పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టు పతనాన్ని స్టార్క్ శాసించాడు.
స్టార్క్ జోరు ముగింట జోష్ హాజిల్‌వుడ్, కమ్మిన్స్ లేని లోటు అస్సలు కన్పించలేదు. అతడి విజృంభణ ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. అతడితో పాటు అరంగేట్ర పేసర్ బ్రెండన్ డాగెట్ 2 వికెట్లు, గ్రీన్ ఓ వికెట్ సాధించాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్(46), జేమీ స్మిత్(33) ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్(6)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్
చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్


