వచ్చే మార్చిలో మహిళల మెగా టోర్నీ
సాక్షి, హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్వాలిఫయింగ్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో భాగంగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు హైదరాబాద్ సహా మూడు నగరాలు శాంటియాగో (చిలీ), ఇస్మయిలియా (ఈజిప్ట్)లలో నిర్వహిస్తారు. ప్రపంచకప్‌కు అర్హత సంపాదించేందుకు భారత్‌కు ఇది ఆఖరి అవకాశం. ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలతో భారత్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడనుంది.
హైదరాబాద్ అంచెలో ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోటీలు మార్చి 8 నుంచి 14 వరకు జరుగుతాయి. ఈ క్వాలిఫయర్స్ నుంచి టాప్–3 జట్లు ప్రధాన ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి. బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. పురుషుల విభాగంలో ఇదివరకే భారత్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆసియా కప్‌లో విజేతగా నిలువడంతోనే భారత్‌కు ప్రపంచకప్ బెర్తు లభించింది.


