మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ టికెట్ల అమ్మకాలు షురూ | Womens Hockey World Cup starts Ticket Sales | Sakshi
Sakshi News home page

మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ టికెట్ల అమ్మకాలు షురూ

Mar 3 2026 3:53 AM | Updated on Mar 3 2026 3:53 AM

Womens Hockey World Cup starts Ticket Sales

సాక్షి, హైదరాబాద్‌: మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ టికెట్ల అమ్మకాలు సోమవారం మొదలయ్యాయి. టికెట్ల ధరలను రూ. 25 (సౌత్‌ స్టాండ్‌), రూ. 50 (నార్త్‌ స్టాండ్‌), రూ. 100 (ఈస్ట్‌ స్టాండ్‌)గా నిర్ణయించారు. ఈనెల 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ  టోరీ్నలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియా) పోటీపడుతున్నాయి. 

టికెట్లను  https://ticketgenie.in/ticket/FIH-Hockey-World-Cup-2026-Qualifiers వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి కొనుగోలు చేయాలి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ ఖేల్‌ చానెల్‌లో, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తొలి రోజు 8న ఇంగ్లండ్‌తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఆ్రస్టియా (మధ్యాహ్నం గం. 3 నుంచి), స్కాట్లాండ్‌తో వేల్స్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఉరుగ్వేతో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement