చ‌రిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భార‌త బౌల‌ర్‌గా | Bumrah breaks Ashwins record for most T20 World Cup wickets for India | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చ‌రిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భార‌త బౌల‌ర్‌గా

Feb 22 2026 9:29 PM | Updated on Feb 22 2026 9:29 PM

Bumrah breaks Ashwins record for most T20 World Cup wickets for India

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆ​రంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్లు ​​​‍‍క్వింటన్ డికాక్‌, రికెల్టన్‌ను బుమ్రా ఔట్ చేశాడు.

మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. 

బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(32), అర్ష్‌దీప్ సింగ్‌(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
జస్ప్రీత్ బుమ్రా-33    
రవిచంద్రన్ అశ్విన్‌- 32
అర్ష్‌దీప్ సింగ్- 32
హార్దిక్ పాండ్యా-29
రవీంద్ర జడేజా-22

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement