
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.
బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు.
అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.
41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.
తుదిజట్లు
భారత్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.
ఇంగ్లండ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా