
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో 3000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఓవరాల్‌గా టెస్టుల్లో ఒక జట్టుపై బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 54 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
తన అద్బుత బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. 49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌తో పాటు ఓలీ పోప్(44) ఉన్నారు. అదేవిధంగా భారత్-ఇంగ్లండ్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ వర్సెస్ భారత సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
జో రూట్ - 3007
సచిన్ టెండూల్కర్ - 2535
సునీల్ గవాస్కర్ - 2483
సర్ అలస్టెయిర్ కుక్ - 2431
విరాట్ కోహ్లీ - 1991
చదవండి: IND vs ENG: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్