వారెవ్వా బుమ్రా.. లెగ్‌ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో | Jasprit Bumrah dismisses Quinton de Kock | Sakshi
Sakshi News home page

T20 WC 2026: వారెవ్వా బుమ్రా.. లెగ్‌ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో

Feb 22 2026 7:49 PM | Updated on Feb 23 2026 8:58 AM

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్  బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను బుమ్రా ఔట్ చేసిన‌ తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న త‌క్కువే.

జ‌స్ప్రీత్ అద్భుత‌మైన బంతితో డికాన్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవ‌ర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివ‌రీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా  స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. 

కానీ బంతి కాస్త లో-బౌన్స్‌గా వచ్చి బ్యాట్‌ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్క‌సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. జ‌స్ప్రీత్ దెబ్బ‌కు డికాక్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌ను కూడా బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు.

తుది జ‌ట్లు
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి



 

 

Advertisement
 
Advertisement
Advertisement