న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.
"తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. నొప్పి తగ్గిన తర్వాత అతడు తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏమి జరిగిందంటే?
తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్‌కోట్‌లో గోకుల్‌కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.
అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్ ఈ సిరీస్‌కు దూరమైనా టీ20 ప్రపంచకప్-2026 నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది.


