ప్రేక్షకులు అర్హులు.అశేష అభిమానుల మధ్య.. చారిత్రాత్మక ది ఓవల్ మైదానంలో ఫలితం తేలితేనే సిరీస్ కూడా పరిపూర్ణం అవుతుంది. ఆదివారం రాత్రే ఇది జరిగి ఉండాల్సింది. ఇంగ్లండ్ మరో 35 పరుగులు చేసేదో.. లేదంటే గాయపడిన క్రిస్ వోక్స్ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసేవాడో తెలిసేది.అరగంటలో ముగించేవారు!కానీ వీళ్లేం చేశారు. ఆటను ఇలా ముగించివేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకో 42- 43 నిమిషాల పాటు ఆటను కొనసాగిస్తే ఫలితం తేలేది. నిబంధనల ప్రకారం.. కవర్లు తొలగించేందుకు వీలులేదని గ్రౌండ్స్‌మెన్ చెప్పేంత వరకు అంపైర్లు ఆటను ముగించరాదు.అదనంగా ఇంకో అరగంట కేటాయించి ఉంటే ఏమయ్యేది? ఫలితం వస్తుందని అనిపించినప్పుడు ఇలా చేయడంలో తప్పేముంది? నాకైతే కామన్సెన్స్ లోపించినట్లు అనిపిస్తోంది. నిజంగా ఇది సిగ్గుచేటు’’ అంటూ మండిపడ్డాడు. ఇక టీమిండియా మాజీ బ్యాటర్ దినేశ్ కార్తిక్ నాసిర్ హుసేన్‌కు మద్దతు పలికాడు. ఆఖరిదైన ఐదోరోజు ఆటను వీక్షించేందుకు కనీసం 20 వేల మంది ప్రేక్షకులు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్ -
ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే బ్యాట్‌తో అదరగొట్టాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్‌తో లీడ్స్ టెస్టులో శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీలతో అలరించాడు. తద్వారా ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత సారథిగా నిలిచిన గిల్.. ఈ మైదానంలో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.మరోసారి శతక్కొట్టిఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విఫలమైనా.. మాంచెస్టర్ టెస్టులో సెంచరీ సాధించి డ్రా కావడంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే ఆఖరిదైన ఐదో టెస్టు (IND vs ENG 5th Test)లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.రూట్, బ్రూక్ సెంచరీలుచావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌కు 374 పరుగుల మేర మెరుగైన లక్ష్యమే విధించింది. కానీ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జో రూట్ (Joe Root- 105) మరోసారి తన అనుభవంతో ఇంగ్లండ్‌ను గట్టెక్కించగా.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (111) అతడికి అండగా నిలిచాడు.ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బౌలర్లను మార్చుతున్నా ప్రయోజనం లేకపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలను వరుస విరామాల్లో బరిలోకి దించిన గిల్.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సేవలను కూడా వాడుకున్నాడు.నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?అయితే, వీరిద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో విసుగెత్తిన గిల్.. ఎలాగైనా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకోవాలనే యోచనతో.. గాయపడిన ఆకాశ్ దీప్‌ను సిద్ధంగా ఉన్నావంటూ అడిగాడు. కాగా వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్ దీప్.. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌కు వేసిన బంతిని.. అతడు స్ట్రెయిట్ షాట్‌గా మలచగా.. దానిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. అతడి కాలికి గాయమైంది.అయితే, భోజన విరామ సమయానికి ముందు ఆకాశ్ దీప్ సేవలు వాడుకోవాలని భావించిన గిల్.. ‘‘నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?’’ అంటూ అతడిని ప్రశ్నించాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ.. ‘‘లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి పేసర్లనే బరిలోకి దించాలని గిల్ భావిస్తున్నాడు’’ అంటూ ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టేందుకు భారత సారథి ఎంతగా పరితపించిపోతున్నాడో తెలియజేశాడు.కాగా బ్రూక్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా.. రూట్‌ను ప్రసిద్ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రసిద్ మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ నేపథ్యంలో భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆఖరి రోజైన సోమవారం గిల్ సేన విజయానికి నాలుగు వికెట్లు అవసరం. అలా అయితేనే.. సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలుగుతుంది. మరోవైపు.. ఆతిథ్య జట్టు గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉంది. కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీతో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం ఆరంభించిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG: అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!pic.twitter.com/iX9bFm9i9b— The Game Changer (@TheGame_26) August 3, 2025 -
అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ చేసిన తప్పు కారణంగా భారత జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది.దోబూచులాడుతున్న విజయంక్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తూ ఆఖరిదైన ఐదో రోజుకు చేరుకున్న ఆటలో సోమవారం ఫలితం వెలువడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా నాలుగు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది.నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియాదే పైచేయి కావాల్సింది. కానీ హ్యారీ బ్రూక్ (Harry Brook- 111), జో రూట్ (105) శతకాలతో అదరగొట్టి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. నిజానికి బ్రూక్ 19 పరుగుల వద్దే అవుటవ్వాలి.సిరాజ్ చేసిన పొరపాటు వల్లకానీ సిరాజ్ చేసిన పొరపాటు ఇంగ్లండ్ శిబిరానికి బాగా కలిసి వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ తొలి బంతికి బ్రూక్ భారీ షాట్‌కు ప్రయత్నించగా... ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ చక్కగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.కానీ బంతి పట్టిన తర్వాత కుడికాలు కదిపి బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అది అనూహ్యంగా సిక్సర్ అయ్యింది. క్యాచ్ పట్టడంతోనే బౌలర్ ప్రసిధ్ సంబరం మొదలుపెడితే... సిక్సర్ కావడంతో బ్రూక్ పండగ చేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 137/3 మాత్రమే!ఇంగ్లండ్ ఇంకా లక్ష్యానికి 237 పరుగుల బహుదూరంలో ఉంది. ఇక్కడ బ్రూక్ ఒకవేళ నిష్క్రమించి ఉంటే... నాలుగో వికెట్ పడేది. ఇప్పటికే వోక్స్ అందుబాటులో లేకపోవడంతో చేతిలో ఉన్న 5 వికెట్లతో ఇంగ్లండ్ లక్ష్యఛేదన క్లిష్టమయ్యేది!అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?కానీ తనకు దొరికిన లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న బ్రూక్ ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ నిల్చుని అతడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? నాకైతే అతడు బిక్కముఖం వేసుకుని చూస్తున్నాడనిపించింది.నిజానికి ఆ క్యాచ్ పట్టడానికి కదిలే పనేలేదు. ఉన్నచోటే ఉండి బంతిని ఒడిసిపట్టవచ్చు. ఈ తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. బ్రూక్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. టీ20 మ్యాచ్ మాదిరి టెస్టులోనూ అతడు బౌలర్లను రీడ్ చేసి అనుకున్న ఫలితాలు రాబట్టడంలో దిట్ట’’ అంటూ సిరాజ్ తీరును విమర్శించాడు.ఆట నిలిచే సమయానికి ఇలా..ఇక 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ రెండు, జేమీ ఓవర్టన్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ విజయానికి చేరువకావడంతో అవసరం పడితే.. ఆఖరి రోజు క్రిస్ వోక్స్ క్రీజులోకి దిగే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025 -
ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్‌లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో తొలి ఆటగాడు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు (69 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు.టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రవిస్ హెడ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూటీసీలో 20 సెంచరీలు, 22 అర్ద సెంచరీలు చేయడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యానికి ఇంగ్లండ్ మరో 81 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. హ్యారీ బ్రూక్ (103) అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. రూట్ 83 పరుగుల వద్ద బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ అతనికి సహకరిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 293/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్
ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు సత్తా చాటుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లు సమంగా ముందుకు వెళ్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు.ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఆటలో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ , ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూట్‌ను ప్రసిద్ద్ స్లెడ్జింగ్ చేయగా.. అందుకు అతడు సీరియస్‌గా స్పందించాడు.ప్రసిద్ద్‌కు భారత ఆటగాళ్లు మద్దతుగా నిలవడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. అంపైర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదంపై ప్రసిద్ద్ కృష్ణ స్పందించాడు. తను చేసిన స్లెడ్జింగ్ పై జో రూట్ స్పందన ఆశ్చర్యపరిచిందని కర్ణాటక స్పీడ్ స్టార్ వెల్లడించాడు."జో రూట్‌ను స్లెడ్జ్ చేయడం మా ప్రణాళికలలో భాగమే. కానీ ఆ చిన్న మాటలకు రూట్ అంత కోపంగా స్పందిస్తాడని నేను ఊహించలేదు. నేను మంచి రిథమ్‌లో ఉండి బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇలానే జరుగుతోంది. అంటే బ్యాటర్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు అలా చేస్తాను. నా మాటలకు రియాక్ట్ అయ్యి బ్యాటర్ ఏదైనా తప్పు చేస్తే మాకు వికెట్ వచ్చే అవకాశముంటుంది. ఇదంతా గేమ్‌లో భాగమే. కానీ జోరూట్ అంటే నాకు చాలా ఇష్టం. మైదానం వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అతొడక లెజెండరీ క్రికెటర్. ఇదొక చిన్న విషయం. ఈ విషయం ఇక్కడతో వదిలేయండి" అంటూ రెండో రోజు ఆట అనంతరం కృష్ణ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
ENG VS IND 5th Test: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రూట్
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్లో స్వదేశంలో జరిగిన టెస్ట్‌ల్లో 7216 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్‌తో రూట్ (7220) సచిన్ రికార్డును అధిగమించాడు.ఈ విభాగంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (7578) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ సచిన్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు..7578 - రికీ పాంటింగ్ - ఆస్ట్రేలియా7220* - జో రూట్ - ఇంగ్లండ్*7216 - సచిన్ టెండూల్కర్ - ఇండియా7167 - మహేల జయవర్ధనే - శ్రీలంక7035 - జాక్వెస్ కల్లిస్ - దక్షిణాఫ్రికామ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
టీమిండియాతో సిరీస్‌లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టుపై టెస్టుల్లో ఒకే దేశంలో 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సొంతగడ్డ ఇంగ్లండ్‌పై ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచంలో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియాతో ఓవల్ వేదికగా ఐదో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్ఇందులో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండింట.. పర్యాటక భారత్ ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో సిరీస్ ఫలితం తేలాంటే ఆఖరిదైన ఐదో టెస్టు కీలకంగా మారింది.లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. కేవలం 37 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు పూర్తి చేసుకుంది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) ధనాధన్ దంచికొట్టగా.. వన్‌డౌన్‌లో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ (22) మాత్రం నిరాశపరిచాడు. ఇక జో రూట్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. జేకబ్ బెతెల్ (6) కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఇదిలా ఉంటే.. జో రూట్‌కు ఇంగ్లండ్‌లో టీమిండియాపై ఇది 20వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలో ఓవల్ టెస్టు సందర్భంగా అతడు భారత జట్టుపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా టీమిండియాపై ఈ అరుదైన మైలురాయిని తాకలేదు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ జో రూట్.ఒక దేశంలో టీమిండియాపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన క్రికెటర్లు🏏జో రూట్- ఇంగ్లండ్‌లో- 2000* రన్స్🏏రిక్కీ పాంటింగ్- ఆస్ట్రేలియాలో- 1893 రన్స్🏏శివ్‌నరైన్ చందర్‌పాల్- వెస్టిండీస్‌లో- 1547 రన్స్🏏జహీర్ అబ్బాస్- పాకిస్తాన్లో- 1427 రన్స్🏏స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియాలో- 1396 రన్స్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు -
ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్.. ఎందుకంత సీరియస్?.. వీడియో
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఓవల్‌లో గురువారం మొదలైంది.టీమిండియా నామమాత్రపు స్కోరుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగి గిల్ సేన నామమాత్రపు స్కోరుకు పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ను ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.శుభారంభం అందించిన ఓపెనర్లుఓపెనర్లలో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ (57 బంతుల్లో 64)తో అదరగొట్టగా.. బెన్ డకెట్ (38 బంతుల్లో 43) కూడా రాణించాడు. బజ్‌బాల్ ఆటతో చెలరేగిన ఓపెనర్లలో డకెట్‌ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపగా.. క్రాలీని ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కెప్టెన్ ఓలీ పోప్ (22)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌ను ప్రసిద్ కృష్ణ వేశాడు. అతడి బౌలింగ్‌లో క్రాలీ.. రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జో రూట్ అతడి స్థానంలో రాగా.. ప్రసిద్ అద్భుతమైన బౌలింగ్‌తో అతడిని తిప్పలు పెట్టాడు.ఆఖరి బంతికి ఫోర్ బాదిన రూట్ఆ ఓవర్లో తర్వాతి ఐదు బంతుల్లో (మూడోది నోబాల్) రూట్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. అయితే, ఆఖరి బాల్‌ను ప్రసిద్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా సంధించగా.. రూట్ దానిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ ఏదో అనగా.. రూట్ ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయ్యాడు. ప్రసిద్తో వాగ్వాదం చేస్తూనే అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అందుకు ప్రసిద్ కూడా గట్టిగానే బదులిచ్చినట్లు కనిపించింది. ఇంతలో అంపైర్ వచ్చి భారత పేసర్‌ను వివరణ అడిగినట్లు కనిపించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ప్రసిద్‌కు మద్దతుగా నిలబడి.. అంపైర్‌తో వాదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి రూట్ ఇలా మైదానంలో సీరియస్ అవ్వడం అరుదు.కానీ ఈసారి మాత్రం అతడు తీవ్రస్థాయిలో ప్రసిద్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఆకాశ్ దీప్.. బెన్ డకెట్ సాగనంపే క్రమంలో భుజంపై చెయ్యి వేసి మరీ సెండాఫ్ ఇచ్చిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 33 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 33వ ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ బౌలింగ్‌లో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బ్రూక్ 8 పరుగులతో ఉండగా.. జేకబ్ బెతెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. పక్కకు లాక్కెళ్లిన రాహుల్.. వీడియోVerbal spat between Prasidh krishna and joe root.#INDvsENGTest pic.twitter.com/6cbJCa7IVd— U' (@toxifyy18) August 1, 2025 -
చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (61), శుబ్‌మన్ గిల్ (12)ల రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చిన స్టోక్స్.. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27), అన్షుల్ కంబోజ్ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.141 పరుగులుఅనంతరం బ్యాటింగ్‌లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు దాటాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇవ్వడంతో స్టోక్స్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే🏏డెనిస్ అట్కిన్సన్ (వెస్టిండీస్)- 1955లో ఆస్ట్రేలియా మీద🏏గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 1966లో ఇంగ్లండ్ మీద🏏ముష్తాక్ మొహమ్మద్ (పాకిస్తాన్)- 1977లో వెస్టిండీస్ మీద🏏ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)- 1983లో టీమిండియా మీద🏏బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)- 2025లో టీమిండియా మీదఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ కాసేపటికే లియామ్ డాసన్ (26) వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ వికెట్‌ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్ కార్స్ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్𝘾𝙖𝙡𝙢, 𝘾𝙤𝙤𝙡, 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 🔥#BenStokes shows great composure, calmly facing 6 dot balls on 99 before finally reaching a well-earned century with a confident shot 🙌#ENGvIND 👉 4th TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/xkvCs073fI pic.twitter.com/TzhM6CBR6L— Star Sports (@StarSportsIndia) July 26, 2025 -
శతక్కొట్టిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అలా!.. ఇప్పుడిలా..
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) శతక్కొట్టాడు. మాంచెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో రోజు ఆటలో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 34 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 164 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. కాగా స్టోక్స్‌కు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది. ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు టెస్టుల్లో రెండు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.ఐదు వికెట్లతో చెలరేగిన గిల్ఇరుజట్ల మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా 358 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగి.. గిల్ సేనను దెబ్బకొట్టాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.మూడేళ్లలో తొలిసారి!అంతేకాదు.. అదే మ్యాచ్‌లో సెంచరీ కూడా కొట్టి స్టోక్స్ మాంచెస్టర్ టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా గత మూడేళ్లలో టెస్టుల్లో స్టోక్స్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. నవతరం టాప్ ఆల్రౌండర్లలో ఒకడైన స్టోక్స్ ఈ టెస్టు ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) మెరుపు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. జో రూట్ 150 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా కెప్టెన్ స్టోక్స్ కూడా సెంచరీతో చెలరేగగా.. 149 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 614 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా కంటే 256 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
పాంటింగ్నూ దాటేసిన రూట్.. మిగిలింది సచిన్ ఒక్కడే
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ స్కోర్ వద్ద రూట్ సచిన్ తర్వాత టెస్ట్‌ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్, రికీ పాంటింగ్‌ను దాటేయడం విశేషం. ఇక రూట్ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్ ఆల్‌టైమ్ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921జో రూట్- 13380*రికీ పాంటింగ్- 13378జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 433/4గా ఉంది. రూట్ 121, స్టోక్స్ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
38వ సెంచరీ పూర్తి చేసిన రూట్.. రికార్డుల జాతర
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్.. టెస్ట్‌ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్ కూడా టెస్ట్‌ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈ ఇన్నింగ్స్‌లో రూట్ తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్, హాషిమ్ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్ సింగిల్‌గా ఆరో స్థానానికి చేరాడు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13358*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 51జాక్ కల్లిస్- 45రికీ పాంటింగ్- 41జో రూట్- 38కుమార సంగక్కర- 38అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-6 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 100విరాట్ కోహ్లి- 82రికీ పాంటింగ్- 71కుమార సంగక్కర- 63జాక్ కల్లిస్- 62జో రూట్- 56ఈ సెంచరీతో రూట్ సాధించిన మరిన్ని ఘనతలు..టెస్ట్‌ల్లో ఫాబ్-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలురూట్-38 స్టీవ్ స్మిత్- 36కేన్ విలియమ్సన్- 33విరాట్ కోహ్లి- 30అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 82జో రూట్- 56రోహిత్ శర్మ- 49కేన్ విలియమ్సన్- 48స్టీవ్ స్మిత్- 48టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లురూట్- 12స్టీవ్ స్మిత్- 11గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్2021లో 62022లో 52023లో 22024లో 62025లో 2మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 407/4గా ఉంది. రూట్ 104, స్టోక్స్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
భారత్‌తో నాలుగో టెస్ట్.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్
మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకిన రూట్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు.టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13319*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మరో 107 పరుగులు జోడించింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 332/2గా ఉంది. పోప్ 70, రూట్ 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 26 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పోప్, రూట్‌కు ముందు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) కూడా అర్ద సెంచరీలు సాధించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్‌కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ద్రవిడ్, కల్లిస్‌ను దాటేసిన రూట్.. మిగిలింది పాంటింగ్, సచిన్ మాత్రమే..!
ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్‌ను అధిగమించాడు. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోఈ ఫీట్‌ను నమోదు చేశాడు. మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్రవిడ్‌ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కల్లిస్‌ను అధిగమించాడు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ ముందుంది రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే. భారత్‌తో జరుగుతున్న ఇదే సిరీస్‌లో రూట్ రికీ పాంటింగ్‌ను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు ఐదో టెస్ట్‌లో మరో 89 పరుగులు చేస్తే పాంటింగ్‌ను అధిగమిస్తాడు. అప్పుడు రూట్ ముందు సచిన్ మాత్రమే ఉంటాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టడం రూట్‌కు అంత ఈజీ కాదు. రూట్ తన కెరీర్లో మరో 2500 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీట్ అసాధ్యమైతే కాదు. రూట్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే మరో 25 టెస్ట్‌ల్లో సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవడం ఖాయం.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13290*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఆచితూచి ఆడుతుంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తుండటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోప్ 32, రూట్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 261/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్‌కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
టీమిండియాతో నాలుగో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జో రూట్
సొంత గడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ టెస్టులో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన రూట్.. ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో కూడా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జోరూట్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.డేంజర్లో పాంటింగ్ రికార్డు.. మాంచెస్టర్‌లో రూట్ మరో 119 పరుగులు సాధిస్తే..టెస్టు క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా రూట్ నిలుస్తాడు. రూట్ ఇప్పటివరకు 156 టెస్టులు 50.8 సగటుతో 13259 పరుగులు చేశాడు.టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్నాడు.రూట్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్(13288), జాక్వస్ కల్లిస్(13289), రికీ పాంటింగ్(13378), సచిన్ టెండూల్కర్(15921) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గాని ఆఖరి టెస్టులో గాని ద్రవిడ్, కల్లిస్, పాంటింగ్‌ను రూట్ అధగమించే అవకాశముంది. ఇక అగ్రస్దానంలో కొనసాగుతున్న సచిన్‌ను ఆధిగమించేందుకు రూట్ ఇంకా 2,662 పరుగుల దూరంలో ఉన్నాడు.అయితే 34 ఏళ్ల రూట్ మరి కొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొనసాగితే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఐదు టెస్టుల ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-2 ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: WCL 2025: అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు -
నేను కెప్టెన్‌గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదు: జో రూట్
టీమిండియాతో రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. లార్డ్స్ (Lord's Test)లో ఇందుకు బదులు తీర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎట్టకేలకు గిల్ సేనపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో 2-1తో ముందంజ వేసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)ది కీలక పాత్ర.తగ్గేదేలేఓవైపు ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నా స్టోక్స్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఇటు బ్యాట్‌తోనూ.. అటు బంతితోనూ సత్తా చాటాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు.. టీమిండియా కీలక వికెట్లు కూల్చి జట్టు విజయానికి పునాది వేశాడు.లార్డ్స్ టెస్టులో స్టోక్స్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 44, 33 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (40), నితీశ్ రెడ్డి (30) వికెట్లు కూల్చిన స్టోక్స్.. రిషభ్ పంత్ (74)ను రనౌట్ చేశాడు.అదే విధంగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (39), ఆకాశ్ దీప్ (1) వికెట్లను పడగొట్టిన స్టోక్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ పట్టుదల, జట్టు ప్రయోజనాల పట్ల అతడి నిబద్ధత గురించి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నేను కెప్టెన్‌గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదుటీమిండియాతో నాలుగో టెస్టుకు ముందు రూట్ మాట్లాడుతూ.. ‘‘అతడు ప్రతిసారీ నా మాట వినడు. ముఖ్యంగా నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎంతగా చెప్పినా వినేవాడే కాదు. తన శరీరాన్ని కష్టపెట్టి ఎక్కువగా బౌలింగ్ చేసేవాడు.పనిభారాన్ని తగ్గించుకోమని చెబితే.. తను మాత్రం అసాధారణ రీతిలో జట్టు కోసం పట్టుదలగా ఆడేవాడు. కొన్నిసార్లు అతడి గాయాలు మరీ తీవ్రతరమైతే పరిస్థితి ఏమిటని నేను భయపడిపోయేవాడిని. కానీ అతడు మాత్రం రెండుసార్లు తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా మళ్లీ కోలుకుని ఇలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆట పట్ల తన అంకిత భావం అలాంటిది మరి’’ అని స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా లార్డ్స్ టెస్టులో రూట్- స్టోక్స్ కలిసి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 88, 67 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (104) చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 40 పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ (జూలై 23- 27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా -
వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా జో రూట్.. దిగజారిన జైశ్వాల్, గిల్ ర్యాంక్‌లు
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ మళ్లీ అగ్ర పీఠాన్ని అధిరోహించాడు. వారం రోజులు తిరగక ముందే తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను అధిగమించి రూట్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో సెంచరీతో చెలరేగిన రూట్.. ఒక స్ధానం మెరుగుపరుచుకుని నెం1 టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు.భారత్ రెండో టెస్టు అనంతరం టాప్ ర్యాంక్‌కు చేరుకున్న హ్యారీ బ్రూక్.. ఇప్పుడు 862 పాయింట్లతో మూడో స్ధానానికి పడిపోయాడు. టాప్‌లో రూట్(888) కొనసాగుతుండగా.. విలియమ్సన్(867), బ్రూక్, స్టీవ్ స్మిత్(816) తర్వాత స్ధానాల్లో కొనసాగుతున్నారు. ఇక లార్డ్స్ టెస్టులో విఫలమైన యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ రాంక్‌లు దిగజారాయి. జైశ్వాల్(801) ఒక్క స్ధానం డ్రాప్ అయ్యి ఐదో స్ధానంలో కొనసాగుతుండగా.. శుబ్‌మన్ గిల్ (765)ఏకంగా మూడు స్ధానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. అదేవిధంగా రిషబ్ పంత్ కూడా ఒక స్ధానం డ్రాప్ అయ్యి ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10 ర్యాంక్‌లో మొత్తంగా ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.సెకెండ్ ప్లేయర్గాటెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్దానాన్ని కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. టెస్టుల్లో నెం1 ర్యాంక్‌లో కొనసాగుతున్న రెండో అతి పెద్ద వయష్కుడిగా రూట్ నిలిచాడు. 34 ఏళ్ల వయస్సులో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర టాప్‌లో ఉన్నాడు. సంగక్కర 37 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో నెం1 బ్యాటర్‌గా నిలిచాడు.కాగా లార్డ్స్ టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు పోరాడినప్పటికి విజయం మాత్రం టీమిండియాకు వరించలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా -
అత్యంత అరుదైన మైలురాయికి తాకిన జో రూట్
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ ఓ అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ టెస్ట్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ (13492), మహేళ జయవర్దనే (9509), జాక్ కల్లిస్ (9033) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని తాకే క్రమంలో రూట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7564) అధిగమించాడు.కెరీర్ తొలినాళ్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రూట్.. నాలుగో స్థానానికి మారిన తర్వాత సంచలనాలు నమోదు చేశాడు. ఈ స్థానంలో రూట్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టును గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. లంచ్ విరామం తర్వాత రూట్ 31 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా బెన్ స్టోక్స్ (14) ఉన్నాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 129/4గా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 250 పరుగులు చేసినా పెద్ద స్కోరే అవుతుంది. ఈ పిచ్‌పై ఛేజింగ్ చాలా కష్టంగా ఉండనుంది. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను 200లోపు ఆలౌట్ చేస్తేనే ఛేజింగ్‌కు సులువుగా ఉంటుంది.ఇవాళ తొలి సెషన్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్‌దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్‌మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్‌దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
జో రూట్ ప్రపంచ రికార్డు..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.భారత తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ క్యాచ్‌ను తీసుకున్న తర్వాత ఈ ఫీట్‌ను రూట్ సాధించాడు. సెకెండ్ స్లిప్‌లో రూట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రూట్ ఇప్పటివరకు ఔట్ ఫీల్డ్‌లో 211 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(210) పేరిట ఉండేది.తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో రూట్(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే..211*జో రూట్210 రాహుల్ ద్రావిడ్205 మహేల జయవర్ధనే200 స్టీవెన్ స్మిత్200 జాక్వెస్ కాలిస్196 రికీ పాంటింగ్ -
అతడి పని పట్టాలంటే బుమ్రా తర్వాతే ఎవరైనా!.. మైండ్ బ్లాంక్ అయ్యేలా!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన పేస్ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ (Lord's)మైదానంలో తన తొలి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. కాగా లార్డ్స్ టెస్టులో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (11)ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ఆది నుంచే తన ప్రతాపం చూపించాడు.తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (44)ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. సెంచరీ వీరుడు జో రూట్ (104)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. అనంతరం ఈ రైటార్మ్ పేసర్.. క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పదిహేనోసారికాగా టెస్టుల్లో జో రూట్‌ను బుమ్రా అవుట్ చేయడం ఇది పదకొండోసారి కావడం విశేషం. అదే విధంగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో రూట్‌ను ఈ పేస్ గుర్రం వెనక్కిపంపడం పదిహేనోసారి. వన్డేల్లో మూడు, టీ20లలో రెండుసార్లు బుమ్రా ఈ పని చేశాడు. తద్వారా.. యాక్టివ్ ‘ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, స్మిత్, రూట్, విలియమ్సన్)’లో ఒకడైన రూట్‌ను అత్యధికసార్లు పెవిలియన్‌కు పంపిన తొలి బౌలర్‌గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.ఈ మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జో రూట్‌ను ఇప్పటికి 14సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో బుమ్రాతో కలిపి 11సార్లు రూట్‌ను వెనక్కిపంపిన కమిన్స్.. వన్డేల్లో మూడుసార్లు అతడిని అవుట్ చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్లు వీరే🏏జస్ప్రీత్ బుమ్రా (ఇండియా)- 15 సార్లు🏏ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 14 సార్లు🏏జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 13 సార్లు🏏రవీంద్ర జడేజా (ఇండియా)- 13 సార్లు🏏ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 12 సార్లు.ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (104) సెంచరీ చేయగా.. జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ధ శతకాలతో రాణించారు.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!#JaspritBumrah gets the better of England's centurion, #JoeRoot! 🤩The momentum is well and truly in #TeamIndia's favour! 🇮🇳#ENGvIND 👉 3rd TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/mg732Jcoq5 pic.twitter.com/rrINEm6bBK— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు.నిప్పులు చెరిగిన బుమ్రా..రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పులు చెరిగాడు. బుమ్రా ఆరంభంలోనే బెన్ స్టోక్స్, రూట్, వోక్స్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను కార్స్, స్మిత్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని సిరాజ్ బ్రేక్ చేశాడు. అనంతరం ఆర్చర్‌ను ఔట్ చేసిన బుమ్రా.. లార్డ్స్‌లో తొలి ఫైవ్ వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్ దక్కింది.చదవండి: IND vs ENG: బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన జో రూట్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్, బెన్ స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్ ఓవరాల్‌గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.ద్రవిడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా రూట్(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్‌నే టాప్‌లో ఉన్నాడు.అదేవిధంగా టెస్టుల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. రూట్ కూడా సరిగ్గా 11 టెస్టు సెంచరీలు చేశాడు.బుమ్ బుమ్ బుమ్రా..రెండో రోజులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(44), జో రూట్(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్‌కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లుజో రూట్ (ఇంగ్లండ్)- 11స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు..సచిన్ టెండూల్కర్ (భారత్) 51జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41కుమార్ సంగక్కర (శ్రీలంక) 38జో రూట్ (ఇంగ్లాండ్) 37చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే -
ENG Vs IND 3rd Test: 99 నాటౌట్.. జో రూట్ సాధించిన రికార్డులు
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిన్న (జులై 10) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.రెచ్చిపోయిన నితీశ్ కుమార్13 ఓవర్ల వరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.అయితే ఓలీ పోప్.. రూట్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. అనంతరం జడేజా పోప్‌ను ఔట్ చేశాడు. 50వ ఓవర్ తొలి బంతికి జడ్డూ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పోప్ పెవిలియన్‌కు చేరాడు.ఆతర్వాత కొద్ది సేపటికే ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా అద్భుతమైన బంతితో హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో రూట్‌తో జతకట్టిన స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 79 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.ముఖ్యంగా రూట్ తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టి భారత్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. రూట్ 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించాడు. రూట్ తొలి రోజు సెంచరీ పూర్తి చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. చివరి ఓవర్లో రూట్ సెంచరీ పూర్తి చేయాలని ప్రయత్నించినా కుదర్లేదు.రూట్ సాధించిన రికార్డులుఏది ఏమైన ఈ ఇన్నింగ్స్‌తో రూట్ పలు రికార్డులను సాధించాడు. 45 పరుగుల స్కోర్ వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓ జట్టుపై ఓ బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు.ఈ ఇన్నింగ్స్‌తో రూట్ మరో 3 రికార్డులు కూడా సాధించాడు. 99 పరుగుల స్కోర్ వద్ద రూట్ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్‌తో రూట్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అలిస్టర్ కుక్ (816) తర్వాత ఈ ఫీట్‌ను నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వద్ద రూట్ భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
దమ్ముంటే ఇప్పుడు బాజ్‌బాల్ ఆడండి.. రూట్‌పై సిరాజ్ సెటైర్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ నితీశ్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 44 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఓలీ పోప్, రూట్ అదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.ఈ క్రమంలో 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్‌బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" సీరియస్‌గా అన్నాడు.ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా బ్రెండన్ మెకల్లమ్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో బాజ్ బాల్ పేరిట దూకుడుగా ఆడుతూ వస్తోంది. ఇక జో రూట్ 70 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.62 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.DSP Siraj & Joe Root are Face 2 Face 🥵⚡️This one is really Crazy 👽@mdsirajofficial ✊️ @root66#siraj #ENGvIND #3rdTest #lords #LORDS #joeRoot #MohammedSiraj #london pic.twitter.com/4maGUJnK9o— Dheeraj Tanwar (@Dheerajtan23) July 10, 2025 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో 3000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు.ఓవరాల్‌గా టెస్టుల్లో ఒక జట్టుపై బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 54 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.తన అద్బుత బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. 49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌తో పాటు ఓలీ పోప్(44) ఉన్నారు. అదేవిధంగా భారత్-ఇంగ్లండ్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ వర్సెస్ భారత సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..జో రూట్ - 3007సచిన్ టెండూల్కర్ - 2535సునీల్ గవాస్కర్ - 2483సర్ అలస్టెయిర్ కుక్ - 2431విరాట్ కోహ్లీ - 1991చదవండి: IND vs ENG: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ -
చరిత్ర సృష్టించేందుకు 45 పరుగుల దూరంలో ఉన్న రూట్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఇవాల్టి (జులై 10) నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ పలు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని రూట్.. మూడో టెస్ట్‌లో చెలరేగవచ్చు. రూట్ గత రెండు టెస్ట్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36.33 సగటున కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు.నేటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌లో రూట్ బద్దలు కొట్టే ఆస్కారం ఉన్న రికార్డులు ఇవే..!టెస్ట్‌ల్లో భారత్‌పై 3000 పరుగులులార్డ్స్ టెస్ట్‌లో రూట్ 45 పరుగులు చేస్తే భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇదే జరిగితే రూట్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 99 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతి తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లుఈ మ్యాచ్‌లో రూట్ మరో ఫోర్ కొడితే టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ను అలిస్టర్ కుక్ (816) ఒక్కడే సాధించాడు.భారత్‌పై 50 క్యాచ్లుఈ మ్యాచ్‌లో రూట్ మూడు క్యాచ్‌లు పడితే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే రూట్ టెస్ట్‌ల్లో కొన్ని సందర్భాల్లో ఇంగ్లండ్‌ను క్యాచ్‌లతోనే గెలిపించాడు.భారత్‌పై 4000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 33 పరుగులు చేస్తే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫీట్‌ను చాలా తక్కువ మంది సాధించారు.ఇంగ్లండ్‌లో 11000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 189 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లలో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కూడా చాలా తక్కువ మంది సాధించారు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ ఇవాళ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. -
MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అవుటైన తీరుపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) స్పందించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని.. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సంధించిన డెలివరీ నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అనవసరపు రాద్దాంతాలు అక్కర్లేదని కొట్టిపారేసింది.తొలి గెలుపుటెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.పది వికెట్లు తీసిన ఆకాశ్ఇక భారత్ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269, 161)తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిదైన ఐదో రోజు ఏడు వికెట్లు కూల్చాల్చిన తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి సత్తా చాటాడు.అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6)లను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. హ్యారీ బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రూట్ బలయ్యాడా?అదే విధంగా జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, జో రూట్ అవుటైన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆకాశ్ దీప్ రూట్‌ను బౌల్డ్ చేసింది నిజమే అయినా.. అది నో బాల్ అని.. అతడి కాలు రిటర్న్ క్రీజును దాటిందని పలువురు విమర్శించారు. అంపైర్ తప్పిదం కారణంగా అనవసరంగా రూట్ బలయ్యాడంటూ కామెంట్లు చేశారు.𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG— Star Sports (@StarSportsIndia) July 5, 2025ఎంసీసీ వివరణఅయితే, అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసి రూట్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఎంసీసీ తాజాగా స్పందించింది. రూట్ విషయలో అంపైర్‌ది సరైన నిర్ణయమని సమర్థించింది. ‘‘గత వారం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్‌ను అవుట్ చేసిన విధానంపై కొందరు సందేహాలు లేవనెత్తారు.అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని విశ్వసించారు. నిజానికి దీప్ అసాధారణ రీతిలో క్రీజుపై ల్యాండ్ అయ్యాడు. అతడి బ్యాక్ ఫుట్ రిటర్న్క్రీజు ఆవల నేలను తాకినట్లు కనిపించింది. అయినా సరే.. అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించలేదని అన్నారు.అయితే, ఈ విషయంలో ఎంసీసీ స్పష్టతనివ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం.. బౌలర్ బ్యాక్ ఫుట్ తొలుత ఎక్కడ ల్యాండ్ అయిందన్న విషయాన్నే ఎంసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ దీప్ పాదం వెనుక భాగం తొలుత నేలను తాకింది. అది రిటర్న్ క్రీజు లోపలే ఉంది.అయితే, అతడి పాదంలో కొంత భాగం రిటర్న్ క్రీజు అవతల నేలను తాకి ఉండవచ్చు. కానీ నిబంధన ప్రకారం.. అతడి పాదం తొలుత రిటర్న్ క్రీజులోపలే ల్యాండ్ అయింది. కాబట్టి ఇది చట్టబద్దమైన డెలివరీయే’’ అని ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 465 పరుగుల భారీస్కోరు చేసింది.బౌలర్ల భరతం పట్టాడుఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా జట్టుకు తొలిసారి సారథ్యం వహిస్తున్న ముల్డర్ (Wiaan Mulder) వన్డేను తలపించే ఆట ఆడేశాడు. ఎదుర్కొన్న బంతులకంటే బాదిన పరుగులే ఎక్కువున్నాయి. బౌండరీలైతే మంచినీళ్ల ప్రాయంగా దంచేశాడు. జట్టు స్కోరు 11 వద్ద టోని డి జార్జి (10), 24 పరుగులకే సెనొక్వనే (3) ఇలా ఓపెనర్లు నిష్క్రమించిన వేళ... వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు.ఇక బెడింగ్హామ్ (82; 7 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించిన ముల్డర్ రెండో సెషన్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్లో ప్రిటోరియస్ (78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 217 పరుగులు జోడించాడు. దీంతో అఖరి సెషన్లో అతని డబుల్ సెంచరీ, జట్టు 400 పరుగుల మార్క్‌ను వేగంగా అందుకుంది.తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముల్డర్, బ్రెవిస్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తనక చివంగకు 2 వికెట్లు దక్కగా, మతిగిము, మసకద్జా చెరో వికెట్ తీశారు. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో సఫారీ 328 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ముల్దర్కెప్టెన్ హోదాలో ఆడిన తొలి టెస్టులో.. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 నాటౌట్) చేసిన ప్లేయర్‌గా వియాన్ ముల్డర్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా.. న్యూజిలాండ్ కెప్టెన్ గ్రాహమ్ డౌలింగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డును ఈ సందర్భంగా ముల్డర్ బద్దలు కొట్టాడు.టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే🏏వియాన్ ముల్డర్ (సౌతాఫ్రికా)- 2025లో బులవాయో వేదికగా జింబాబ్వేపై 264 రన్స్ నాటౌట్🏏గ్రాహమ్ డౌలింగ్ (Graham Dowling- న్యూజిలాండ్)- 1968లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీమిండియాపై 239 రన్స్🏏శివ్‌నరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్)- 2005లో జార్జ్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా మీద 203 రన్స్ నాటౌట్🏏క్లెమ్ హిల్ (ఆస్ట్రేలియా)- 1910లో సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాపై 191 రన్స్🏏జో రూట్ (ఇంగ్లండ్)- 2017లో లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాపై 190 రన్స్🏏అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)- 2017లో చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌పై 173 రన్స్🏏విజయ్ హజారే (ఇండియా)- 1954లో ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై 164 నాటౌట్🏏క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్)- 1974లో బెంగళూరు వేదికగా టీమిండియాపై 163 రన్స్.ముల్డర్.. మరిన్ని రికార్డులు👉అదే విధంగా... టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా ముల్డర్ రికార్డు నెలకొల్పాడు. హెర్షల్ గిబ్స్ (228; 2003లో పాకిస్తాన్‌పై కేప్‌టౌన్‌లో) పేరిట ఉన్న రికార్డును ముల్డర్ సవరించాడు.👉అంతేకాదు.. టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ముల్డర్ (264) ఘనత వహించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (309; 1930లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై), వీరేంద్ర సెహ్వాగ్ (284; 2009లో ముంబైలో శ్రీలంకపై), డాన్ బ్రాడ్‌మన్ (271; 1934లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 👉ఇక టెస్టు మ్యాచ్ తొలి రోజున దక్షిణాఫ్రికా చేసిన అత్యధిక స్కోరు (465) ఇదే కావడం విశేషం. 2003లో పాకిస్తాన్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 445 పరుగులు చేసింది.క్లీన్ స్వీప్ లక్ష్యంగా..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా.. రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో పర్యాటక ప్రొటిస్ జట్టు.. జింబాబ్వేను 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
ENG VS IND 2nd Test Day 3: ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు జో రూట్ (22), బెన్ స్టోక్స్‌లను (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. DSP SIRAJ HAS TAKEN CHARGE AT EDGBASTON 🥶 pic.twitter.com/ycxlvrtuMC— Johns. (@CricCrazyJohns) July 4, 2025ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (31), జేమీ స్మిత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 499 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు తీశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గట్టెక్కలేదు.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ప్రారంభించగానే వరుస షాక్‌లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్‌ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్‌గా గిల్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
వారెవ్వా రూట్.. ద్రవిడ్ వరల్డ్ రికార్డు సమం
ఇంగ్లండ్ స్టార్ బ్యా టర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును రూట్ సమం చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు.నాలుగో రోజు ఆటలో శార్థూల్ ఠాకూర్ క్యాచ్‌ను అందుకున్న జో.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్, ద్రవిడ్ ఇద్దరూ సమానంగా చెరో 210 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లను అందుకున్నారు. ద్రవిడ్ ఈ వరల్డ్ రికార్డును 164 టెస్టుల్లో సాధించగా.. రూట్ 154 మ్యాచ్‌లలోనే ఈ రేర్‌ఫీట్‌ను సమం చేశాడు.ఈ సిరీస్‌లో రూట్ మరో క్యాచ్‌ను అందుకుంటే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. ఈ రికార్డు సాధించిన జాబితాలో ద్రవిడ్, రూట్ తర్వాత స్ధానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(205 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు) ఉన్నారు. అయితే టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచర్(532) అగ్రస్దానంలో ఉన్నాడు.గెలుపువరిదో?ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. భారత్ తమ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో భారత్‌తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఇంగ్లండ్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్‌గా -
IND VS ENG 1st Test: టీమిండియా అంతా కలిసినా 'ఆ ఒక్కడితో' సమానం కాదు..!
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్‌కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్‌బాల్ అటాకింగ్ గేమ్‌ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్‌కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు. వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట. రూట్ మరో 373 పరుగులు చేస్తే..భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్‌ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్.. డేంజర్లో సచిన్, కోహ్లి రికార్డులు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్.. శుక్రవారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్-ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి.అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాటర్.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డులపై కన్నేశాడు.మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ తన కెరీర్లో ఇంగ్లండ్‌పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో జూరూట్(11 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. ఈ క్రమంలో రూట్ మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ అధిగమిస్తాడు. అదేవిధంగా ఆరు హాఫ్ సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.చరిత్రకు అడుగు దూరంలో..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో 4036 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్(3990) ఉన్నాడు. ఈ లిస్ట్‌లో మూడో స్ధానంలో జో రూట్(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 పరుగులు చేస్తే సచిన్‌ను, 179 పరుగులు సాధిస్తే విరాట్‌ను అధిగమించి అగ్రస్ధానానికి చేరుకుంటాడు.కాగా భారత్‌పై జో రూట్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా పరుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్ -
రూట్ '164' నాటౌట్.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. . తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది.కేసీ కార్టీ (105 బంతుల్లో 103; 13 ఫోర్లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ షై హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్రాండన్ కింగ్ (59; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, సాఖిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశారు.రూట్ సూపర్ సెంచరీ..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ భారీ శతకంతో చెలరేగాడు. 139 బంతులు ఎదుర్కొన్న రూట్.. 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రూట్ మాత్రం ఆచితూచి ఆడుతూ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూట్‌తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (47; 7 ఫోర్లు, 1 సిక్స్), విల్ జాక్స్ (49; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడరు. జెమీ స్మిత్ (0), బెన్ డకెట్ (0), జోస్ బట్లర్ (0) డకౌటయ్యారు. కాగా రూట్‌కు ఇది 18వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్ (179 మ్యాచ్‌ల్లో 7082 పరుగులు) అవతరించాడు. ఇయాన్ మోర్గాన్ (6957 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్ అధిగమించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం జరగనుంది. -
ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 🚨 54th INTERNATIONAL HUNDRED FOR JOE ROOT 🚨- The Greatest England Batter ever. 🐐 pic.twitter.com/bs7uEjregH— Johns. (@CricCrazyJohns) June 1, 202538 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 226/5గా ఉంది. రూట్‌తో (117) పాటు విల్ జాక్స్ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్, బెన్ డకెట్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన రూట్ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్ 47, జోస్ బట్లర్ 0, జేకబ్ బేతెల్ 17 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్ బ్యాటర్ కీసీ కార్టీ సూపర్ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లు)..విరాట్ కోహ్లి-82జో రూట్-54రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు..జో రూట్-7000 (నాటౌట్)ఇయాన్ మోర్గాన్-6957ఇయాన్ బెల్-5416జోస్ బట్లర్-5196పాల్ కాలింగ్‌వుడ్-5092 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో మ్యాచ్‌లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్(169), బ్రూక్(9) ఉన్నారు. అంతకుముందు డకెట్(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు -
Eng Vs WI: కెప్టెన్‌గా హ్యారీకి తొలి సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే (ODI Series), టీ20 సిరీస్‌లలో పాల్గొనే ఇంగ్లండ్ జట్లను ప్రకటించారు. హ్యారీ బ్రూక్ Harry Brook) సారథ్యంలో తొలిసారి ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో పోటీ పడనుంది. తొలి మూడు వన్డేలు వరుసగా మే 29న, జూన్ 1న, జూన్ 3న ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, ఓవల్‌లలో జరుగుతాయి.అనంతరం జూన్ 6న, జూన్ 8న, జూన్ 10న వరుసగా మూడు టీ20ల (Eng vs WI T20s)ను చెస్టర్ లీ స్ట్రీట్, బ్రిస్టల్, సౌతాంప్టన్‌లలో నిర్వహిస్తారు. హాంప్‌షైర్ కౌంటీ జట్టుకు ఆడుతున్న ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ టి20 జట్టులోకి వచ్చాడు. నాటింగ్హమ్షైర్ ఎడంచేతి వాటం పేస్ బౌలర్ ల్యూక్ వుడ్ రెండేళ్ల తర్వాత టి20 జట్టులోకి ఎంపికయ్యాడు. స్పిన్నర్ టామ్ హార్ట్లే రెండేళ్ల తర్వాత వన్టే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న లియామ్ లివింగ్‌స్టోన్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్. ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ప్రకటనమెల్బోర్న్/జొహన్నెస్‌బర్గ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఆస్ట్రేలియా జట్టు... తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించేందుకు దక్షిణాఫ్రికా జట్టు సమాయత్తమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జూన్ 11 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మెగా పోరులో పాల్గొనే రెండు జట్లను మంగళవారం ప్రకటించారు.ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, హాజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఇన్‌గ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, కునెమన్, లబుషేన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్. బ్రెండన్ డగెట్ (ట్రావెలింగ్ రిజర్వ్). దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), బెడింగ్హమ్, కార్బిన్ బోష్, టోనీ డి జార్జి, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎన్గిడి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరీన్. చదవండి: IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు? -
SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శనివారం నాటి మ్యాచ్‌తో పరాజయాల పరంపరను పరిపూర్ణం చేసుకుని ఇంటిబాట పట్టింది.ఈ మెగా టోర్నీలో గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌లతో కలిసి ఇంగ్లండ్ బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న బట్లర్ బృందం.. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం అఫ్గనిస్తాన్‌తో తలపడ్డ ఇంగ్లండ్.. ఆఖరి వరకు పోరాడి అనూహ్య రీతిలో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది.ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన ఇంగ్లిష్ జట్టు.. ఆఖరిగా సౌతాఫ్రికా(England vs South Africa)తో మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. కానీ ప్రొటిస్ జట్టు బట్లర్ బృందానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కరాచీ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 179 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(8), వన్‌డౌన్ బ్యాటర్ జామీ స్మిత్(0)లతో సహా హ్యారీ బ్రూక్(19), లియామ్ లివింగ్‌స్టోన్(9) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో జో రూట్ 37 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(Jos Buttler- 21), జో జోఫ్రా ఆర్చర్(25) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో 179 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో రియాన్ రికెల్టన్(27) ఫర్వాలేదనిపించగా.. తన ప్రొఫెషనల్ కెరీర్లో తొలిసారిగా ఓపెనర్‌గా వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్ అర్ధ శతకాలతో చెలరేగారు. బాధతో బట్లర్ బైబైడసెన్ 87 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్ 56 బంతుల్లో 64 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా టార్గెట్‌ను ఛేదించింది. సెమీస్ చేరడంతో పాటు గ్రూప్-బి టాపర్‌గా నిలిచింది. ఇక ఇదే గ్రూపు నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరగా.. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ వరుస పరాభవాల నేపథ్యంలో బట్లర్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించిన బట్లర్.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల చేదు అనుభవంతో తన కెప్టెన్సీ కెరీర్‌ను ముగించాడు.సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచి👉టాస్: ఇంగ్లండ్..బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 179 (38.2)👉సౌతాఫ్రికా స్కోరు: 181/3 (29.1)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్కో యాన్సెన్(3/39).చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
‘సెంచరీ’ కొట్టేసిన సౌతాఫ్రికా బౌలర్.. అరుదైన ఘనత
సౌతాఫ్రిక్రా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఎంగిడి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. తక్కువ బంతుల్లోనే వన్డేల్లో వంద వికెట్లు(100 ODI Wickets) తీసిన రెండో సౌతాఫ్రికా బౌలర్‌గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులకెక్కాడు.పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్న ఈ వన్డే టోర్నీలో ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి.38.2 ఓవర్లలోనే ఖేల్ ఖతంగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 179 పరుగులకే ఆలౌట్ చేసిన క్రమంలో సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.ఇంగ్లండ్‌తో కరాచీ వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా.. 38.2 ఓవర్లలోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. పేసర్లలో మార్కో యాన్సెన్, వియాన్ ముల్దర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. కగిసో రబడ, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో 37 పరుగులతో జో రూట్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.మిగతా వాళ్లలో బెన్ డకెట్(24), బట్లర్(21), జోఫ్రా ఆర్చర్(25) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. కేశవ్ మహరాజ్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ నిష్క్రమించాడు. ఇక ఎంగిడికి ఇది వన్డేల్లో వందో వికెట్ కావడం విశేషం. అంతేకాదు.. సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే ఈ ఫీట్ అందుకున్న రెండో బౌలర్‌గానూ ఎంగిడి నిలిచాడు. ఇక ఓవరాల్‌గా సౌతాఫ్రికా బౌలర్లలో ఈ ఘనత సాధించిన పదమూడో బౌలర్ ఎంగిడి.వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే వంద వికెట్లు తీసిన బౌలర్లు1. మోర్నీ మోర్కెల్- 2859 బంతుల్లో వంద వికెట్లు2. లుంగి ఎంగిడి- 3048 బంతుల్లో వంద వికెట్లు3. ఇమ్రాన్ తాహిర్- 3050 బంతుల్లో వంద వికెట్లు.ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! A tough outing for #JosButtler ends as #LungiNgidi finally gets his wicket. The English batter departs after battling hard in a challenging situation.#ChampionsTrophyOnJioStar 👉 #SAvENG | LIVE NOW on Star Sports 2 & Sports18-1 pic.twitter.com/fFMdIRyYeS— Star Sports (@StarSportsIndia) March 1, 2025 -
‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్(Mark Butcher) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్వ తలకెక్కితే ఇలాంటి చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆటపై కాస్త దృష్టి పెట్టాలంటూ హితవు పలికాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ తీవ్రంగా నిరాశపరిచింది.సెమీస్ కూడా చేరకుండానేగ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓడి కనీసం సెమీస్ కూడా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం కష్టపడినా ఇంగ్లండ్ గెలిచేదే. ముఖ్యంగా అఫ్గన్‌తో మ్యాచ్‌లో జో రూట్(120)కు ఒక్కరు సహకారం అందించినా బట్లర్ బృందం గట్టెక్కేదే. కానీ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ఇక ఈ వన్డే టోర్నీకి ముందు భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1తో ఓడింది. అదే విధంగా సిరీస్‌లో రోహిత్ సేన చేతిలో వన్డే 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ నేపథ్యంలో నాడు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మాట్లాడుతూ.. వైట్‌వాష్ పరాజయాన్ని తాము లెక్కచేయమని.. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, అది జరగదని ఇప్పటికే తేలిపోయింది.గర్వం తలకెక్కిందిఈ నేపథ్యంలో మార్క్ బుచర్ విజ్డన్‌తో మాట్లాడుతూ.. బట్లర్ బృందం తీరుపై మండిపడ్డాడు. ఆటగాళ్ల గర్వం, నిర్లక్ష్య ధోరణి వల్లే... ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ జట్టు ఓడిపోవాలని కోరుకున్నారని.. ఇకనైనా దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆటగాళ్లకు సూచించాడు. ‘‘చాలా మంది అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలుసు.ఇంగ్లండ్ జట్టుకు గర్వం తలకెక్కింది. వన్డే ఫార్మాట్ అంటే బొత్తిగా లెక్కలేదు. వన్డే వరల్డ్‌కప్(2019) గెలవడానికి ఎంత కష్టపడ్డారో మరచిపోయారు. గెలిచిన తర్వాత ఇకపై ఆడటం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అహంభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఈ చేదు అనుభవాలు.ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలనే కోరుకున్నారుమైదానంలో ఉన్న అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ జట్ల అభిమానులే కాదు.. ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంది ఇందుకే. ప్రతిసారీ ఆటతో అలరిస్తామని చెబితే సరిపోదు. మ్యాచ్‌లు కూడా గెలవాలి’’ అంటూ మార్క్ బుచర్ బట్లర్ బృందానికి చురకలు అంటించాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడిన ఇంగ్లండ్ పన్నెండింట ఓడిపోవడం గమనార్హం. ఇక బ్రెండన్ మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ చేతిలో క్లీన్‌స్వీప్, చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో విమర్శలు తారస్థాయికి చేరాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ జట్టుఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, సకీబ్ మహమూద్, టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్.చదవండి: CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్ -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ఈవెంట్లలో అఫ్గాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును మట్టికర్పించిన అఫ్గాన్స్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఖంగుతిన్పించారు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 326 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సెంచరీతో మెరిశాడు. ఓ దశలో ఇంగ్లండ్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన రూట్.. ఆఖరి ఓవర్లలో తన వికెట్‌ను అఫ్గాన్‌కు సమర్పించుకున్నాడు.దీంతో మ్యాచ్ అఫ్గాన్ సొంతమైంది. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 17వ వన్డే సెంచరీ. అయితే వన్డేల్లో అతడికి ఇది దాదాపు ఆరేళ్ల తర్వాత వచ్చిన శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన రూట్..ఐసీసీ ఈవెంట్లలో 300 ప్లస్ పరుగుల చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఐసీసీ టోర్నమెంట్లలో మూడు వందలకు పైగా పరుగుల లక్ష్య చేధనలో రూట్ ఇప్పటివరకు మూడు సెంచరీలు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై, 2019 వన్డే ప్రపంచ కప్లోనాటింగ్హామ్లో పాకిస్థాన్‌పై శతకాలు నమోదు చేశాడు. ఈ రెండు సందర్బాలు ఇంగ్లండ్ టార్గెట్ మూడు వందలకు పైగానే ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. వీరిద్దరూ చెరో రెండు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్, షేన్ వాట్సన్ రికార్డును రూట్ సమం చేశాడు. ఈ ముగ్గురు లెజండరీ క్రికెటర్లు తలా రెండు శతకాలు నమోదు చేశారు. ఇక ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో మార్చి1న కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
