India vs South Africa Super 8 live updates: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల దాటికి 111 పరుగులకే కుప్పకూలింది.
భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు.
ఓటమికి చేరువలో భారత్
15 ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.
భారత్ ఆరో వికెట్ డౌన్
86 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 34 బంతుల్లో 102 పరుగులు కావాలి.
పీకల్లోతు కష్టాల్లో భారత్.. కెప్టెన్ సూర్య ఔట్
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. భారత్ విజయానికి 64 బంతుల్లో 134 పరుగులు కావాలి.
భారత్ నాలుగో వికెట్ డౌన్
43 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అభిషేక్ శర్మ ఔట్
అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 42/3
తిలక్ వర్మ ఔట్
5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.
భారత్ తొలి వికెట్ డౌన్
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్‌క్రమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.
భారత్ టార్గెంట్ ఎంతంటే?
అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు.
డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.
సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్
157 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్
డేవిడ్ మిల్లర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన మిల్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్
డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న మిల్లర్, బ్రెవిస్
30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్
రికెల్టన్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రికెల్టన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 41/3
సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్
12 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్(4).. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 10/1
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.
గత మ్యాచ్‌కు దూరమైన లుంగీ ఎంగిడి, జాన్సెన్, కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో కొనసాగించారు. దీంతో అక్షర్ పటేల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.
తుది జట్లు
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి


