
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.
ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్‌తో విండీస్‌ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.
తుదిజట్లు
భారత్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.
ఇంగ్లండ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.