Champions Trophy 2025: ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన రూట్
అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరో సెంచరీ చేశాడు. రూట్.. వన్డేల్లో దాదాపు ఆరేళ్ల తర్వాత శతక్కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య ఛేదనలో రూట్ అద్భుతమైన శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ 98 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. ఓవరాల్‌గా (టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి) 53వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్.. విరాట్ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 82 సెంచరీలు చేయగా.. రూట్ 53, రోహిత్ శర్మ 49, స్టీవ్ స్మిత్ 48, కేన్ విలియమ్సన్ 47 అంతర్జాతీయ సెంచరీలు చేశారు. రూట్ సెంచరీతో ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల సంఖ్య 11కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ ఎడిషన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. రూట్ వన్డేల్లో చివరిగా 2019లో సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ సెంచరీతో మెరిసినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం ఆ జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 36 బంతుల్లో 58 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రూట్ 107, జేమీ ఓవర్టన్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ 12, బెన్ డకెట్ 38, జేమీ స్మిత్ 9, హ్యారీ బ్రూక్ 38, జోస్ బట్లర్ 38, లివింగ్‌స్టోన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఒమర్జాయ్, నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, గుల్బదిన్ నైబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. -
స్టీవ్ స్మిత్ ఖాతాలో 36వ టెస్ట్ శతకం.. రూట్ రికార్డు సమం
ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్‌ల్లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ శతకాన్ని స్మిత్ 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. లంక పర్యటనలో స్మిత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ స్మిత్ శతక్కొట్టాడు. THE MAN, THE MYTH, THE LEGEND - ITS STEVE SMITH IN TEST CRICKET 🦁 pic.twitter.com/phZ6XlCX9T— Johns. (@CricCrazyJohns) February 7, 2025తాజా సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) రికార్డును సమం చేశాడు. రూట్, స్మిత్ టెస్ట్‌ల్లో తలో 36 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో ప్రస్తుతం స్మిత్, రూట్ అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. కేన్ విలియమ్సన్ (Kane Williamson) 33, విరాట్ కోహ్లి (Virat Kohli) 30 సెంచరీలతో స్మిత్, రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.తాజా సెంచరీ స్మిత్‌కు టెస్ట్ కెప్టెన్‌గా 17వ సెంచరీ. ఈ సెంచరీ స్మిత్‌కు ఆసియాలో 7, శ్రీలంకలో 4వది. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్మిత్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్, రూట్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. సచిన్ తర్వాతి స్థానాల్లో జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఉన్నారు.టెస్ట్‌ల్లో స్మిత్ సెంచరీలు..ఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్‌లో 8శ్రీలంకలో 4భారత్‌లో 3న్యూజిలాండ్‌లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్‌లో 1మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్‌లో స్మిత్ శతక్కొట్టడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆసీస్ 10 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. 68 ఓవర్ల అనంతరం ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న అలెక్స్ క్యారీ (92) కూడా శతకానికి చేరువయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయింది. కేవలం రాజ్‌కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్‌కు తొలుత టీ20 సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్‌మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్‌గా భారత్‌కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్‌గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్‌కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్‌తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్‌లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్‌లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
జో రూట్ విధ్వంసం.. శివాలెత్తిపోయిన రికెల్టన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 18) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ తలపడగా.. రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ అమీతుమీ తేల్చుకున్నాయి.రూట్ విధ్వంసంప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్, దయ్యన్ గేలిమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎహసాన్ మలింగ ఓ వికెట్ దక్కించుకున్నాడు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో పార్ల్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో క్యాపిటల్స్ నాలుగో స్థానంలో ఉంది.శివాలెత్తిపోయిన రికెల్టన్రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో రీజా హెండ్రిక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో డుప్లెసిస్ టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్‌లో రికెల్టన్ కోవిడ్‌తో బాధపడుతూ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్, మతీశ పతిరణలకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఎంఐ కేప్‌టౌన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. -
2024లో అత్యుత్తమ ప్రదర్శనలు వీరివే..!
2024లో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనల వివరాలను ఈ అర్టికల్‌లో చూద్దాం.టెస్ట్‌ల్లో..అత్యధిక పరుగులు-జో రూట్ (1556)అత్యధిక సెంచరీలు-జో రూట్ (6)అత్యధిక అర్ద సెంచరీలు-యశస్వి జైస్వాల్ (9)అత్యధిక సగటు-కమిందు మెండిస్ (74.92)అత్యధిక స్కోర్-హ్యారీ బ్రూక్ (317)అత్యధిక సిక్సర్లు-యశస్వి జైస్వాల్ (36)అత్యధిక వికెట్లు-జస్ప్రీత్ బుమ్రా (71)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-జస్ప్రీత్ బుమ్రా (5)అత్యధిక సగటు-జస్ప్రీత్ బుమ్రాఅత్యుత్తమ ఎకానమీ-జస్ప్రీత్ బుమ్రా (2.96)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (ఇన్నింగ్స్‌లో)-నౌమన్ అలీ (8/46)వన్డేల్లో..అత్యధిక పరుగులు-కమిందు మెండిస్ (742)అత్యధిక శతకాలు-సైమ్ అయూబ్ (3)అత్యధిక సగటు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (106.25)అత్యధిక స్ట్రయిక్‌రేట్-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (120.05)అత్యధిక స్కోర్-పథుమ్ నిస్సంక (210 నాటౌట్)అత్యధిక సిక్సర్లు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (23)అత్యధిక వికెట్లు- హసరంగ, హేలిగర్ (26)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-అల్లా ఘజన్ఫర్ (2)అత్యుత్తమ సగటు-ఎస్ అహ్మద్ (10.94)అత్యుత్తమ ఎకానమీ-బెర్నాల్డ్ స్కోల్జ్ (3.46)అత్యధిక స్ట్రయిక్‌రేట్-వనిందు హసరంగ (17.4)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-వనిందు హసరంగ (7/19)టీ20ల్లో..అత్యధిక పరుగులు-బాబర్ ఆజమ్ (738)అత్యధిక సెంచరీలు-సంజూ శాంసన్ (3)అత్యధిక సగటు-తిలక్ వర్మ (102)అత్యధిక అర్ద సెంచరీలు-బాబర్ ఆజమ్ (6)అత్యధిక స్కోర్-ఫిన్ అలెన్ (137)అత్యధిక సిక్సర్లు-నికోలస్ పూరన్ (39)అత్యధిక వికెట్లు-వనిందు హసరంగ (38)అత్యుత్తమ బౌలింగ్ సగటు-లోకీ ఫెర్గూసన్ (9.25)అత్యుత్తమ ఎకానమీ-రషీద్ ఖాన్ (5.60)అత్యధిక స్ట్రయిక్‌రేట్-రషీద్ ఖాన్ (10.2)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6/10) -
IND Vs AUS: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీతో మెరిశాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు భారత్‌పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్‌ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్‌పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. స్టీవ్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ (10) భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేశాడు.SMUDGE 🔥pic.twitter.com/NavtFc0nFN— CricTracker (@Cricketracker) December 27, 2024టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుస్టీవ్ స్మిత్ 11జో రూట్ 10గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 8వివ్ రిచర్డ్స్ 8రికీ పాంటింగ్ 8వరుసగా రెండో సెంచరీస్టీవ్కు ఇది కెరీర్లో 34వ టెస్ట్ సెంచరీ. మెల్బోర్న్లో ఐదవది. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లోనూ స్టీవ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.రెండో రోజు లంచ్ విరామం సమయానికి స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ కోల్పోయింది.309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్ దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.విరాట్ రికార్డును అధిగమించిన స్టీవ్టెస్ట్ల్లో స్టీవ్ విరాట్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. విరాట్ 9 (47 ఇన్నింగ్స్‌లు), సచిన్ 9 (65 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ 8 (51 ఇన్నింగ్స్‌లు), మైఖేల్ క్లార్క్ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్‌లు) కలిగి ఉన్నారు.గవాస్కర్, లారా సరసన స్టీవ్టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్.. దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్‌తో పాటు వీరంతా 34 టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. -
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) -
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు. -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్‌కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.20వ స్థానానికి పడిపోయిన కోహ్లిఆసీస్తో రెండో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్‌లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్‌వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు. ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే? -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1625 పరుగులు చేయగా.. ప్రస్తుతం రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..!ఫోర్త్ ఇన్నింగ్స్‌లో రూట్ సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1630 పరుగులు చేశాడు. రూట్‌కు ఈ మైలురాయి చేరుకునేందుకు 49 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 స్థానాల్లో వీరు ఉన్నారు.రూట్- 1630 పరుగులు (49 ఇన్నింగ్స్‌లు)సచిన్- 1625 (60 ఇన్నింగ్స్‌లు)అలిస్టర్ కుక్- 1611 (53 ఇన్నింగ్స్‌లు)గ్రేమ్ స్మిత్- 1611 (41 ఇన్నింగ్స్‌లు)శివ్‌నరైన్ చంద్రపాల్- 1580 (49 ఇన్నింగ్స్‌లు)కేన్ సచిన్ రికార్డును తన 150వ టెస్ట్‌లో బద్దలు కొట్టడం విశేషం. రూట్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో 12777 పరుగులు చేసి సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యరీ బ్రూక్ (171) భారీ సెంచరీతో కదంతొక్కగా.. బ్రైడన్ కార్స్ 10 వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జేకబ్ బేతెల్తో (50 నాటౌట్) కలిసి అజేయమైన 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?! -
PAK VS ENG 3rd Test: పరుగుల యంత్రానికి బ్రేక్
ఇటీవలికాలంలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న జో రూట్.. పాకిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. గత 17 ఇన్నింగ్స్‌ల్లో రూట్‌కు ఇది తొలి సింగిల్ డిజిట్ స్కోర్. ఈ మ్యాచ్‌లో రూట్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. పాక్ రెండు వైపుల నుంచి స్పిన్నర్లతోనే అటాక్ చేస్తుండటంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడిపోయింది.pic.twitter.com/O668Qz1FRs— ViratKingdom (@kingdom_virat1) October 24, 2024ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. లంచ్ విరామం వరకు పాక్ కేవలం ఇద్దరు బౌలర్లను మాత్రమే ప్రయోగించింది. వారిద్దరు కూడా స్పిన్నర్లే. ఈ మ్యాచ్‌లో పాక్ కేవలం ఒకే ఒక పేసర్‌తో (ఆమెర్ జమాల్) బరిలోకి దిగింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (15-0-53-2), సాజిద్ ఖాన్ (15-3-55-3) ఇంగ్లండ్ బ్యాటర్లను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. వీరి ధాటికి ఇంగ్లండ్ 110 పరుగులకే (30 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (52) ఒక్కడు అర్ద సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 29, ఓలీ పోప్ 3, జో రూట్ 5, హ్యారీ బ్రూక్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బెన్ స్టోక్స్ (6), జేమీ స్మిత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచాయి. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ప్రత్యేకమైన స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించుకుంది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), గస్ అట్కిన్సన్, రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, షోయబ్ బషీర్పాకిస్తాన్: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, మొహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహీద్ మెహమూద్చదవండి: రఫ్ఫాడించిన రబాడ.. సౌతాఫ్రికా ఘన విజయం -
రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (932) సాధించి టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్ విలియమ్సన్తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్, బ్రూక్ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్ ఆటగాళ్లు అఘా సల్మాన్, షాన్ మసూద్ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్ లీచ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. జో రూట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
PAK vs ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జోసఫ్ ఎడ్వర్డ్ రూట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (262) చేసిన రూట్.. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు. రూట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 350 మ్యాచ్‌లు ఆడి 20079 పరుగులు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత 20000 పరుగులు పూర్తి చేసింది రూట్ ఒక్కడే. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 535 మ్యాచ్‌లు ఆడి 27041 పరుగులు చేశాడు.కాగా, పాక్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. సహచురుడు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడ్డాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్ -
పాక్ గడ్డపై ఇంగ్లండ్ వీరుల విధ్వంసం(ఫోటోలు)
-
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్‌పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రూట్‌కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బ్రూక్‌కు ఇది ఆరో సెంచరీ. పాక్‌పై కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగవది. బ్రూక్‌తో పాటు మరో ఎండ్‌లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ -
అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. టెస్ట్‌ల్లో 35వ సెంచరీ
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రూట్ గత మూడేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో రూట్ 2021 నుంచి 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.JOE ROOT, YOU FREAKING LEGEND. 🙇♂️- 35th Test century going past Gavaskar, Younis, Lara and Jayawardene and became England's leading run scorer as well in Tests. The GOAT!! 🐐 pic.twitter.com/uG9pkzpmOf— Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2024రూట్ ఖాతాలో 35వ సెంచరీతాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ మరో సెంచరీతో మెరిశాడు. రూట్‌కు టెస్ట్‌ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలో రూట్ సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేళ జయవర్దనే, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. పైన పేర్కొన్న వారంతా టెస్ట్‌ల్లో తలో 34 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు..సచిన్-51కల్లిస్-45పాంటింగ్-41సంగక్కర-38ద్రవిడ్-36రూట్-35*ఈ ఏడాది ఐదో సెంచరీరూట్ టెస్ట్‌ల్లో తన రెడ్ హాట్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. తాజా సెంచరీతో కలుపుకుని రూట్ ఈ ఏడాది ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఏడాది టెస్ట్‌ల్లో రూట్, కమిందు మెండిస్ మాత్రమే ఐదు సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రూట్ (104), హ్యారీ బ్రూక్ (59) క్రీజ్‌లో ఉన్నారు. జాక్ క్రాలే (78), ఓలీ పోప్ (0), బెన్ డకెట్ (84) ఔటయ్యారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
టెస్టు క్రికెట్లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగులు వరదపారిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు..టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్పటివరకు 147 టెస్టులు ఆడి 12473* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.చదవండి: CT 2025: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? -
PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్ లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌కే దక్కుతుంది.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..రూట్-5005లబూషేన్-3904స్టీవ్ స్మిత్-3486బెన్ స్టోక్స్-3101బాబర్ ఆజమ్-2755ఎడిషన్ల వారీగా రూట్ చేసిన పరుగులు..2019-21లో 1660 పరుగులు2021-23లో 1915 పరుగులు2023-25లో 1490 పరుగులురూట్ ఖాతాలో మరో రికార్డు..తాజా ఇన్నింగ్స్‌తో రూట్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఐదోసారి క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్.. బ్రియాన్ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్‌ల్లో) చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
రూట్‌కు పొంచి ఉన్న గండం.. అరుదైన రికార్డుకు ఎసరు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే పేరిట ఆ రికార్డుఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్‌కు ఇప్పుడు అవకాశం వచ్చింది. జైస్వాల్ 132 రన్స్ చేస్తే..ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడుఅంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్‌గా ఈ సైకిల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో ఉంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.డబ్ల్యూటీసీ వీరుడిగాఅనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
'ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్ చేశాడు'
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి జురెల్ అడుగుపెట్టాడు. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయ పడిన కేఎల్ రాహుల్ స్ధానంలో ధ్రువ్ ఎంట్రీ ఇచ్చాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 90 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన జురెల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే తాజాగా తన డెబ్యూ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచి ఎదురైన అనుభవాలను ధ్రువ్ పంచుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌లో కలిసి ఆడిన జో రూట్ సైతం తనను స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యపరిచందని ధ్రువ్ చెప్పుకొచ్చాడు.రాంచీ టెస్టుల్లో నేను 32 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాను. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకుంది. కొత్త బంతి తీసుకోవడంతో జేమ్స్ ఆండర్సన్ ఎటాక్‌లోకి వస్తాడని నేను ముందే ఊహించాను. అతడు అప్పటికే కొంచెం దూకుడుగా ఉన్నాడు. ఎందుకంటే మా భాగస్వామ్యం నెమ్మదిగా పెరుగుతుందని వారికి తెలుసు.మా భాగస్వామ్యాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నన్ను స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టారు. కానీ నేను వారి మాటలను పట్టించుకోకడదని డిసైడ్ అయ్యాను. వారు నా ఏకగ్రాతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. జానీ బెయిర్‌స్టో అయితే కంటిన్యూగా ఏదో ఒకటి అంటూ వున్నాడు.అతడితో జో రూట్ కూడా చేరాడు. ఐపీఎల్లో జో రూట్ కలిసి ఆడాము. అయినప్పటకి అతడు నన్ను స్లెడ్జ్ చేయడంతో షాక్ అయ్యాను. వెంటనే జో రూట్ భాయ్ మీరు నన్ను ఎందుకు స్లెడ్జింగ్ చేస్తున్నారు? అని అడిగాను. ఇది నా వృత్తి ధర్మం. మనమందరం ఇప్పుడు మన దేశం కోసం ఆడుతున్నాము అని రూట్ బదలిచ్చాడని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్ పేర్కొన్నాడు. కాగా ధ్రువ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్‌కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..⇥టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్‌ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌లగా నిలిచారు. తాజా సిరీస్‌లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.⇥ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం -
ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వద్ద రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఉండేవాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు చేయగా.. రూట్ తన 146వ టెస్ట్‌లో సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. సంగక్కర రికార్డు బద్దలు కొట్టాక రూట్ మరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 12402 పరుగులు ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ 83 పరుగులు చేసుంటే టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా అవతరించేవాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ ఖాతాలో 12472 టెస్ట్ పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల రికార్డు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఖతాలో 15921 పరుగులు ఉన్నాయి. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (13378), జాక్ కల్లిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288) టాప్-4 టెస్ట్ రన్ స్కోరర్లుగా ఉన్నారు.70 పరుగులకే 6 వికెట్లు..మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. ఆ జట్టు 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ డకెట్ 7, డేనియల్ లారెన్స్ 35, ఓలీ పోప్ 7, జో రూట్ 12, హ్యారీ బ్రూక్ 3, క్రిస్ వోక్స్ 0 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో లహీరు కుమార 3, విశ్వ ఫెర్నాండో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్ టెస్టు క్రికెటర్?
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు మోత మోగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు.తద్వారా ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్(34) చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డువైపు రూట్ అడుగులు వేస్తున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకు అతడు సిద్దమవుతున్నాడు.విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్?అయితే తాజాగా ఓ పోడ్కాస్ట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లి వర్సెస్ జో రూట్.. ఇద్దరిలో ఎవరూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్? అన్న ప్రశ్నను హోస్ట్ అడిగాడు. వెంటనే వాన్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా జో రూట్‌ను ఎంచుకున్నాడు. కానీ గిల్లీ మాత్రం అందుకు అంగీకరించలేదు. విరాట్ కోహ్లినే టెస్టుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఈ ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ అదిరిపోయే సమాధానమిచ్చాడు."రూట్ ఇంగ్లండ్‌లో అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో రూట్ గణాంకాలు చూస్తేనే ఆర్ధమవుతోంది. అతడు సాధించిన సెంచరీలలో సగానిని పైనా ఇంగ్లండ్‌లో చేసినవే. కానీ విరాట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మెరుగ్గా రాణించగలడు. విరాట్ కోహ్లి పెర్త్‌లో ఆడిన ఇన్నింగ్స్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. పెర్త్ మైదానంలో నేను చూసిన అత్యుత్తమ సెంచరీలలో విరాట్ నాక్ ఒకటి. అది కూడా అతడు పెర్త్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే కావడం విశేషం. అందుకే నా దృష్టిలో కోహ్లినే బెస్ట్ టెస్టు బ్యాటర్" అని గిల్లీ క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లోపేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ దెబ్బకు వాన్ తోకముడిచాడు. ఆస్ట్రేలియాలో విరాట్ బెస్ట్ అని, కానీ వేరే చోట రూటే అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అని వాన్ చెప్పుకొచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లినే అత్యుత్తమ బ్యాటర్ అని వాన్, గిల్లీ ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.గణాంకాల్లో రూట్.. అక్కడ మాత్రం విరాట్కాగా టెస్టుల్లో రూట్ గణాంకాలతో పోలిస్తే విరాట్ కాస్త వెనకబడ్డాడనే చెప్పకోవాలి. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 113 టెస్టులు ఆడి.. 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టు సెంచరీలు చేయడం గమనార్హం. విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇక రూట్ విషయానికి వస్తే.. 145 టెస్టులు ఆడి 12377 పరగులు చేశడు. అతడి ఇన్నింగ్స్‌లలో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఆసీస్ గడ్డపై రూట్ ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టు సెంచరీ చేయలేదు. అతడి సాధించిన సెంచరీలలో 20కు పైగా ఇంగ్లండ్‌లో సాధించినవే కావడం గమనార్హం. -
శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 190 పరుగుల తేడాతో భారీ విజయం
లార్డ్స్ వేదికగా శ్రీలకంతో జరిగిన రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 483 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది.లంక బ్యాటర్లలో కరుణ్‌రత్నే(55), చందీమాల్(58), దనుజంయ డి సిల్వా(50) హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో గౌస్ అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా.. క్రిస్ వోక్స్, స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251 పరుగులకే ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 231 పరుగుల భారీ లీడ్ లభించింది. ఈ ఆధిక్యాన్ని కలుపునకుని 483 పరుగుల భారీ టార్గెట్‌ను లంకేయులు ముందు ఇంగ్లీష్ జట్టు ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక విఫలమైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427 పరుగులు చేయగా.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసిన జో.. రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్‌తో సత్తాచాటాడు. అదేవిధంగా ఇంగ్లీష్ పేస్ బౌలర్ అట్కిన్సన్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిదో స్ధానంలో వచ్చి సెంచరీతో చెలరేగిన అట్కిన్సన్.. బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఓవరాల్‌గా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
జో రూట్ డబుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రూట్ ఇదే మ్యాచ్‌లో ఓ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అదెలా అనుకుంటున్నారా..? ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక క్యాచ్‌లు పట్టుకున్న రూట్.. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రూట్ సహా కేవలం నలుగురు నాన్ వికెట్కీపర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా ద్రవిడ్ (210 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మాజీ మహేళ జయవర్దనే (205) రెండో స్థానంలో.. రూట్, కల్లిస్ (200) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో లంక నెగ్గాలంటే మరో 291 పరుగులు చేయాల్సి ఉంది. ఆ జట్టు చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. చండీమల్ (58), ధనంజయ డిసిల్వ (11) క్రీజ్‌లో ఉన్నారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దిముత్ కరుణరత్నే (55) అర్ద సెంచరీతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (36) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ 2, షోయబ్ బషీర్, అట్కిన్సన్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు రూట్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. రూట్‌తో పాటు (143) అట్కిన్సన్ (118) సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. అశిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డులు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్‌కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..→టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ అవతరించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.→ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్, జయవర్దనే, సునీల్ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.→ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్‌లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో గూచ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.→50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు చేసిన 9వ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.డేంజర్లో సచిన్ రికార్డు.. కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 15,921 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 పరుగులతో 7వ స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా రూట్ సచిన్‌కు కేవలం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి తన కెరీర్‌ను ముగించగా.. రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్నెస్ పరంగా కూడా మెరుగ్గా ఉండడంతో సచిన్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. -
తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతులు ఎదుర్కొన్న రూట్.. 18 ఫోర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన అలస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఆయనకే సెంచరీ అంకితం...ఇక జో రూట్ తన 33వ టెస్ట్ సెంచరీని ఇంగ్లండ్ దివంగత మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌కు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మెంటార్ థోర్ప్‌కు నివాళులర్పించాడు. తన సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్ ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణాన ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు."నా కెరీర్లో ఇప్పటివరకు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు, మెంటార్లతో కలిసి పనిచేశాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా కెరీర్‌ను తీర్చిదిద్దిన వారిలో గ్రాహం థోర్ప్ ఒకరు. ఈ క్షణంలో థోర్ప్‌ను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆయనను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పటికి థోర్ప్‌కు రుణపడి ఉంటాను. నా ఆట, నా కెరీర్ ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర. ఈ స్ధాయిలో నేను ఉన్న అంటే కారణం థోర్ప్ అని గర్వంగా చెబుతున్నాను.బ్యాటింగ్ టెక్నిక్, స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు నాకు చాలా సహాయం చేశాడరు. ఈ రోజు నేను స్వీప్ షాట్లను సులభంగా ఆడుతున్న అంటే కారణం ఆయనే. నా సెంచరీని థోర్పీకి అంకితమివ్వాలనకుంటున్నాను అని తొలి రోజు ఆట అనంతరం రూట్ పేర్కొన్నాడు. కాగా థోర్ప్ ఈ నెల ఆరంభంలో అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. -
రోహిత్ శర్మను అధిగమించిన జో రూట్.. 44 నెలల్లో 16 సెంచరీలు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీ రూట్‌కు 33వ టెస్ట్ సెంచరీ. మూడు ఫార్మాట్లలో కలిపితే 49వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో రూట్ రెండో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. తాజా సెంచరీ చేసే క్రమంలో రూట్ రోహిత్ శర్మను (48 సెంచరీలు) అధిగమించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీల రికార్డు విరాట్ కోహ్లి (80) పేరిట ఉంది. రూట్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రూట్ (33), కుక్ (33), కెవిన్ పీటర్సన్ (23) టాప్-3లో ఉన్నారు. 2020లో కేవలం 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. 44 నెలల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు బాదాడు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే రూట్, స్మిత్, విరాట్, కేన్లలో రూట్ అత్యధికంగా 33 సెంచరీలు కలిగి ఉన్నాడు. కేన్, స్మిత్ చెరో 32 సెంచరీలు చేయగా.. విరాట్ 29 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్ 143 పరుగులు చేసి ఔట్ కాగా.. గస్ అట్కిన్సన్ (74), మాథ్యూ పాట్స్ (20) క్రీజ్‌లో ఉన్నారు. బెన్ డకెట్ (40), హ్యారీ బ్రూక్ (33), జేమీ స్మిత్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, లహీరు కుమార తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
జో రూట్ సూపర్ సెంచరీ.. కుక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ తన అద్బుత సెంచరీతో ఆదుకున్నాడు.162 బంతుల్లో 13 ఫోర్లతో రూట్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తన సొంత గడ్డపై 20వ టెస్టు సెంచరీ కాగా.. లార్డ్స్‌లో ఆరో శతకం. ఇక సెంచరీతో మెరిసిన రూట్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే...టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్ అలెస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అతడు మరో సెంచరీ సాధిస్తే కుక్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 11వ స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) ఆగ్రస్ధానంలో ఉన్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. రూట్ ఇప్పటివరకు తన సొంతగడ్డపై 6569* పరుగులు చేశాడు. ఇంతకుముందు రికార్డు కుక్(6568) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. చంద్రపాల్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రూట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 84 బంతుల్లో 6 ఫోర్లతో రూట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇది రూట్ రెండో హాఫ్ సెంచరీ. అంతకుముందు తొలి టెస్టులో కూడా ఆర్ధశతకంతో జో మెరిశాడు.రూట్ అరుదైన ఘనత.. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఐదో క్రికెటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 147 మ్యాచ్‌ల్లో 97*సార్లు ఏభై పైగా రూట్ పరుగులు సాధించాడు.ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ క్రికెట్ దిగ్గజం శివనారాయణ చందర్‌పాల్ పేరిట ఉండేది. చందర్‌పాల్ తన కెరీర్లో 164 టెస్టుల్లో 96 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. అయితే తాజా మ్యాచ్‌తో చందర్‌పాల్‌ను రూట్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(119 ఫిప్టీ ప్లస్ స్కోర్లు) ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా కల్లిస్(103), పాంటింగ్(103), ద్రవిడ్(99) ఉన్నారు. కాగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'బాబర్, అఫ్రిది కాదు.. పాక్‌లో ఆ భారత క్రికెటర్‌కే ఫ్యాన్స్ ఎక్కువ' -
Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. తొమ్మిదికి పడిపోయిన బాబర్
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్‌లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.టాప్-10లోనే మనోళ్లుఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.తొమ్మిదికి పడిపోయిన బాబర్కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లుఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
జో రూట్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు! సచిన్‌కు చేరువలో
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు రాణించిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అతడు 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంలో ఈ వెటరన్ తన వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.జో రూట్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 144 టెస్టులు ఆడిన రూట్.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలాన్ బోర్డర్(63), భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(63)ల పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దరని అధిగమించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(68) అగ్రస్ధానంలో ఉండగా.. విండీస్ లెజెండ్ చంద్రపాల్(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్లో 32 టెస్టు సెంచరీలు ఉన్నాయి. -
తొలి టెస్టు.. శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 204/6తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. 326 పరుగులకు ఆలౌటైంది. కమిందు మెండిస్ (183 బంతుల్లో 113; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో రాణించి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (128 బంతుల్లో 62 నాటౌట్; 2 ఫోర్లు), జేమీ స్మిత్ (48 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), డాన్ లారెన్స్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హ్యారీ బ్రూక్ (68 బంతుల్లో 32; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోర్లుశ్రీలంక తొలి ఇన్నింగ్స్: 236/10ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:358/10శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్:326/10ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్:205/5 -
సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు. -
కోహ్లి కాదు!.. వరల్డ్ నంబర్ వన్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ప్రపంచంలోని ప్రస్తుత టాప్ బ్యాటర్లలో బాబర్ ఆజం టెక్నిక్ గొప్పగా ఉంటుందని పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ జాహిద్ అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ టెస్టు సెంచరీల ధీరుడు జో రూట్ మాత్రం.. బాబర్ కంటే తెలివిగా బ్యాటింగ్ చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా స్టార్లలో విరాట్ కోహ్లి కంటే కూడా రోహిత్ శర్మకే తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని జాహిద్ స్పష్టం చేశాడు.టెక్నిక్ పరంగా బాబర్ వరల్డ్ నంబర్ వన్ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ నైపుణ్యాల పరంగా చూస్తే.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బాబర్ ఆజం బెస్ట్ అని చెబుతాను. అందరికంటే అతడి బ్యాటింగ్ టెక్నిక్ అత్యుత్తమంగా ఉంటుంది. అయితే, బ్యాటింగ్ నాలెడ్జ్ విషయంలో మాత్రం.. జో రూట్, స్టీవ్ స్మిత్.. వేరే లెవల్ అంతే!బాబర్ ఈ విషయంలో వాళ్లంత క్లెవర్ కాదు. మ్యాచ్‌ను అంచనా వేయడంలో వారిద్దరు సూపర్. అయితే, ఈ ఇద్దరిలోనూ స్మిత్‌కు నంబర్ వన్, రూట్‌కు రెండో ర్యాంకు ఇస్తాను. వారి తర్వాత బాబర్ ఆజం’’ అని మహ్మద్ జాహిద్ పేర్కొన్నాడు.కోహ్లి కంటే రోహిత్ బెటర్ఇక విరాట్ కోహ్లి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ పేరును ఎవరు తిరస్కరించగలరు. అయితే, నా వరకు కోహ్లి కంటే రోహిత్ శర్మ బెటర్. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ రోహిత్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో అతడికి ఎవరూ సాటిరారు. తనొక గిఫ్టెడ్ ప్లేయర్. ఇంజమామ్ ఉల్ హక్ మాదిరి తొందరగా బంతిని అంచనా వేసి.. ఏ షాట్ ఆడాలో నిర్ణయించుకుంటాడు’’ అని మహ్మద్ జాహిద్ చెప్పుకొచ్చాడు.సెంచరీల వీరుడిని కాదనికాగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్‌గా పేరొందిన కోహ్లి.. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో సాధించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు చేరువగా వచ్చాడు ఈ రన్‌మెషీన్. ఇప్పటి వరకు 80 సెంచరీలు బాది.. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే షోయబ్ అక్తర్ వంటి పలువురు పాక్ మాజీ క్రికెటర్లు వరల్డ్ నంబర్ వన్‌గా కోహ్లి పేరు చెప్పగా.. జాహిద్ మాత్రం కోహ్లిని కాదని.. బాబర్ ఆజం, రోహిత్ శర్మ, స్మిత్, రూట్లకు ఓటు వేశాడు. వీరంతా సెంచరీల విషయంలో కోహ్లి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.లంక సిరీస్‌తో బిజీకాగా రోహిత్, కోహ్లి ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో ఫామ్ కొనసాగిస్తుండగా.. కోహ్లి మాత్రం 38 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మరోవైపు.. పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం కఠినపరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ దారుణ వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్సీపై మరోసారి వేటుపడే అవకాశం ఉంది. -
కేన్ విలియమ్సన్కు షాక్.. వరల్డ్ నంబర్ వన్‌గా రూట్
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు. -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్.. భారీ జంప్ కొట్టిన బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.విండీస్‌ను చిత్తు చేసిమూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.అగ్రపీఠానికి చేరువైన రూట్నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.భారీ జంప్ కొట్టిన బ్రూక్ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు. -
రూట్.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడు..!
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ తాజాగా విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో (32) రూట్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి, ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11940) ఎగబాకాడు.టెస్ట్‌ల్లో 32 సెంచరీలు పూర్తి చేసిన అనంతరం రూట్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రూట్ అతి త్వరలో ఇంగ్లండ్ లీడింగ్ టెస్ట్ రన్ స్కోరర్‌గా అవతరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో రూట్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా సవరిస్తాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 ఏళ్లే అని.. మరో రెండు,మూడేళ్లలో సచిన్ రికార్డు బద్దలు కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.కాగా, రూట్ ప్రస్తుతం అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. కలిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), ద్రవిడ్ (36), యూనిస్ ఖాన్ (34), గవాస్కర్ (34), లారా (34), జయవర్దనే (34), కుక్ (33) రూట్ కంటే ముందున్నారు. రూట్ మరో సెంచరీ చేస్తే.. తన దేశ అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేస్తాడు.అలాగే రూట్ మరో 54 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారాను (11953) అధిగమించి ఏడో స్థానానికి ఎగబాకుతాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288), కుక్ (12472), సంగక్కర (12400), లారా మాత్రమే రూట్ కంటే ముందున్నారు. జులై 26 నుంచి విండీస్‌తో జరుగబోయే చివరి టెస్ట్‌లో రూట్ పై పేర్కొన్న వాటిలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
టెస్టుల్లో సచిన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: వాన్
నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 122 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రూట్‌కు ఇది 32వ టెస్టు సెంంచరీ కావడం విశేషం.ఈ నేపథ్యంలో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని వాన్ అభిప్రాయపడ్డాడు."జో రూట్ మరి కొద్ది రోజుల్లోనే టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ హిస్టరీలో లీడింగ్ రన్‌స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించే సత్తా రూట్‌కు ఉంది. ఇప్పటికే సచిన్ రికార్డుకు రూట్ చేరవయ్యే వాడు. కానీ ఆ మధ్య కాలంలో రూట్ తన ఫామ్‌ను కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ తన వికెట్‌ను కోల్పోయేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మాత్రం అతడు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే కొనసాగితే సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేసే అవకాశముందని" ది టెలిగ్రాఫ్ కోసం తన కాలమ్‌లో వాన్ రాసుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం 8వ స్ధానంలో కొనసాగుతున్నాడు.260 ఇన్నింగ్స్‌లలో రూట్ ఇప్పటివరకు 11,940 పరుగులు చేశాడు. కాగా సచిన్ 329 టెస్టు ఇన్నింగ్స్‌లలో 15921 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13378) ఉన్నాడు. -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్‌లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. బషీర్‌తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
స్మిత్, విలియమ్సన్ సరసన రూట్
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగించింది. జో రూట్ (122), హ్యారీ బ్రూక్ (109) శతకాలతో విజృంభించడంతో ఇంగ్లీష్ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. తద్వారా విండీస్ ముందు 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.స్మిత్, విలియమ్సన్ సరసన చేరిన రూట్టెస్ట్ల్లో 32వ సెంచరీతో కదంతొక్కన రూట్.. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. స్మిత్, విలియమ్సన్ టెస్ట్‌ల్లో చెరి 32 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో స్మిత్, విలియమ్సన్, రూట్ తలో 32 టెస్ట్ సెంచరీలు చేయగా.. కోహ్లి 29 సెంచరీలతో వెనకపడ్డాడు.రూట్ తాజా సెంచరీ ద్వారా సాధించిన రికార్డులు..యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక టెస్ట్ సెంచరీలు (కుక్ 33 సెంచరీలు) యాక్టివ్ ప్లేయర్లలో మూడో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) (విరాట్ 80, రోహిత్ శర్మ 48, రూట్ 48)టెస్ట్‌ల్లో తొలిసారిఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 400 ప్లస్ స్కోర్లు (416 & 425) చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించడం ఇది తొలిసారి. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 12 సార్లు మాత్రమే ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు సార్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో 400 ప్లస్ స్కోర్లు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఓలీ పోప్ (121) సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కవెమ్ హాడ్జ్ (120) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. -
బ్రూక్ సెంచరీ.. రూట్ రికార్డు హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. హ్యారీ బ్రూక్ కెరీర్లో ఐదో శతకం.. సొంతగడ్డపై తొలి శతకం పూర్తి చేసి సత్తా చాటాడు. బ్రూక్ 118 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 109 పరుగుల వద్ద బ్రూక్.. జేడన్ సీల్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జాషువ డసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రూక్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేయడం విశేషం. బ్రూక్ క్రికెట్లో 14 టెస్ట్‌లు ఆడి 62.55 సగటున 1376 పరుగులు చేశాడు.బ్రూక్‌కు జతగా మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ కెరీర్లో 63వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (68) టాప్‌లో ఉండగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ (66) రెండో స్థానంలో నిలిచాడు. రూట్.. అలెన్ బోర్డర్, రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేయకముందే రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11869) ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్, కలిస్, ద్రవిడ్, కుక్, సంగక్కర, లారా.. రూట్ కంటే ముందున్నారు.కాగా, నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 300 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ (80), జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 416 పరుగులు, విండీస్ 457 పరుగులు చేశాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (121), విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్.. వామ్మో ఇన్ని కోట్లా?
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరపున స్టోక్స్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో రూ. 8.5 కోట్ల భారీ ధరకు స్టోక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. స్టోక్సీ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులగా స్టోక్స్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టిసారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్టోక్స్.. ఈ ఏడాది మినీ వేలానికి ముందు తన నిర్ణయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీకి తెలియజేశాడు. దీంతో అతడిని సీఎస్కే రిటైన్ చేసుకోలేదు. ఒకవేళ ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో స్టోక్స్ చేరితో ఆ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఇప్పటికే ఆ జట్టులో కిరాన్ పొలార్డ్, రషీద్‌ఖాన్, రబాడ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయినప్పటకి గత రెండు సీజన్లలో కేప్‌టౌన్ జట్టు చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. స్టోక్సీ రాకతోనైనా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. అదేవిధంగా ఈ ఏడాది ది హాండ్రడ్ లీగ్‌లో కూడా స్టోక్స్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌తో సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ పార్ల్ రాయల్స్ ఒప్పందం కుదర్చుకుంది. -
విరాట్, రోహిత్, రూట్: రైనా
ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో మొదటిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఉంటారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను క్రికెట్ సర్కిల్స్‌లో ఫాబ్ ఫోర్‌గా పిలుస్తారు. ఈ నలుగురితో పాటు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ పేర్లు కూడా అడపాదడపా వినిపిస్తుంటాయి.సురేశ్ రైనా ఛాయిస్ ఎవరంటే..?ఈ తరం అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నను టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎదుర్కొన్నప్పుడు సెకెను కూడా ఆలస్యం చేయకుండా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, జో రూట్ ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లని రైనా అభిప్రాయపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్ అనంతరం రైనా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.ఈ సందర్భంగా రైనాతో పాటు పలువురు మాజీలు ఇదే ప్రశ్నను ఎదుర్కోగా.. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కాంబినేషన్‌ను చూస్ చేసుకున్నారు. హర్భజన్ సింగ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలో జాక్ కలిస్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చేర్చగా.. ఆరోన్ ఫించ్.. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చెప్పాడు. రాబిన్ ఉతప్ప.. వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారా పేర్లు చెప్పాడు.ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో టీమిండియా ఛాంపియన్స్.. పాకిస్తాన్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి, తొట్టతొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
ఆల్‌టైమ్ టాప్-10 జాబితాలోకి రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలోకి చేరాడు. లార్డ్స్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన రూట్.. ఈ జాబితాలో పదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921 పరుగులు) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288), అలిస్టర్ కుక్ (12472), సంగక్కర (12400), బ్రియాన్ లారా (11953), చంద్రపాల్ (11867), జయవర్దనే (11814), రూట్ (11804) రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.Joe Root has moved up to 10th on the all-time list of Test run-scorers 👏👑 An incredible achievement by one of England's greatest-ever players! pic.twitter.com/fSUOhqJt1N— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 11, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు.విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్‌పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్‌పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ యువ ఆటగాడు షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికి రివ్యూ కావాలని అడగడం అందరని ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే బషీర్ తను బౌల్డ్ కాకుండా వికెట్ కీపర్‌కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు. కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్‌తో చెప్పాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు సైతం నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాబు బషీర్ బౌల్డ్లకు రివ్యూలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? View this post on Instagram A post shared by TNT Sports (@tntsports) -
భారత అంపైర్‌కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్‌మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు. -
జడేజా స్పిన్ మయాజాలం.. 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రాంఛీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఆఖరి మూడు వికెట్లను కూడా జడ్డూనే పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. -
Ind vs Eng: ముగిసిన రెండో రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England 4th Test Day2 Live Updates And Highlights: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 302/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్లే రెండు, జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) ఒక్కడే అర్థ శతకం బాదాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్ గిల్ 38 పరుగలతో ఫర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సరికి ధ్రువ్ జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 నిలకడగా ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా స్కోరు: 219-7(72) 61.4: 200 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా కుల్దీప్ 14, జురెల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 55.2: ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా అశ్విన్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్లే బౌలింగ్‌లో అశూ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 177/7 (55.2). ఆరో వికెట్ డౌన్ 51.3: రాంచి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్లే బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఓపికగా క్రీజులో నిలబడిన ఈ ముంబై బ్యాటర్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. స్కోరు: 171/6 (51.3). అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 46.4: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 73 పరుగులతో నిలకడగా ఆడుతున్న జైస్వాల్‌ను ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌల్డ్ చేశాడు. టీమిండియా స్కోరు: 161/5 (46.4). ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్ 10 పరుగులతో ఉన్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 131/4 (38) జైస్వాల్ 54, సర్ఫరాజ్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. జడేజా ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్ స్కోర్: 130/4. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. మూడో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్ టీమిండియా ఆటగాడు రజిత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. పాటిదార్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 35 ఓవర్లు ముగిసే సరికి భార స్కోర్: 112/3. క్రీజులోకి జడేజా వచ్చాడు. యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీ... టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 89 బంతుల్లో అర్ధ శతకాన్ని యశస్వీ పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు భారత్ స్కోర్: 105/2. జైశ్వాల్‌తో పాటు రజిత్ పాటిదార్(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ ఔట్ 86 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రజిత్ పాటిదార్ వచ్చాడు. నిలకడగా ఆడుతున్న భారత్.. టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్(40), శుబ్‌మన్ గిల్(27) నిలకడగా ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 34/1 లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్‌మన్ గిల్(4) ఉన్నారు. 5 ఓవర్లకు భారత స్కోర్: 20/1 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్‌మన్ గిల్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను బారత్ కోల్పోయింది. కేవలం 2 పరుగులు చేసిన రోహిత్.. ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు. 353కు ఇంగ్లండ్ ఆలౌట్.. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ అదనంగా 51 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. అదే విధంగా ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షోయబ్ బషీర్.. పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 351/9 ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 347 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన ఓలీ రాబిన్సన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(119), ఓలీ రాబిన్సన్(58) నిలకడగా ఆడుతున్నారు. 102 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్.. 302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత పేసర్లను ఓలీ రాబిన్సన్, జో రూట్‌ను ఎటాక్ చేస్తున్నారు. 94 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 324/7, క్రీజులో జో రూట్(107), ఓలీ రాబిన్సన్(49) ఉన్నారు. ►రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. క్రీజులో జో రూట్(106), ఓలీ రాబిన్సన్(31) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
ఆకాశ్ దెబ్బ కొట్టినా... ఇంగ్లండ్ 'రూట్' మారింది
అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ పేస్‌కు... అశ్విన్, జడేజా స్పిన్‌కు... లంచ్ లోపే ఇంగ్లండ్ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది . దాంతో టీ విరామం వరకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెర పడుతుందేమోననే సందేహం కలిగింది... కానీ అలా జరగలేదు. అనుభవజ్ఞుడైన జో రూట్ తన అసలు సిసలు ఆటతీరును ప్రదర్శించాడు... ఈ సిరీస్‌లో తమ జట్టు దూకుడైన ‘బజ్‌బాల్’ వ్యూహానికి భిన్నంగా ‘రూట్’ మార్చాడు... సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు... సహచరుడు ఫోక్స్ సహాయంతో రెండో సెషన్లో భారత బౌలర్లను కాచుకున్నాడు ...ఆ తర్వాత ఫోక్స్ వెనుదిరిగినా... రాబిన్సన్ అండగా నిలబడటంతో... రూట్ పట్టుదలతో ఆడుతూ వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్ స్కోరును 300 దాటించాడు. రాంచీ: సిరీస్ గెలిచేందుకు భారత్... సమం చేసేందుకు ఇంగ్లండ్... ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మొదలైన నాలుగో టెస్టు తొలిరోజు ఆట ఆసక్తికరంగా సాగింది. కొత్త పేసర్ ఆకాశ్ దీప్ (3/70) నిప్పులు చెరిగే బౌలింగ్ భారత్‌ను మురిపిస్తే... సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ శతకం ఇంగ్లండ్‌ను కుప్పకూలకుండా కాపాడింది. దీంతో పూర్తిగా ఎవరి పైచేయి లేకుండా తొలిరోజు ఆట సమఉజ్జీగా ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలీ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో బెన్ ఫోక్స్ (126 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ‘టాప్’లేపిన ఆకాశ్ ఈ సిరీస్‌లో భారత్ తరఫున నాలుగో ఆటగాడిగా అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి క్రాలీని ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అది నోబాల్ కావడంతో ఆకాశ్ దీప్‌కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత క్రాలీ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో క్రాలీ చెలరేగిపోయాడు. వరుసగా 4,4,4,6తో అదరగొట్టాడు. సాఫీగా సాగిపోతున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆకాశ్ దీప్ దెబ్బ కొట్టాడు. పదో ఓవర్లో ఆకాశ్ రెండో బంతికి ఓపెనర్ డకెట్ (11)ను, నాలుగో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ (0)లను అవుట్ చేసి భారత శిబిరాన్ని సంబరంలో ముంచాడు. ఇదే జోరుతో తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 12వ) ఓపెనర్ క్రాలీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. 47/0తో ఉన్న ఇంగ్లండ్ ఆకాశ్ దెబ్బకు 57/3 స్కోరు వద్ద టాపార్డర్‌ను కోల్పోయింది. ఈ దశలో జో రూట్‌కు జతయిన బెయిర్‌స్టో (35 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. దీంతో వన్డేను తలపించేలా 20వ ఓవర్లోనే ఇంగ్లండ్ స్కోరు 100కు చేరింది. రెండో సెషన్ ఆరంభంలో బెయిర్‌స్టోను అశ్విన్ ఎల్బీగా పంపాడు. అంపైర్ తోసిపుచ్చినా... రివ్యూకు వెళ్లడంతో బెయిర్‌స్టో వికెట్ దక్కింది. కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (3)ను జడేజా వికెట్ల ముందు దొరక బుచ్చుకున్నాడు. అక్కడే 112/5 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అడ్డుకుని... ఆదుకున్నాడు ఒక్క సెషన్లోనే 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వెటరన్ బ్యాటర్ రూట్ అంతా తానై నడిపించాడు. బెన్ ఫోక్స్ అండతో రెండో సెషన్లో పరుగులు పేర్చాడు... వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సెషనంతా భారత సీమర్లు, స్పిన్నర్లు ఎంతగా కష్టపడినా రూట్, ఫోక్స్ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. రెండో సెషన్లో 86 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఒక్క వికెట్‌ను సమర్పించుకోలేదు. ఆఖరి సెషన్లో ఎట్టకేలకు సిరాజ్ పేస్ పదును పెంచడంతో ఫోక్స్ ఆట ముగిసింది. ఆరో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హార్ట్లీ (13)ని సిరాజే అవుట్ చేయగా... రాబిన్సన్ (60 బంతుల్లో 31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రూట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంకో వికెట్ చిక్కేదే కానీ... మూడో సెషన్లో అప్పటికే భారత జట్టు 3 రివ్యూలు అయిపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో రాబిన్సన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్ ధర్మసేన తిరస్కరించాడు. టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. కానీ భారత జట్టుకు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇంత కష్టంలో అంత స్కోరు... ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో రూట్ అత్యధిక స్కోరు 29! కానీ ఈ మ్యాచ్ తన అనుభవాన్నంతా రంగరించి క్లాసిక్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో 57/3తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్ లంచ్ విరామానికే 112/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇంకా రెండు సెషన్ల ఆటలో ఏ జట్టయినా ఆలౌట్ అయినా అవుతుంది. లేదంటే... కిందామీదా పడినా 200 నుంచి 240 పరుగులు చేయడానికి కష్టపడుతుంది. కానీ ఇన్నింగ్స్‌ను నడిపించిన రూట్ ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును ఒక్కరోజులోనే 300 పైచిలుకు చేర్చడం అతని అసాధారణ పోరాటానికి నిదర్శనం! 100 ఇంగ్లండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డెన్నిస్ లిల్లీ, ట్రంబెల్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్ (ఆ్రస్టేలియా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), కొట్నీ వాల్‡్ష (వెస్టిండీస్) ఇంగ్లండ్‌పై 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 8 అరంగేట్రం టెస్టులో నోబాల్‌పై తొలి వికెట్ తీసి దానిని దక్కించుకోలేకపోయిన ఎనిమిదో బౌలర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (శ్రీలంక), మైకేల్ బీర్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), మార్క్ వుడ్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బిన్నీ (భారత్), టామ్ కరన్ (ఇంగ్లండ్), నసీమ్ షా (పాకిస్తాన్) కూడా ఉన్నారు. 313 టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 313 ప్లేయర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్‌లోనే భారత్ నుంచి నలుగురు (రజత్ పటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్) అరంగేట్రం చేయడం విశేషం. 10 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా జో రూట్ గుర్తింపు పొందాడు. రూట్ భారత్‌పై 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ (9– ఆ్రస్టేలియా), గ్యారీ సోబర్స్ (8–వెస్టిండీస్), వివియన్ రిచర్డ్స్ (8–వెస్టిండీస్), రికీ పాంటింగ్ (8–రికీ పాంటింగ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 31 టెస్టుల్లో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన అలిస్టర్ కుక్ (33) రికార్డును రూట్ సమం చేస్తాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) ఆకాశ్ దీప్ 42; డకెట్ (సి) జురెల్ (బి) ఆకాశ్ దీప్ 11; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 106; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 38; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 3; ఫోక్స్ (సి) జడేజా (బి) సిరాజ్ 47; హార్ట్లీ (బి) సిరాజ్ 13; రాబిన్సన్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 302. వికెట్ల పతనం: 1–47, 2–47, 3–57, 4–109, 5–112, 6–225, 7–245. బౌలింగ్: సిరాజ్ 13–3–60–2, ఆకాశ్‌దీప్ 17–0–70–3, జడేజా 27–7–55–1, అశ్విన్ 22–1–83–1, కుల్దీప్ 10–3–21–0, యశస్వి 1–0–6–0. -
IND VS ENG 4th Test: జో రూట్ ఖాతాలో మరో రికార్డు
రాంచీ టెస్ట్‌లో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కిన జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 19000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రూట్ 19000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 444 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం 444 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని విరాట్ కోహ్లి అందరికంటే వేగంగా చేరుకున్నాడు. కోహ్లి 399 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ల్యాండ్‌మార్క్‌ను రీచ్ అయ్యాడు.కోహ్లి తర్వాత సచిన్ టెండూల్కర్ (432), బ్రియాన్ లారా (433) అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వారిలో ఉన్నారు. రాంచీ టెస్ట్‌లో సెంచరీతో రూట్ చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 31వ సెంచరీ, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) 47 సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. తాజా సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND VS ENG 4th Test Day 1: మెరిసిన ఆకాశ్‌దీప్.. సెంచరీతో కదంతొక్కిన రూట్
రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో పర్యాటక ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. జో రూట్ కెరీర్లో 31వ టెస్ట్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి రోజు హైలైట్స్.. టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాశ్‌దీప్ అద్బుతమైన ఇన్ స్వింగర్‌తో జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ బంతిని ఆకాశ్ క్రీజ్ దాటి సంధించడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆకాశ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్థిపై 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఇంగ్లండ్‌పై 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రూట్ చేసిన సెంచరీ టెస్ట్‌ల్లో అతనికి 31వది. అన్ని ఫార్మాట్లలో కలిపితే 47వది. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో (అన్ని ఫార్మాట్లలో) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్ (31), కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు. -
IND VS ENG 4th Test: రోహిత్ శర్మ సరసన చేరిన రూట్
రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత భారత పర్యటనలో పేలవ ప్రదర్శనలతో ముప్పేట దాడిన ఎదుర్కొన్న రూట్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీని రూట్ జట్టు కష్ట సమయం ఉన్నప్పుడు సాధించాడు. తాజా సెంచరీతో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో రూట్‌కు ఇది 31 సెంచరీ. అన్ని ఫార్మాట్లలో ఇది 47 శతకం. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు చేసుకున్నాడు. ఫాబ్ ఫోర్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ (31) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్, కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Joe Root: రూట్ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..
‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌పై వచ్చిన విమర్శలు. అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రూట్‌కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్‌పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు ►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*) ►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37) ►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30) ►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41) ►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51) -
IND VS ENG 4th Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (91) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ (90) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ జట్టు కష్టాల్లో (47/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి అర్దసెంచరీ సాధించాడు. ప్రస్తుతం అతను 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. కెరీర్లో 139వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రూట్.. 30 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 11560 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉంది. కుక్ తన 161 మ్యాచ్‌ల కెరీర్లో 33 సెంచరీలు, 57 అర్దసెంచరీల సాయంతో 12472 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3) ఔట్ కాగా.. రూట్ (67), బెన్ ఫోక్స్ (28) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
కెరీర్ ముగిసిండేది.. జో రూట్‌పై ఆర్పీ సింగ్ సంచలన కామెంట్స్
రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో రూట్‌ను ఉద్దేశించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్ ఆడాలని ఆర్పీ సింగ్ సూచించాడు. కాగా ఈ సిరీస్‌లో రూట్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. జైశ్వాల్‌కు గాయం! ఆట మధ్యలోనే? -
తగ్గుతూ వస్తున్న కోహ్లి ప్రభ.. గణనీయంగా పుంజుకుంటున్న విలియమ్సన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు. Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE — CricTracker (@Cricketracker) February 6, 2024 టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్‌ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు. కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు. కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్‌లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్‌కు మ్యాచ్‌కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్‌ల్లో కనిపిస్తున్నాడు. కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి. -
భారత గడ్డపై జో రూట్ అరుదైన రికార్డు
India vs England, 2nd Test: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ భారత గడ్డపై అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో చేరాడు. టీమిండియాతో రెండో టెస్టు సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. వైజాగ్ వేదికగా రోహిత్ సేన- ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో సోమవారం నాటి నాలుగో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. లక్ష్య ఛేదనలో తడబడుతున్న ఇంగ్లండ్ టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడుతోంది. భోజన విరామ సమయానికి 42.4 ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. గెలుపునకు ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా గెలవాలంటే ఇంకో నాలుగు వికెట్లు తీస్తే చాలు!! ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆటలో భాగంగా 30.4 ఓవర్లో రవిచంద్రన్‌అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రూట్.. భారత గడ్డపై వెయ్యి పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌లో ఈ మైలురాయి అందుకున్న ఐదో విదేశీ బ్యాటర్‌గా జో రూట్ చరిత్రకెక్కాడు. ఇక.. ఈ ఘనత సాధించిన తర్వాత మరొక్క పరుగు చేసిన రూట్(16).. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక జో రూట్ భారత్‌లో వేదికగానే 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది 1-0తో ఆధిక్యంలో ఉండగా.. వైజాగ్‌లో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్‌లో వెయ్యి.. అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ బ్యాటర్లు క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్)- 1359 పరుగులు(సగటు 75.50) అలిస్టర్ కుక్(ఇంగ్లండ్)- 1235 పరుగులు(సగటు 51.45) సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్)- 1042 పరుగులు (సగటు 45.3) మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)- 1027 పరుగులు(సగటు 51.35) జో రూట్(ఇంగ్లండ్)- 1004 పరుగులు(సగటు 45.59). చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్! -
IND VS ENG 2nd Test Day 3: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. రూట్‌కు గాయం
వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్లిప్‌లో క్యాచ్ అందుకనే క్రమంలో రూట్ కుడిచేతి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో హుటాహూటిన అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. రూట్ ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షనలో ఉన్నాడు. అతనికి ఐస్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రూట్ గాయం తీవ్రత ఏంటనేది తెలియాల్సి ఉంది. 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రూట్ బరిలోకి దిగకపోతే ఇంగ్లండ్ విజయావకాశాలు దెబ్బతినవచ్చు. మిడిలార్డర్లో రూట్ కీలకమైన ప్లేయర్. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఆ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో బెన్ డకెట్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కగా.. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి విఫలం కాగా.. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. ఆఖర్లో అశ్విన్ 29 పరుగులు చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది. -
Ind vs Eng: ఇంగ్లండ్‌కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం
టీమిండియాపై తొలి టెస్టులో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోకాలి కారణంగా అతడు విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉపఖండ పిచ్‌లపై బంతి బాగా టర్న్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన జాక్ లీచ్‌తో పాటు యువ బౌలర్లు రెహాన్ అహ్మద్, టామ్ హార్లీలను తుదిజట్టులో ఆడించింది. వీరంతా మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలుపంచుకోగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర బౌలర్ హార్లీ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీస్తే.. రూట్ ఐదు, రెహాన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయమైంది. ఇదిలా ఉంటే... బ్యాటర్ ఒలి పోప్ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 రన్స్ తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో రెండో మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా- ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సిద్ధం కాగా.. జాక్ లీచ్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది: ఇంగ్లండ్ మాజీ సారథి -
ICC: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా.. నంబర్ వన్ గానే అశూ
ICC Test Bowling Rankings: ఐసీసీ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ప్రదర్శన కారణంగా నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగలిగాడు. ఇక భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇలా టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. బ్యాటర్లలో పోప్ ఏకంగా... కాగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. అదే విధంగా.. బుమ్రాకు కూడా ఆరు వికెట్లు లభించగా.. జడ్డూ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ(196)తో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. MEN'S TEST ALL-ROUNDER RANKINGS: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా! మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో.. రవీంద్ర జడేజా 425 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ర్యాంకు నిలబెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు తీయడంతో పాటు జడ్డూ 89 పరుగులు చేశాడు. ఇక అశూ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రూట్ స్టోక్స్‌ను దాటేశాడు. ఇక హైదరాబాద్‌లో 28 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడనుంది. ఈ టెస్టుకు విరాట్ కోహ్లి ఇప్పటికే దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా అందుబాటులో ఉండటం లేదు. ఐసీసీ మెన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 1. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 853 పాయింట్లు 2. కగిసో రబడ(సౌతాఫ్రికా)- 851 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 828 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 825 పాయింట్లు 5. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 818 పాయింట్లు ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ టాప్-5 1. రవీంద్ర జడేజా(ఇండియా)- 425 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 328 పాయింట్లు 3. షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)- 320 పాయింట్లు 4. జో రూట్(ఇంగ్లండ్)- 313 పాయింట్లు 5. బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)- 307 పాయింట్లు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
జో రూట్ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే!
India vs England, 1st Test Day 3: టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో అదరగొట్టాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో... ఇంగ్లండ్ రెగ్యులర్ బౌలర్లు ఒకటీ రెండు వికెట్లకే పరిమితమైన వేళ రూట్ టాప్ వికెట్ టేకర్‌గా నిలవడం విశేషం. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. శనివారం నాటి మూడో రోజు ఆటను 421/7తో మొదలుపెట్టి 436 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు వికెట్లు రూట్ తీసినవే. అవి కూడా ఒకే ఓవర్లో వరుస బంతుల్లో తీయడం విశేషం. 119.3 ఓవర్లో రవీంద్ర జడేజా(87)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న రూట్.. అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో జడ్డూ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా(0)ను అద్భుత రీతిలో క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఒక్క పరుగు చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు డౌన్ ఆ తర్వాతి రెండో ఓవర్‌కే రెహాన్ అహ్మద్ అక్షర్ పటేల్(44)ను అవుట్ చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రూట్, రెహాన్ దెబ్బకు టీమిండియా తమ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్ యశస్వి జైస్వాల్(80) రూపంలో బిగ్ వికెట్ పడగొట్టడం విశేషం. అదే విధంగా శ్రీకర్ భరత్(41)ను కూడా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన టీమిండియా ఓవరాల్‌గా 190 పరుగుల ఆధిక్యంలో నిలవగా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దెబ్బకు దెబ్బ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3 చదవండి: Rohit Sharma: ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?.. అదొక్కటి తప్ప అన్నీ గెలిచాం Joe Root in Indian condition is more threatening as a bowler than a batsman. England is asking too much from him after playing three front line spinners.#INDvsENG #RavindraJadeja #Axar #AUSvsWI #TestCricket #CricketTwitterpic.twitter.com/hmE1SYflNk — Sujeet Suman (@sujeetsuman1991) January 27, 2024 -
IPL 2024: రూట్‌తో పాటు ఇద్దరు విండీస్ స్టార్లను వదిలేసిన రాజస్థాన్
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాయల్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌తో పాటు మరో ఎనిమిది మందిని రిలీజ్ చేసింది. గత సీజన్లో ఆడిన స్టార్ ఆటగాళ్లతో పాటు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించింది. రాజస్థాన్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్లను రాజస్థాన్ మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది. రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. జో రూట్ జేసన్ హోల్డర్ ఓబెద్ మెక్కాయ్ అబ్దుల్ బాసిత్ ఆకాశ్ వశిష్ట్ కుల్దీప్ యాదవ్ మురుగన్ అశ్విన్ కేసీ కరియప్ప కేఎం ఆసిఫ్ రాజస్థాన్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. సంజూ శాంసన్ (కెప్టెన్) జోస్ బట్లర్ షిమ్రోన్ హెట్‌మైర్ యశస్వి జైస్వాల్ ధృవ్ జురెల్ రియాన్ పరాగ్ డొనోవన్ ఫెరియెరా కునాల్ రాథోడ్ రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ సేన్ నవ్‌దీప్ సైనీ ప్రసిద్ద్ కృష్ణ సందీప్ శర్మ ట్రెంట్ బౌల్ట్ యుజ్వేంద్ర చహల్ ఆడమ్ జంపా ఆవేశ్ ఖాన్ (లక్నో నుంచి ట్రేడింగ్) -
ఐపీఎల్-2024కు రాజస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ శనివారం ధృవీకరించింది. రూట్ గత సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో అతడిని రూ. కోటి రూపాయల కనీస ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అయితే తన డెబ్యూ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే రూట్ ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ మ్యాచ్‌లో రూట్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రూట్ తన సేవలందించాడు. జో రూట్ ఐపీఎల్-2024లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. మా ఆటగాళ్ల రిటేన్షన్ను జాబితాను సిద్దం చేసే క్రమంలో అతడు తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడు. అతడు మా జట్టుతో కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఆడినప్పటికీ.. మా ఫ్రాంచైజీలో ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు. మేము కచ్చితంగా అతడి అనుభవాన్ని, ఎనర్జీని మిస్ అవుతాం. ఏదైనప్పటికి అతని నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాము. అతడు తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము అని రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 సాయంత్రం లోపు బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా.. ఆ విలువ ఎంత? -
జో రూట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్.. ఈ అరుదైన మైలు రాయిని రూట్ అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్‌లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో రూట్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రూట్.. 248 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
పాపం రూట్.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్ ఔటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్.. ఓ నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన లోగాన్ వాన్ బీక్ బౌలింగ్‌లో రెండో బంతికి రూట్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. రూట్ సరైన పొజిషేషన్లో లేకపోవడంతో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అస్సలు ఆ బంతికి రూట్ ఆ షాట్ ఆడే అవసరమే లేదు. కానీ అనవసరపు షాట్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే అంతకుముందు ఓవర్లో ఆ తరహా షాటే ఆడి బౌండరీని రూట్ రాబట్టాడు. కానీ రెండో సారి మాత్రం తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2019 వరల్డ్‌కప్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన రూట్.. ఈ సారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు రూట్ కేవలం 203 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అయితే ఏకంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చదవండి: #Maxwell-Cummins: ప్రతి ‘బ్యాట్‌మ్యాన్’కి ఇలాంటి రాబిన్ ఉండాలన్న ఐసీసీ! ఫాస్టెస్ట్ సెంచరీ చేసినపుడు కూడా. View this post on Instagram A post shared by ICC (@icc) -
IND VS ENG: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇలా..
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయం, ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. అదేంటంటే.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరు జట్లలోని నంబర్ 3 ఆటగాళ్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. ఇన్నేళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అందులోనూ ఔటైన ఇద్దరు బ్యాటర్లు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కావడంతో ఈ విషయం మరింత వైరలవుతుంది. భారత్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన విరాట్ 9 బంతులు ఆడి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా.. ఇంగ్లండ్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన జో రూట్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. Just out for a morning walk pic.twitter.com/Mv425ddQvU — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 29, 2023 ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లి డకౌటయ్యాక ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్ మద్దతుదారుల క్లబ్) ఓవరాక్షన్ చేసి ఓ వ్యంగ్యమైన ట్వీట్ చేసింది. కోహ్లి డకౌట్ అయ్యాడని హేళన చేస్తూ బాతుకు (డక్) అతని ఫోటో అతికించి అతి చేసింది. అయితే వారి రాక్షసానందం ఎంతోసేపు నిలువలేదు. వారు విపరీతంగా అభిమానించే సొంత జట్టు ఆటగాడు జో రూట్ కూడా సున్నా పరుగులకే డకౌటయ్యాడు. అది కూడా కోహ్లి కంటే హీనంగా గోల్డెన్ డక్‌గా (తొలి బంతికే ఔట్) వెనుదిరిగాడు. అనంతరం బార్మీ ఆర్మీ అతికి కౌంటర్‌గా భారత అభిమానులు కూడా విరుచుకుడుతున్నారు. Karma is a bitch Barmy Army 💪🏽💥 #INDvsENG https://t.co/pHMSWlqfCG pic.twitter.com/cSvOAHrcdq — Maddy (@maddified18) October 29, 2023 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 23.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్‌స్టో (14), మలాన్ (16), రూట్ (0), స్టోక్స్ (0), బట్లర్ (10), మొయిన్ అలీ (15) ఔట్ కాగా.. లివింగ్‌స్టోన్ (20), క్రిస్ వోక్స్ క్రీజ్‌లో ఉన్నారు. షమీ 3, బుమ్రా 2, కుల్దీప్ ఓ వికెట్ పడగొట్టారు. -
CWC 2023 ENG VS AFG: వరల్డ్‌కప్ రికార్డును సమం చేసిన రూట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టి, వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు ఆందుకున్న నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మొహమ్మద్ కైఫ్ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్ (2015లో స్కాట్లాండ్పై), ఉమర్ అక్మల్ (2015లో ఐర్లాండ్‌పై), క్రిస్ వోక్స్ (2019లో పాకిస్తాన్‌పై)లు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో నాలుగు క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో రూట్ నాలుగు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహీదిని రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్ పట్టిన రషీద్ ఖాన్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. లాంగ్ ఆన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు రూట్. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్ ఔట్ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/2గా ఉంది. డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. -
WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023-England vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్ తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మలన్ విధ్వంసకర శతకం ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో అర్ధ శతకం(52), డేవిడ్ మలన్ సునామీ సెంచరీ(140)తో అద్భుత ఆరంభం అందించారు. ఈ క్రమంలో బెయిర్‌స్టో స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 33.4 ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అదే జోష్‌లో అరుదైన ఘనత కూడా సాధించాడు. మరోసారి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్) రెండు పరుగులు తీసి.. గ్రాహం గూచ్ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1.జో రూట్- 898* 2.గ్రాహం గూచ్- 897 3.ఇయాన్ బెల్- 718 4.అలన్ లాంబ్- 656 5.గ్రేమ్ హిక్- 635. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
CWC 2023 ENG VS NZ: రూట్ కొంపముంచిన రివర్స్ స్వీప్
2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ సేన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. మధ్యలో (ఐదో వికెట్‌కు) కాసేపు (70 పరుగులు) రూట్, బట్లర్ జోడీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినప్పటికీ బట్లర్ వికెట్ పడ్డాక కథ మళ్లీ మొదటికొచ్చింది. Watch Joe Root's reverse-scoop: https://t.co/riEnCtwreZ pic.twitter.com/RCUIh8oFUl — CricTracker (@Cricketracker) October 5, 2023 బట్లర్ ఓటయ్యాక 33 పరుగులు జోడించిన అనంతరం లివింగ్‌స్టోన్ కూడా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 221 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన జో రూట్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. Wait what 🤯! Reverse scoop to Trent Boult 🤯, Joe Root🤌 📸: Disney+Hotstar pic.twitter.com/R1JRhC2BUk — CricTracker (@Cricketracker) October 5, 2023 రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్ స్వీప్ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖర్లో కుదురుకున్న ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ ఇంగ్లండ్ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేసింది. 252 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మరో 30 పరుగులు జోడించి 282 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేసిన జో రూట్
వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. కాగా కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రూట్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. 18555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్ తన వన్డే కెరీర్లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్(758 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చదవండి: గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్ -
వరల్డ్‌కప్‌కు ముందు జో రూట్ ఆసక్తికర నిర్ణయం
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు జో రూట్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో రేపు (సెప్టెంబర్ 20) జరుగబోయే తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతిని తీసుకున్నాడు. రూట్ గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్‌లో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లోకి రావడం కోసం రూట్ పడుతున్న తాపత్రయాన్ని చూసి ఈసీబీ సైతం అతనికి పర్మీషన్‌ను ఇచ్చింది. వరల్డ్‌కప్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చేందుకు రూట్‌కు ఇది చాలా ఉపయోగపడుతుందని ఈసీబీ సైతం భావిస్తుంది. కాగా, ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన సభ్యులను ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. రూట్ ప్రస్తుతం పట్టుబట్టి మరీ ఇంగ్లండ్ జట్టులో చేరాడు. కీలకమైన వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లు గాయాలు బారిన పడకూడదని ఈసీబీ ఐర్లాండ్ సిరీస్‌కు తమ మెయిన్ స్ట్రీమ్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌తో రూట్ చాలాకాలం తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జులైలో సౌతాఫ్రికాతో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన రూట్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రూట్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 6 పరుగులు చేసిన రూట్.. ఆతర్వాత రెండో వన్డేలో డకౌట్, మూడో వన్డేలో 4 పరుగులు, నాలుగో వన్డేలో 29 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (కెప్టెన్), సామ్ హెయిన్, బెన్ డకెట్, జో రూట్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లూక్ వుడ్, ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్,జార్జ్ స్క్రిమ్షా, టామ్ హార్ట్లీ -
WC: కోహ్లి, బట్లర్, బాబర్ కాదు! ఈసారి వరల్డ్‌కప్‌లో టాప్ రన్ స్కోరర్ అతడే!
ICC ODI WC 2023 Top Scorer Prediction: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఇతడేనంటూ ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. వంటి స్టార్లందరినీ కాదని సహచర ఆటగాడికే ఓటువేశాడు. స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా 2019లో సొంతగడ్డపై తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సభ్యుడన్న విషయం తెలిసిందే. నాటి ఈ మెగా ఈవెంట్లో ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మోర్గాన్ బృందం జగజ్జేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను రేసులో నిలిపి విజయం అందించాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్-2019లో ఇంగ్లండ్ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు. ఆ ‘హీరో’ పేరు చెప్పలేదు! అయితే, ప్రపంచకప్-2023లో టాప్ రన్‌స్కోరర్‌గా రూట్.. స్టోక్స్ పేరు చెప్పాడనుకుంటున్నారా? కానే కాదు... ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఎంచుకున్నాడు. ‘‘తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్రాయ్తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతడిది. పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగలడు. ఈసారి ప్రపంచకప్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్ జానీ బెర్‌స్టో’’ అని ఐసీసీతో రూట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెయిర్‌స్టో గణాంకాలు ఇలా కాగా 33 ఏళ్ల జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సాధించిన పరుగులు 3634. కాగా అక్టోబరు 5న భారత్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు తెరలేవనుంది. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! View this post on Instagram A post shared by ICC (@icc) -
చెలరేగిన కొలిన్ మున్రో.. చేతులెత్తేసిన మలాన్, హేల్స్, రూట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్ టీమ్‌లో డేవిడ్ మలాన్ (10), అలెక్స్ హేల్స్ (4), జో రూట్ (14), డేనియల్ సామ్స్ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బాల్, వాన్ డర్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన జో క్లార్క్.. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్ (54), కెప్టెన్ టామ్ ఎబెల్ (32) వెల్ష్ఫైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్ ఫైర్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్ ఫిలప్స్ (12) విఫలమయ్యారు. స్టెఫెన్ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, జాన్ టర్నర్, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
రఫ్ఫాడించిన జో రూట్.. అయినా..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. జో రూట్ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ రాకెట్స్‌ను గెలిపించలేకపోయాడు. చెలరేగిన లారెన్స్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. కెప్టెన్ డేనియల్ లారెన్స్ (49 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లారెన్స్‌తో పాటు జాక్ క్రాలే (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (17 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్), రవి బొపారా (13 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. రాకెట్స్ బౌలర్లలో సామ్ కుక్, ఐష్ సోధి తలో 2 వికెట్లు పడగొట్టారు. రూట్ పోరాటం వృధా.. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విధ్వంసకర వీరులు రాకెట్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (15), డేవిడ్ మలాన్ (1) స్వల్ప స్కోర్లకే ఔట్ కాగా.. రూట్ (35 బంతుల్లో 72 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు).. టామ్ కొహ్లెర్ (23 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ మున్రో (15 బంతుల్లో 24; 3 ఫోర్లు), డేనియల్ సామ్స్ (11 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. లండన్ బౌలర్లలో డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లిస్ ఓ వికెట్ తీశాడు. -
చెలరేగిన డేవిడ్ వీస్.. తుస్సుమన్న విధ్వంసకర వీరులు
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్ కార్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సైఫ్ జైబ్ (21 బంతుల్లో 21; ఫోర్), ఆడమ్ హోస్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. Luke Wood's first 10 balls were something else! 🚀#TheHundred pic.twitter.com/SZWNvcn26V — The Hundred (@thehundred) August 10, 2023 నిప్పులు చెరిగిన లూక్ వుడ్.. సూపర్ ఛార్జర్స్ హిట్టర్లు టామ్ బాంటన్ (0), మాథ్యూ షార్ట్ (8), హ్యారీ బ్రూక్ (0).. రాకెట్స్ పేసర్ లూక్ వుడ్ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్ ఈ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. వుడ్ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. David Wiese 🤝 powerful hitting Insane crowd catch incoming... #TheHundred pic.twitter.com/Gn2MWUNyNW — The Hundred (@thehundred) August 9, 2023 తుస్సుమన్న విధ్వంసకర వీరులు.. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (29), డేవిడ్ మలాన్ (6), కొలిన్ మున్రో (15), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (15), జో రూట్ (4), సామ్ హెయిన్ (20), డేనియల్ సామ్స్ (27).. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు వేన్ పార్నెల్ (3/21), రీస్ టాప్లే (2/20), కల్లమ్ పార్కిన్సన్ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్ బ్యాటర్లు.. సూపర్ ఛార్జర్స్ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. 🚨JOE ROOT STRIKES FOR THE TRENT ROCKETS 🚨#TheHundred pic.twitter.com/JVcWq6nSeZ — The Hundred (@thehundred) August 9, 2023 -
కేన్ విలియమ్స్ ఒక్కడే.. స్మిత్, రూట్, విరాట్ల కంటే ముందే..!
2023 ఆగస్ట్ 8న 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న న్యూజిలాండ్ వన్డే జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్కు యావత్ క్రికెట్ ప్రపంచ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. విలియమ్సన్ బర్త్ డే విషెస్‌తో ఇవాళ సోషల్‌మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. 13 ఏళ్ల కెరీర్లో కేన్ మామ సాధించిన ఘనతలను ప్రస్తావిస్తూ అభిమానులు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కేన్‌ను కీర్తిస్తుంది. ఈ క్రమంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలు, రికార్డులు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తముల్లో ఒకడిగా, ఫాబ్-4 క్రికెటర్లలో ముఖ్యుడిగా, ఈ తరం క్రికెటర్లలో అత్యంత నెమ్మదస్తుడిగా పేరున్న కేన్ మామ.. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 17000కు పైగా పరుగులు సాధించి, న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ను దాదాపు గెలిపించినంత పని చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను అదృష్టం వరించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇనాగురల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (2019-2021) న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు (41), ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ఆటగాడు (17142), బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు.. ఇలా కేన్ మామ తన ప్రతిభ, ప్రవర్తనలతో క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆరాధ్యుడిగా నిలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్‌ల్లో ఘనమైన రికార్డు కలిగిన కేన్ (28 టెస్ట్ సెంచరీలు), ఫాబ్ ఫోర్‌గా పిలువబడే స్టీవ్ స్మిత్ (32 సెంచరీలు), జో రూట్ (30), విరాట్ కోహ్లి (29)ల కంటే ఒకటి, రెండు సెంచరీలు తక్కువగా చేసినా, వీరందరి కంటే ముందే ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్, రూట్,కోహ్లిలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లలో అందరికంటే ముందే అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాలపై సెంచరీలు సాధించి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కేన్ మామ 2018కి ముందే అప్పటికి టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలన్నిటిపై సెంచరీలు సాధించాడు. అప్పటికి స్మిత్, కోహ్లి, రూట్లు ఈ ఘనత సాధించలేదు. కేన్ ఈ ఘనత సాధించిన సమయానికి దిగ్గజాలు మర్వన్ ఆటపట్టు, రాహుల్ ద్రవిడ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, జయవర్ధనే, కలిస్, కిర్‌స్టెన్, లారా, పాంటింగ్, సంగక్కర, యూనిస్ ఖాన్, సచిన్, స్టీవ్ వాలు మాత్రమే ఈ ఘనత సాధించారు. కేన్ విలియమ్సన్ గణంకాలు.. 54.9 సగటుతో 8124 టెస్ట్ పరుగులు (28 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు) 47.8 సగటుతో 6555 వన్డే పరుగులు (13 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు) 123 స్ట్రయిక్‌రేట్‌తో 2464 టీ20 పరుగులు (17 హాఫ్ సెంచరీలు) 126 స్ట్రయిక్‌రేట్‌తో 2101 ఐపీఎల్ పరుగులు (18 హాఫ్ సెంచరీలు) 2018 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ -
రూట్‌తో కలిసి చరిత్ర సృష్టించిన జాక్ క్రాలీ! అరుదైన రికార్డు బద్దలు
Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్‌బాల్ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్‌లో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జో రూట్(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ(54)తో కలిసి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్‌తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్‌కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్ జోడీ వరల్డ్ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో- బెన్‌స్టోక్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలివే! 1.జాక్ క్రాలీ- జో రూట్: మాంచెస్టర్, 2023- ఆస్ట్రేలియా మీద 206(178) 2.జానీ బెయిర్‌స్టో- బెన్ స్టోక్స్: కేప్‌టౌన్, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306) 3.ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్: పెర్త్, 2002- జింబాబ్వే మీద- 233 (203) 4.జాక్ క్రాలీ- బెన్ డకెట్- రావల్పిండి: 2022- పాకిస్తాన్ మీద- 233 (214) 5.జో బర్న్స్- డేవిడ్ వార్నర్- బ్రిస్బేన్: 2015- న్యూజిలాండ్ మీద- 237 (226) 6. ఏబీ డివిల్లియర్స్- గ్రేమ్ స్మిత్- కేప్‌టౌన్: 2005- జింబాబ్వే మీద- 217 (209). చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్.. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్‌లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్‌కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్‌ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్‌లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్‌లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్‌ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్‌ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
రూట్‌ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు. మిస్‌ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్‌డౌన్‌లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్‌ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. రూట్‌ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్‌ను వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్‌ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్‌గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
ఇకపై కోహ్లిని అలా పిలువకండి.. 'కింగ్' ఆ ముగ్గురి సరసన నిలిచే అర్హత కోల్పోయాడు..!
రన్ మెషీన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇకపై ఎంతమాత్రం ఫాబ్-4లో భాగంగా కాదని, టెస్ట్‌ల్లో తరుచూ విఫలమవుతున్న కోహ్లి ఫాబ్-4లో నిలిచే అర్ఘత కోల్పోయాడని, ఇకపై ఎవ్వరూ కోహ్లిని ఫాబ్-4లో ఒకడిగా పిలవకండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు తమకిచ్చిన బిరుదుకు న్యాయం చేస్తున్నారని.. కోహ్లి ఒక్కడే వరుసగా విఫలమవుతూ, అందుకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నాడు. కెరీర్లో (యాషెస్ మూడో టెస్ట్) వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్.. ఇటీవలే 32వ టెస్ట్ శతకాన్ని నమోదు చేయగా.. రూట్ సైతం ఇదే యాషెస్ సిరీస్‌లో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ విషయానికొస్తే.. ఇతను గత మూడేళ్లలో కేవలం ఒక టెస్ట్ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో అతన్ని ఫాబ్-4లో ఒకడిగా సంబోధించడంపై చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయంలో ఆకాశ్ చోప్రా ఓ అడుగు ముందుకేసి, ఎవరూ చేయలేని సాహసం (కోహ్లిని బహిరంగంగా విమర్శించడం) చేశాడు. ఇకపై విరాట్ ఫ్యాబ్ 4లో ఒకడిగా పిలుపించుకోవడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో ఫ్యాబ్-3 మాత్రమే ఉందని అన్నాడు. ఆకాశ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా, ఇందులో నిజం లేకపోలేదు. 2014-2019 వరకు అద్భతంగా ఆడి (58.71 సగటుతో 5695 పరుగులు, 22 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు) ఫాబ్-4లో చోటు దక్కించుకున్న విరాట్.. ఆ తర్వాత మూడేళ్లలో 25 మ్యాచ్‌లు ఆడి కేవలం 1277 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవగం 29.69గా ఉంది. -
స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గిల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్‌లోనూ బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nine wickets ☝ Three hundred and thirty-five runs 🏏 Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J — England Cricket (@englandcricket) June 30, 2023 -
రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన రూట్ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అదేంటంటే.. యాషెస్ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు. ఇక తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు నాటౌట్ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్ హెడ్(77 పరుగులు), డేవిడ్ వార్నర్(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. Joe Root strikes twice in an over and Australia are 5️⃣ down! #EnglandCricket | #Ashes pic.twitter.com/wmn9hC5K6c — England Cricket (@englandcricket) June 28, 2023 చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్ -
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. 2000 పరుగులు, 20 వికెట్లు.. ఇక ఈ మ్యాచ్‌లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్‌లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు. ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్.. తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్‌స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్‌లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్‌స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
లబుషేన్‌కు ఊహించని షాక్.. ప్రపంచ నంబర్ 1 అతడే! వారెవ్వా పంత్..
ICC Test Batting Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో గత ఆరు నెలలుగా నంబర్ 1 హోదాలో కొనసాగుతున్న లబుషేన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రూట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అజేయ సెంచరీతో కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో రూట్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు. అదే సమయంలో లబుషేన్ వరుసగా 0, 13 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. వారెవ్వా పంత్ ఈ నేపథ్యంలో 887 రేటింగ్ పాయింట్లు సాధించిన జో రూట్‌కు అగ్రపీఠం దక్కింది. ఇక టీమిండియా నుంచి యువ వికెట్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటకు దూరంగా ఉన్నప్పటికీ పంత్ ఈ మేరకు పదో ర్యాంకు(758 పాయింట్లు)లో కొనసాగడం విశేషం. ఒక స్థానం దిగజారిన కోహ్లి మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం ఐదో ర్యాంకును నిలుపుకొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జో రూట్- ఇంగ్లండ్- 887 పాయింట్లు 2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు 3. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 877 పాయింట్లు 4. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 873 పాయింట్లు 5. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు. చదవండి: IND vs WI: కిషన్, భరత్‌కు నో ఛాన్స్.. భారత జట్టులోకి యువ వికెట్ కీపర్!